ఏ హీరోతోనైనా లిప్‌లాక్‌కు రెడీ | Lakshmi Menon ready for Lip Lock with any Hero | Sakshi
Sakshi News home page

ఏ హీరోతోనైనా లిప్‌లాక్‌కు రెడీ

Published Fri, Apr 4 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

ఏ హీరోతోనైనా లిప్‌లాక్‌కు రెడీ

ఏ హీరోతోనైనా లిప్‌లాక్‌కు రెడీ

ఏ హీరోతోనైనా లిప్‌లాక్ కిస్‌లకు రెడీ అంటూ గేట్లు తెరిచేశారు యువ నటి లక్ష్మీమీనన్. నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో నటించిన పెదవి పెదవి చుంభన దృశ్యం ఒక పక్క కలకలం పుట్టిస్తోంది. ఈ పరిస్థితిలో ఈ భామ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. విశాల్, లక్ష్మీమీనన్ జంటగా నటిం చిన చిత్రం నాన్ సిగప్పు మనిదన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, యూటీవీ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకుడు. చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది. చిత్రంలో విశాల్, లక్ష్మీమీనన్ ముద్దు దృశ్యాలాంటి కొన్ని సన్నివేశాల కారణంగా చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్రంలో లిప్‌లాక్ దృశ్యాలను తొలగించినా పర్వాలేదని రీ సెన్సార్‌కు వెళ్లి యూ సర్టిఫికెట్ పొందనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశాల్‌తో కలిసి నటించినట్లుగా ఇతర హీరోలతోను లిప్‌లాక్ సన్నివేశంలో నటిస్తారా? అని లక్ష్మీమీనన్‌ను అడగ్గా కథకు అవసరమైతే ఏ హీరోతోనైనా లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి సిద్ధమంటూ బదులిచ్చారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement