లిప్ లాక్‌కు సై | Regina cassandra in lip lock | Sakshi
Sakshi News home page

లిప్ లాక్‌కు సై

Published Sun, Nov 1 2015 8:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

లిప్ లాక్‌కు సై

లిప్ లాక్‌కు సై

చెన్నై: లిప్ టూ లిప్ కిస్‌లకు ఛీఛీ, ఛాఛా అనే హీరోయిన్లు ఒకప్పుడు ఉండేవారేమో కాదనలేమ్. ఇప్పుడు అలాంటి హీరోయిను జల్లెడేసినా కనిపించరేమో. లిప్ లాక్‌కు నేను దూరం అనే మాటలు ఇంతకుముందు అక్కడక్కడా వినిపించేవి. ఇప్పుడు మాత్రం నేను సైతం అనే వారే కనిపిస్తున్నారు. పైగా అందులో తప్పేముంది అని ప్రశ్నించడానికి వెనుకాడటం లేదు. ఒకప్పటి పాశ్చాత్య సంప్రదాయం అయిన చుంభనాల చర్య ఇప్పుడు స్వదేశీ ఆనవాయితీగా మారిపోయింది. ఈ దృశ్యాలు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో పెరిగిపోతున్నాయి.

ఇక ఆ మధ్య గ్లామర్‌కు నేను దూరం అంటూ మడి గట్టుకున్నట్లు నటించిన నటి రెజీనా అందాల ఆరబోతలో హద్దులు మీరడానికి వెనుకాడనంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. ఆ ఏముందిలే గ్లామర్ గురించేగా ఈ గడుగ్గాయి అంది అని సరిపెట్టేసుకుంటే ఇప్పుడు లిప్ టూ లిప్ కిస్‌లకు నేను సైతం అనేసింది. అంతేకాదు నేను నటించే లిప్ లాక్ సన్నివేశం ఎలా ఉండాలంటే అదో కొత్త ట్రెండ్‌కు దారితీయాలి.

రికార్డు సృష్టించాలి అంటోంది. కొసమెరుపుగా ఇందుకు కథ డిమాండ్ చేయాలి సుమా అని దీర్గాలు తీస్తోంది. ఇంతకీ ఈ రెజీనా గుర్తుందా? ఆ మధ్య కేడీ బిల్లా కిలాడీ రంగా తదితర రెండు మూడు చిత్రాలు చేసింది. ఆ తరువాత ఇక్కడ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు గెంతింది. అక్కడ అవకాశాలు, అందస్తు బాగానే పెంచుకుంది. క్రేజీ హీరోయిన్‌గా ఎదగడానికే ఇప్పుడీ లిప్ టూ లిప్ ఎత్తుగడ అని అర్థం కావడంలేదూ. ఏమిటీ రెజీనా పెద్ద నెరజాణే అనిపిస్తుందా? ఎంతైనా నటి కదా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement