
చెన్నై: సీనియర్ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా మద్యాన్ని, కారును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేశారు.
అయితే ఈ కారులో అక్రమంగా తరలిస్తున్న 96 బీర్ బాటిళ్లు, 8 మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో కారును, మద్యం బాటిళ్లు సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుపై డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా తమిళనాడులో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment