టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే.. | Vishal to star in Tamil remake of 'Temper' | Sakshi
Sakshi News home page

టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే..

Published Fri, Mar 18 2016 1:52 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే..

టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి, మంచి వసూళ్లు రాబట్టిన సినిమా టెంపర్. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్‌లోనే స్థిరపడిన విశాల్ కృష్ణ ఈ రీమేక్‌లో పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టులో శింబు నటిస్తాడని తొలుత కథనాలు వచ్చాయి. కానీ, చివరకు అధికారికంగా వచ్చిన ప్రకటన ప్రకారం విశాల్ హీరో అని తేలింది.

ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తుప్పరివాలన్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అది పూర్తికాగానే టెంపర్ మొదలుపెడతాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్‌కు టెంపర్ సినిమా తెగ నచ్చేసిందని, అందులో ఎన్టీఆర్ చేసిన పాత్రకు న్యాయం చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు. తెలుగులో జూనియర్ సరసన నటించిన కాజల్ అగర్వాలే తమిళంలోనూ హీరోయిన్‌గా చేస్తుందట. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అనల్ అరసు మెగాఫోన్ పట్టుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement