లిప్‌లాక్‌కు ఓకే! | Actress Bharateeyudu ready for lip lock | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌కు ఓకే!

Published Wed, Mar 9 2016 2:53 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

లిప్‌లాక్‌కు ఓకే! - Sakshi

లిప్‌లాక్‌కు ఓకే!

అవసరం అయితే అందాలారబోతకే కాదు, చుంబన సన్నివేశాల్లోనూ నటించడానికి అభ్యంతరం లేదు అంటున్నారు వర్ధమాన నాయకి భారతనాయుడు. ఏమిటీ పేరు చూడగానే ఆంధ్రా అమ్మాయి అనిపించిందా?ఎస్ అక్షరాల ఆరణాల తెలుగమ్మాయి ఈ బ్యూటీ. పుట్టింది గుంటూరు. పెరిగింది హైదరాబాద్. ఇప్పడు తమిళ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.కోలీవుడ్‌లో అంజలి, శ్రీదివ్య తమకే సొంతమైన స్టైల్‌లో రాణిస్తున్నారు. ఆ కోవలో ఈ నవ నాయకి చేరాలని ఆశ పడుతున్నారు.
 
  నాట్యంలో మంచి నైపుణ్యం కలిగిన భారతనాయుడికి తెలుగుతో పాటు తమిళం, కన్నడం,ఆంగ్లం భాషలు ధారాళంగా మాట్లాడగలనంటున్నారు.ఈ బ్యూటీ కోలీవుడ్, టాలీవుడ్‌లలో పలు చిత్రాలు చేస్తుండడం గమనార్హం. అవేమిటో భారతనాయుడి మాటల్లోనే చూద్దాం.ప్రస్తుతం తమిళంలో తేన్‌మిఠాయ్ చిత్రం ద్వారా పరిచయం అయ్యాను. దీనికి జే.భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మిర్చిశివకు జంటగా అడ్రా మచ్చాన్ విజిలు చిత్రం,రాఘవ లారెన్స్ వద్ద కాంచన,కాంచన-2 చిత్రాలకు పని చేసిన  ముత్తుపాండియన్ దర్శకత్వం వహిస్తున్న నిరంజనా చిత్రంలో నటిస్తున్నారు.
 
 వీటితో పాటు రషీద్ దర్శకత్వంలో మంజల్ ఆరు, వరదన్ దర్శకత్వంలో రెండు కోడి మూను కోడి చిత్రాలను కొత్తగా అంగీకరించిన చిత్రాలు. తె లుగులోనూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, రిలేషన్‌షిప్ చిత్రాల్లో కథానాయికిగా నటిస్తున్నాను.  దీపికాపదుకొనే, విద్యాబాలన్ పోషించిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. కథ,పాత్ర డిమాండ్ చేస్తే అందాలారబోతకు,లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదు.తమిళంలో బాలా,మిష్కిన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement