
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అభిమానులు ముఖ్యంగా యువత ఎంతగానే ఆసక్తి కనబరుస్తుండటంతో ‘రొమాంటిక్’.పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బటయటకువచ్చింది.
`బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామి నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనపడనుందని తెలుస్తోంది. మంగళవారం నుంచి జరుగుతున్న షెడ్యూల్‌లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇక ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు.