
ప్రముఖ నటి రమ్యకృష్ణ 'బాహుబలి' చిత్రంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అందులో శివగామి పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది తెలుగు బిగ్‌బాస్ షోలోనూ ఓసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. తాజాగా రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ గురించి ఫిల్మీదునియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. (చదవండి: పెళ్లి సందడి మళ్లీ మొదలు)
ఆమె ఒక్క రోజు షూటింగ్‌కు 10 లక్షల రూపాయలు తీసుకుంటుందట. ఈ లెక్కన ఆమె ఓ 10 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే నిర్మాత మారు మాట్లాడకుండా కోటి రూపాయలు ఆమె ముందు పెట్టాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఫైటర్" చిత్రంలో నటిస్తున్నారు. అలాగే "లూసిఫర్" తెలుగు రీమేక్‌లో చిరంజీవి సోదరిగా రమ్యకృష్ణ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారు. (చదవండి: కుటుంబ సభ్యులతో శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్)
Comments
Please login to add a commentAdd a comment