లిప్‌లాక్ ఓకే కానీ | Poonam Kaur reday for lip lock but | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్ ఓకే కానీ

Published Fri, Jun 27 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

లిప్‌లాక్ ఓకే కానీ

లిప్‌లాక్ ఓకే కానీ

 లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి రెడీ అంటున్నారు నటి పూనంకౌర్. బహు భాషల్లో నటించినా రావలసిన పేరు మాత్రం ఈ బ్యూటీకి రాలేదు. అయితే ఖచ్చితంగా తనకంటూ ఒక స్థానాన్ని కోలీవుడ్‌లో ఏర్పరచుకుంటానంటున్నారు.  ముంబయికి చెందిన ఈ భామ తొలిసారిగా బాలీవుడ్ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటూ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మతో చిన్న ఇంటర్వ్యూ.
 
 సరైన గుర్తింపు పొందలేకపోయారే?

 ఆబాధ నాకూ ఉంది. నేనింత కు ముందు నటించిన చిత్రాల గురించి అందరికీ తెలుసు. ఆ చిత్రాలు రీచ్ అయినంతగా నేను ప్రేక్షకులకు రీచ్ అవలేకపోయాను. అయితే ఆ లోటు ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో చేరుతుందనే నమ్మకంతో ఉన్నాను.
 
 ఆ చిత్రాలు ఏవి?
 ఎన్ వళి తనీ వళీ, గెస్ట్, అచ్చారం, రణం చిత్రాలతో పాటు ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూ పొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంతో నాకంటూ ఒక స్థానం లభిస్తుందని భావిస్తున్నాను.
 
 షూటింగ్‌లో మిలటరీ అధికారులు భయపెట్టారట?

అవును. ఎన్ వళి తనీ వళీ చిత్రంలో ఆర్‌కె కి జంటగా నటిస్తున్నాను. పాటల చిత్రీకరణ కోసం జార్దాన్ వెళ్లాం. జార్దాన్ ప్రాంత సరిహద్దులో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ మమ్మల్ని షూటింగ్ చేయకుండా ఆ దేశ మిలటరి బెదిరించి తరిమేశారు. అనుమతి పత్రాలు చూపడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ పాటలో భలే డాన్స్ చేశాను.
 
వదం చిత్రంలో ఫైట్స్ చేశారటగా?
ఈ చిత్రం షూటింగ్ కొడెకైనాల్‌లో నిర్వహించారు. ఇందులో పగ, ప్రతీకారాల పాత్ర కావడంతో యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. దర్శక, నిర్మాతలు డూప్‌తో చేయిద్దామన్నా వద్దని రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో నటించాను. అనూహ్యంగా కొన్నిసార్లు గాయాలకు గురయ్యాను కూడా. చిత్రం విడుదలానంతరం ప్రేక్షకుల చప్పట్లతో నేను పడిన శ్రమను మరచిపోతాను.
 
 ఎలాంటి షరతులు విధిస్తారు?
 నిజం చెప్పాలంటే నేనెలాంటి షరతులు విధించను. పాత్రకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమించడానికి ఎప్పుడూ సిద్ధమే. చిత్రం ఒప్పుకున్న తరువాత ఎలాంటి సమస్యలు సృష్టించను.
 
 ఎలాంటి పాత్రలు ఆశిస్తున్నారు?

 అతి అనుకోకుంటే నటి శ్రీదేవి, జ్యోతికల మాదిరి నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తే ఆ పాత్రకు ప్రాణం పోయడానికి ఎంత కష్టపడి అయినా నటించడానికి రెడీ. ఈ మధ్య 6 చిత్రంలో నా నటనకు ప్రశంసలందారుు.
 
 హీరోయిన్ ప్రాముఖ్యత వున్న పాత్రలను కోరుకుంటున్నారా?
 అలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకుంటాను. ప్రస్తుతం నటిస్తున్న వదం చిత్రకథ నా పా త్ర చుట్టూనే తిరుగుతుంది. ఇది పూర్తిగా నా కోసమే తయారు చేసిన ట్లు ఉంటుంది.
 
 ఈత దుస్తులు ధరిస్తారా?
  కథకు అవసరం అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధమే గానీ ఈత దుస్తుల్లో మాత్రం నటించను. మోడ్రన్ దుస్తుల్లో గ్లామరస్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. అయితే అందులోను వల్గారిటీ ఉండేలా నటించను.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement