విశాల్, శృతి జంటగా పూజై | Vishal's 'Poojai' slated for Diwali release | Sakshi
Sakshi News home page

విశాల్, శృతి జంటగా పూజై

Published Thu, Apr 17 2014 12:56 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

విశాల్, శృతి జంటగా పూజై

విశాల్, శృతి జంటగా పూజై

రేసుగుర్రం హిట్తో దూసుకెళ్తున్న శృతిహాసన్ హీరోగా.. తమిళనాట హిట్టయిన తెలుగు నటుడు విశాల్ కృష్ణ హీరోగా రూపొందుతున్న 'పూజై' చిత్రం దీపావళికి విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఇది షూటింగ్ జరుపుకోనుంది. మరో కోలీవుడ్ హీరో విజయ్, సమంత జంటగా నటిస్తున్న 'కత్తి' (తుపాకి-2) కూడా దీపావళికే థియేటర్లను తాకనుంది. అంటే ఈ రెండు సినిమాలు ఒకదాంతో ఒకటి పోటీ పడటం ఖాయమన్నమాట.

ఈ సినిమాతో తొలిసారిగా శృతి హాసన్ విశాల్ సరసన నటిస్తోంది. హరి గోపాలకృష్ణన్ ఈ  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'నాన్న సింగప్పు మణితన్' చిత్రం విజయవంతం కావడంతో విశాల్ మంచి ఊపు మీదున్నాడు. తెలుగునాట తారాపథంలో ఉన్న శృతి జంటగా కలవడంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement