విజయ్‌తో పోటీనా?
నటుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు విశాల్ . తాజాగా హరి దర్శకత్వంలో సొంతంగా నిర్మించి, కథా నాయకుడిగా నటించిన చిత్రం పూజై. శ్రుతి హాసన్ కథానాయికిగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. చిత్ర విజయ యాత్రలో భాగం గా విశాల్ తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడు తూ తాను నటించి, నిర్మించిన పూజై చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృతజ్ఞతలు చెప్ప డం ఇష్టం లేక ప్రత్యక్షంగా కలవడానికి వచ్చానన్నారు. పూజై సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అన్నారు. అలాగే అన్ని వర్గా ల వారు చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి హరి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.
చరిత్రాత్మక చిత్రాలపై ఆసక్తి లేదు
చరిత్రాత్మక చిత్రాలపై ఆసక్తి లేదని విశా ల్ పేర్కొన్నారు. తనకు సాధారణ చిత్రాల్లోని సంభాషణలు పలకడానికే కష్టం. అలాం టిది చారిత్రక చిత్రాల్లోని సంభాషణలు పల కడం మరింత కష్టం అన్నారు. అదే విధంగా పంచ్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడ్డానన్నారు. అందువలనే చారిత్రక కథా చిత్రాలు చేయాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పూజై, కత్తి చిత్రాలు ఒకేసారి తెరపైకి రావడంతో నటుడు విజయ్‌తో ఢీ కొంటున్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. నిజం చెప్పాలంటే తాను విజ య్‌తో పోటీ పడటం లేదని అన్నారు. పూజై చిత్రం ప్రారంభం ముందే దీపావళికి విడుదల చే యాలని నిర్ణయించామన్నారు. విజయ్ కత్తి చిత్రం కూడా అదే సమయంలో విడుదలవుతుందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందేనని విశాల్ వివరించారు.