కంగనా కిస్సా? | Over 23000 photos for Kangana Ranaut, Imran Khan's 'Lip to Lip' song | Sakshi
Sakshi News home page

కంగనా కిస్సా?

Published Sun, Sep 6 2015 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

కంగనా కిస్సా?

కంగనా కిస్సా?

కంగనా లిప్ ‘లాక్’ సీన్లు సినిమా సక్సెస్‌‘కి’ వర్కవుట్ అవుతాయా.... కంగనా కిస్సా ఏమిటి? ‘‘ముద్దు సీన్స్‌లో నటించడానికి నాకేం మొహమాటం’’ అన్నట్లుగా ఉంటుంది కంగనా రనౌత్ వ్యవహారం. ఎందుకంటే, ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో దాదాపు అరడజను సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేశారు కంగన. తాజాగా, ‘కట్టీ బట్టీ’ చిత్రం కోసం హీరో ఇమ్రాన్ ఖాన్‌తో కూడా అదే కిస్సా..! ఇక, కంగన ముద్దు, ముచ్చట్లు తెలుసుకుందాం.
 
 తొలి చిత్రంలోనే లిప్ లాక్
 హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నో కలలతో ముంబయ్‌లో అడుగుపెట్టారు కంగనా రనౌత్. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ‘గ్యాంగ్‌స్టర్’లో నటించే అవకాశం వచ్చిందామెకు. ఇందులో ఆమె ఓ డాన్ లవర్. నిత్యం మద్యం మత్తులో ఉంటుంది. తొలి చిత్రంలో ఇలాంటి పాత్ర అంటే సాహసమే. పైగా లిప్ లాక్ సీన్ కూడా ఉంది. కంగన ఏమీ ఆలోచించలేదు.. ఆ సీన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా మొదటి సినిమాలోనే పెదవి ముద్దు సన్నివేశంలో నటించి, నలుగురూ తన గురించి మాట్లాడుకునేలా చేశారామె. అది కంగనాకు మంచి పబ్లిసిటీగా ఉపయోగపడింది. నటనపరంగా కూడా ‘వంక పెట్టలేని ఆర్టిస్ట్’ అనిపించుకున్నారామె.
 
 మనూతో ముద్దుకి సై!
 కంగన కెరీర్ ఓ మెట్టు ఎదగడానికి కారణంగా నిలిచిన చిత్రం ‘తను వెడ్స్ మను’. అప్పటివరకూ నటించిన చిత్రాల ద్వారా కంగన మంచి పెర్ఫార్మర్ అనిపించుకున్నప్పటికీ ఈ చిత్రం నటిగా ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. హోమ్లీ క్యారెక్టర్స్‌కి కూడా కంగన బ్రహ్మాండంగా పనికొస్తుందని ప్రూవ్ చేసిన చిత్రం ఇది. ఇందులో చిత్రకథానాయకుడు మాధవన్‌తో కలిసి లిప్ లాక్ సీన్‌లో నటించారామె. ఫ్యామిలీ మూవీలో లిప్ లాకేంటి? అనే విమర్శలు రాలేదు. ఎందుకంటే చిత్రదర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ సన్నివేశాన్ని ఈస్థటిక్‌గా చిత్రీకరించారు.
 
 ఆ కిస్ సూపర్!
 బాలీవుడ్‌లో ఇప్పటివరకూ చిత్రీకరించిన పెదవి ముద్దు సన్నివేశాల్లో టాప్ టెన్ అనదగ్గ వాటిలో జాన్ అబ్రహాం, కంగనా రనౌత్‌ల కిస్ సీన్ ఉంది. ‘షూట్ అవుట్ ఎట్ వదాలా’ చిత్రం కోసం తీసిన పడక గది సన్నివేశంలో ఈ ఇద్దరి మధ్య పెదవి ముద్దు సీన్ ఉంటుంది. మోస్ట్ హాటెస్ట్ కిస్ సీన్ ఇదని బాలీవుడ్ వర్గాలు కితాబులిచ్చాయి. 2013లో ఈ కిస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అంతగా ఘాటైన ముద్దు సన్నివేశంలో నటించిన జాన్ అబ్రహాం ఇకనుంచి అలాంటి సీన్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రియా రుంచల్‌ని పెళ్లి చేసుకున్నాక జాన్ తీసుకున్న నిర్ణయం ఇది.
 
 రాణి ముద్దు బాగుందన్నారు
 ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కి కంగన పనికొస్తుందని ప్రూవ్ చేసిన చిత్రం ‘క్వీన్’. ఆత్మస్థైర్యం ఉన్న పంజాబీ అమ్మాయి రాణీ మెహ్రాగా ఇందులో కంగన కనబర్చిన అభినయం సూపర్. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా దక్కిందామెకు. ఈ చిత్రంలో ఓ ఇటాలియన్ చెఫ్‌తో కంగన లిప్ లాక్ చేశారు. అక్కడ ఆ ముద్దు ఉంటేనే బాగుంటుందని స్వయంగా కంగనాయే సజెస్ట్ చేసిందని చిత్రదర్శకుడు వికాస్ బహల్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సినిమా చూసినవాళ్లకి కూడా అది ‘పెట్టుడు ముద్దు సీన్’ అనిపించలేదని, బాగుందని అన్నారు.
 
 హీరో పెదవి కొరికేసిన కంగనా
 ఓ పొలిటికల్ పార్టీకి లీడర్‌గా కంగనా రనౌత్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించిన చిత్రం ‘రివాల్వర్ రాణి’. ఈ చిత్రంలో ఓ హాట్ లిప్ లాక్ సీన్ ఉంది.  సినిమాలో వీర్ దాస్‌ని మీదకు లాక్కుని అతని అధరాలను కంగన క్యారెక్టర్ చుంబిస్తుంది. వీర్ దాస్, కంగన పాల్గొనగా ఈ సీన్ తీసినప్పుడు ఓ తమాషా జరిగింది. పొరపాటున వీర్ దాస్ పెదాలను కంగనా కొరికేశారు. ఆ బైట్ కారణంగా వీర్ పెదాల నుంచి రక్తం కారిందంటే ఏ రేంజ్‌లో కంగన కొరికేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఈ ముద్దు చాలా హాట్ గురూ అని బాలీవుడ్‌వారు సర్టిఫికెట్ ఇచ్చేశారు.
 
 ముద్దు సీన్‌కి 24 గంటలు
 ఇప్పటివరకూ కంగనా చేసిన కిస్ సీన్స్ అన్నీ ఒక ఎత్తయితే ‘కట్టీ బట్టీ’లో చేసిన సీన్ మరో ఎత్తు అనే చెప్పాలి. ‘లిప్ టు లిప్ కిస్సియాన్..’ అనే పాట కోసం చిత్రకథానాయకుడు ఇమ్రాన్ ఖాన్, కథానాయిక కంగన పాల్గొనగా ఈ సీన్ తీశారు. రోజుకి ఎనిమిది గంటలు చొప్పున మూడు రోజులు ఇమ్రాన్, కంగన మధ్య ఈ సీన్ తీశారు. మోషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ లిప్ లాక్ సీన్‌ని చిత్రీకరించారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ చిత్రాల్లోనే ఈ టెక్నాలజీని వాడారు. సో.. మోషన్ టెక్నాలజీ వాడిన తొలి భారతీయ చిత్రంగా ‘కట్టీ బట్టీ’ రికార్డ్ సొంతం చేసుకుంది. మరి.. ఈ లిప్ లాక్‌కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement