ఏ హీరోతో అయినా లిప్‌లాక్‌కు ఓకే | Lakshmi Menon ready for Lip Lock with any Hero | Sakshi
Sakshi News home page

ఏ హీరోతో అయినా లిప్‌లాక్‌కు ఓకే

Published Wed, Jul 30 2014 11:17 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

ఏ హీరోతో అయినా లిప్‌లాక్‌కు ఓకే - Sakshi

ఏ హీరోతో అయినా లిప్‌లాక్‌కు ఓకే

 ఈతరం హీరోయిన్లో హీరోలతో యమ క్లోజ్‌గా ఉండే భామల్లో నటి లక్ష్మీ మీనన్ ఒకరనే ప్రచారం జరుగుతోంది. కుంకి, సుందర పాండియన్, వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి పేరుతోపాటు హోమ్లీ ఇమేజ్‌ను సంపాదించుకున్న లక్ష్మీ మీనన్ ఆ తరువాత తన శైలిని మార్చుకుంటూ వచ్చారు. నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి తన పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను బద్దలుకొట్టారు.

అంతేకాదు హీరోలతో సన్నిహితంగా ఉంటేనే సన్నివేశాలు సహజంగా ఉంటాయని, లేకుంటే అసౌకర్యంగా ఉంటుందన్నారు. విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి మీ స్నేహమే కారణమా? అన్న ప్రశ్నకు, కథ డిమాండ్ చేస్తే ఏ ఇతర హీరోతో అయినా పెదవి ముద్దు సన్నివేశాల్లో నటిస్తానని నిస్సంకోశంగా అంటున్నారీ భామ. ఈమె సిద్దార్ధ్‌తో రొమాన్స్ చేసిన జిగరదండా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement