‘టెంపర్‌’ రీమేక్‌.. తెలుగు డబ్బింగ్ | Vishal Ayogya Will Be Dubbed In Telugu | Sakshi

‘టెంపర్‌’ రీమేక్‌.. తెలుగు డబ్బింగ్

May 25 2019 3:18 PM | Updated on May 25 2019 3:20 PM

Vishal Ayogya Will Be Dubbed In Telugu - Sakshi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. తరువాత ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. తమిళ్‌లో విశాల్‌ హీరోగా అయోగ్య పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపుగా తెలుగు సినిమాను మక్కీ కి మక్కీ దించేసినా క్లైమాక్స్‌ను మాత్రం పూర్తిగా మార్చేశారు.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయోగ్య అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. దీంతో ఇప్పుడు అయోగ్యను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సినిమాను తిరిగి తెలుగులో డబ్‌ చేస్తే ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. నిర్మాత మాల్కాపురం శివ కుమార్‌ అయోగ్య డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకున్నారు. జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement