
చర్చనీయాంశమైన లిప్‌లాక్
పాశ్చాత్య పోకడలు బాలీవుడ్‌లో రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే సహజీవనం అని కొందరు, పెళ్లికి ముందే శృంగారం అంటూ మరి కొందరు, మరోవైపు తెరపై విశృంఖలంగా లిప్‌లాక్‌లు ఇలా దాదాపు హాలీవుడ్ సంప్రదాయాలకు దగ్గరగా వెళ్లిపోతోంది బాలీవుడ్. నిజానికి మన భారతీయ సంస్కృతికి ఈ విధానం పూర్తి విరుద్ధం. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు, మళ్లీ మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని గౌరవించే రోజులు వస్తాయిలే అని ఆశావహులందరూ ఎదురు చూస్తున్న ఈ సమయంలో... వారి ఆకాంక్షలపై నీళ్లు జల్లుతూ... ఇటీవల జరిగిన ఐఫా వేడుకలో కరీనా కపూర్, బిపాసా బసు మరో వికృతమైన కొత్త పోకడకు తెర లేపారు.
సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కరచాలనం చేసుకోవడం, మరీ క్లోజ్ ఫ్రెండ్సయితే ఆలింగనం చేసుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరు స్నేహితురాళ్లు ఐఫా వేడుకల్లో కలుసుకొని ఒక్కసారిగా అందరూ ‘హవ్వ..’ అనుకునేలా లిప్‌లాక్ చేసేసుకున్నారు. ఆ వేడుకలో వీరి లిప్‌లాక్ సర్వత్రా చర్చనీయాంశమైంది. హలీవుడ్‌లో లీసా, కేటీఫెర్రీ... ఇలాగే గతంలో లిప్‌లాక్ చేసుకున్నారు. అక్కడ ఇవన్నీ సహజం. కానీ మనది భారతదేశం. ఇక్కడ ఇలాంటివి చేయడం అంత చిన్న విషయం మాత్రం కాదు. ‘అందరూ సిగ్గు పడేలా ఇలా ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి, మన సంస్కృతికే వీరిద్దరూ మచ్చ తెచ్చారు’ అని ఆ వేడుకలో పలువురు బాహాటంగానే విమర్శించారట. ప్రస్తుతం హిందీ చిత్రసీమ అంతా ఈ లిప్‌లాక్ గురించే చెప్పుకుంటున్నారు.