ఎవరేమన్నా అనుకోనీ.. | lakshmi menon lip lock scene big hot titanic | Sakshi
Sakshi News home page

ఎవరేమన్నా అనుకోనీ..

Published Mon, May 19 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

ఎవరేమన్నా అనుకోనీ..

ఎవరేమన్నా అనుకోనీ..

సక్సెస్ మనిషిలో చాలా మార్పు తీసుకొస్తుంది. అది నమ్మకాన్నేకాదు కించిత్ గర్వాన్ని పెంచుతుంది. విజయాన్ని తలకెక్కించుకోరాదంటారు. అయితే దాన్ని అమలుపరచడం అంత సాధ్యం కాదు. నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్‌ను గమనిస్తే సక్సెస్ ఆమెలో ఎంత మార్పును, తెగింపును తీసుకొచ్చిందో అర్థం అవుతుంది. తొలి చిత్రం కుంకీ, సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు, నాన్ శిగప్పుమనిధన్, అంటూ వరుస విజయాలు ఆమె సొంతం చేసుకుంది. ఇటీవల ఇన్ని హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నటి ఈమేనని చెప్పవచ్చు. అంతేకాదు మరో నాలుగైదు చిత్రాలతో ఈ అమ్మడి డైరీ ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి లక్ష్మీమీనన్ తెలుపుతూ జిగర్‌తండా, మంజాపై చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నారు. తాను అంచనాలు పెంచుకున్న మరో చిత్రం సిపాయి అని తెలిపారు.
 
 గౌతమ్ కార్తిక్‌తో రొమాన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. తమది ముచ్చటైన జోడి అని పేర్కొన్నారు. ఇటీవలే ప్లస్ పాసయిన ఈ ముద్దుగుమ్మ చదువైనా నటనైనా ప్రణాళిక అంటూ ఏమీ ఉండదంటున్నారు. లిటరేచర్ ఆఫ్ కామర్స్‌లో ఉత్తీర్ణత పొంది డిగ్రీ పట్టా అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సినిమాలో మంచి పాత్ర అనిపిస్తేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇటీవల నాన్‌శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో నటించిన లిప్‌లాక్ సన్నివేశాలు పెద్ద కలకలాన్నే పుట్టించాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఆ చిత్రంలో తమ మధ్య రొమాన్స్ సన్నివేశాలతోపాటు,  కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఈ సన్నివేశాల్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారని కాబట్టి ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. అసలు అలాంటి ప్రచారం గురించి వినే టైమ్ కూడా తనకు లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఈ భామ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement