
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. ఎన్టీఆర్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి.
టెంపర్ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించిన పార్తీబన్, టెంపర్ తన సినిమాకు కాపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1993లో తాను తెరకెక్కించిన ఉల్లే వెలియే సినిమా ఆధారంగానే టెంపర్ కథను తయారు చేసుకున్నారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం తాను కాపీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు పార్తీబన్. పూరి దర్శకత్వంలో రూపొందించిన టెంపర్ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై వంశీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత పార్తీబన్
Comments
Please login to add a commentAdd a comment