కోటిస్తే.. ఆరబోస్తా | lakshmi menon ready for skinshow if offered one crore | Sakshi
Sakshi News home page

కోటిస్తే.. ఆరబోస్తా

Published Mon, Jun 30 2014 9:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

కోటిస్తే.. ఆరబోస్తా

కోటిస్తే.. ఆరబోస్తా

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అయితే అందులో గ్లామర్‌ను హీరోయిన్లు సాదకంగా వాడుకుంటూ పారితోషికాన్ని పెంచుకుపోతున్నారు. ప్రస్తుతం కొన్ని మంచి కథా చిత్రాలు వస్తున్న గ్లామర్ డిమాండ్ గ్లామర్‌దే. కాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్ కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ల క్లబ్‌లో చేరడానికి తహతహలాడుతుండటమేమిటి! కుంకి చిత్రంలో కొండవాసి పడతిగా మంచి అభినయాన్నే ప్రదర్శించిన ఈ మళయాళ భామ అలా మరో రెండు చిత్రాల్లో నటించిందో లేదో అప్పుడే గ్లామర్‌ ప్రదర్శనకు రెడీ అయిపోయింది.
 
అదృష్టం తరుముకొస్తున్నట్లు ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదట్లో మోడ్రన్ దుస్తులు తన శరీరాకృతికి సరిపడవని, పక్కింటి అమ్మాయి ఇమేజ్ చాలని దీర్ఘాలు తీసిన లక్ష్మీమీనన్ నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో లీనమై నటించేసింది. అదేమంటే కథ డిమాండ్ మేరకే నటించాల్సి వచ్చిందని స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. ఆ తరువాత ఎలాంటి చుంబనాలకైనా రెడీ అంటూ గేట్లు తెరిచేసింది.
 
దీంతో దర్శక నిర్మాతలు ఆమె కాల్‌షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లక్ష్మీమీనన్ తన పారితోషికాన్ని ఐదు లక్షలు, పది లక్షలు, అంటూ పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం అరకోటికి చేరిన లక్ష్మీమీనన్ ఇక తన పారితోషికం కోటి అంటోందట. కోటంటే మరి ఎక్కువ అంటున్న దర్శక నిర్మాతలతో కావాలంటే మరిన్ని ముద్దు సన్నివేశాల్లో, మరింత అందాలు ఆరబోయడానికి తాను రెడీ అని నిర్మాతల్ని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తుందట మాలీవుడ్ ముద్దుగుమ్మ లక్ష్మీమీనన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement