డిమాండ్‌ చేస్తే లాక్‌ చేస్తా! | "If the story demands, I'm going to act in lip lock scenes | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ చేస్తే లాక్‌ చేస్తా!

Published Thu, Jun 1 2017 11:38 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

డిమాండ్‌ చేస్తే లాక్‌ చేస్తా! - Sakshi

డిమాండ్‌ చేస్తే లాక్‌ చేస్తా!

టాలీవుడ్‌ సెన్సేషన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పటికే చాలామంది కుర్రాళ్ల గుండెల్లో లాక్‌ అయిపోయారు. లాక్‌ చేయడానికి తనకూ అభ్యంతరం లేదంటున్నారామె. అయితే, ఇది వేరే లాక్‌. దాని పేరు ‘లిప్‌ లాక్‌’. హిందీ చిత్రం ‘యారియాన్‌’, తెలుగు ‘కిక్‌–2’తో కలిపి కొన్ని చిత్రాల్లో రకుల్‌ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేశారు. ఈ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని రకుల్‌ చెబుతూ – ‘‘కథ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించేందుకు నాకు అబ్జెక్షన్‌ లేదు.

అయితే ఆ సన్నివేశం సినిమాకు అతికించినట్టు ఉండకూడదు. ఆ సీన్‌ లేకపోతే అక్కడ పేలవంగా ఉంటుందనిపించాలి. ఆ రేంజ్‌ డిమాండ్‌ ఉంటేనే నేను లిప్‌ లాక్‌ సీన్‌ చేస్తా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమాలో ఏ సీన్‌ని తీసుకున్నా ఏదో ఒకటి చేయాల్సిందే. ఏడ్చే సీన్‌లో ఏడవాలి. నవ్వే సీన్‌లో నవ్వాలి. రొమాంటిక్‌ సీన్‌లో రొమాన్స్‌ చేయాలి. అయితే మిగతా సీన్స్‌ గురించి మాట్లాడకుండా రొమాంటిక్‌ సీన్స్‌.. ముఖ్యంగా లిప్‌ లాక్‌ సీన్స్‌ గురించి ఎక్కువగా డిస్కస్‌ చేసుకుంటారు. కథ డిమాండ్‌ మేరకు మిగతా సీన్స్‌ ఎలా చేస్తానో.. రొమాంటిక్‌ సీన్స్‌ని కూడా అలాగే చేస్తాను’’ అని రకుల్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement