Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్‌ఫుల్ పాత్రతో ముందుకు రానుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్‌లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది.
చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్
ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment