దెబ్బ తగిలిందో.. బొమ్మ బంపర్ హిట్టే | Injuries are Vishal's lucky mascot | Sakshi
Sakshi News home page

దెబ్బ తగిలిందో.. బొమ్మ బంపర్ హిట్టే

Published Fri, Jul 11 2014 2:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

దెబ్బ తగిలిందో.. బొమ్మ బంపర్ హిట్టే

దెబ్బ తగిలిందో.. బొమ్మ బంపర్ హిట్టే

షూటింగ్ సమయంలో ఏదైనా దెబ్బ తగిలిందంటే, ఆ సినిమా బంపర్ హిట్ అవుతుందంటున్నాడు తమిళ సినిమాల్లో క్లిక్కయిన తెలుగబ్బాయి విశాల్ కృష్ణ. ప్రస్తుతం శృతి హాసన్తో కలిసి 'పూజై' అనే సినిమాలో విశాల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు అతడి చెయ్యి విరిగింది. అయినా కూడా షూటింగ్ ఏమాత్రం ఆపకుండా అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా సెట్ల మీద షూటింగులో ఉండగా విశాల్ గాయపడటం ఇది రెండోసారి. కరైకుడిలో ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నామని, డైవింగ్ చేస్తుండగా తాను జారిపడుతూ.. ముఖం కిందపడకుండా చెయ్యి అడ్డుపెట్టుకున్నానని, దాంతో చెయ్యి కాస్తా విరిగిందని విశాల్ తెలిపాడు.

సెట్లోనే తనతో పాటు ఓ డాక్టర్, ఓ ఫిజియోథెరపిస్టు కూడా ఉండటంతో షూటింగ్ ఆపలేదని అన్నాడు. తాను షూటింగ్ సమయంలో గాయపడిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా హిట్టయ్యాయని, దాంతో తాను గాయపడితే సినిమా హిట్టవుతుందన్న సెంటిమెంటు తనకుందని, అందుకే షూటింగ్ ఆపలేదని కూడా వివరించాడు. ఈ సినిమాలోనే ఒకసారి విశాల్ గాయపడి ఎక్కువ రోజులు కూడా కాలేదు. హరిగోపాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన టాప్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement