Anchor Anasuya Celebrating 12th Wedding Anniversary Video Goes Viral - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌

Published Sun, Jun 5 2022 10:56 AM | Last Updated on Sun, Jun 5 2022 7:21 PM

Anchor Anasuya Celebrating 12th Wedding Anniversary Video Viral - Sakshi

Anchor Anasuya Celebrating 12th Wedding Anniversary Video Viral: టాలీవుడ్‌ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్​ గురించి పరిచయం అక్కర్లేదు. అటు యాంకరింగ్‌.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం దర్జా, వాంటెడ్‌ పండుగాడ్‌, గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, యాంకరింగ్‌తోపాటు సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. గ్లామరస్‌ ఫొటోలతోపాటు కుటుంబంతో ఆడిపాడే క్షణాలు పోస్ట్‌ల రూపంలో అభిమానులతో పంచుకుంటుంది రంగమ్మత్త. తాజాగా తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ తో బీచ్‌లో సందడి చేసిన వీడియోను షేర్‌ చేసింది. 

అనసూయ, సుశాంక్‌ ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని, లిప్‌లాక్‌, రొమాంటిక్‌ ఫొజులతో ఈ వీడియో నిండిపోయింది. తమ 12వ వెడ్డింగ్‌ యాన్నివర్సరీ సందర్భంగా భర్తతో పకృతి ఒడిలో సముద్రం ఒడ్డున నీటి అలల మధ్య గడిపింది అనసూయ. ఈ వీడియో షేర్‌ చేస్తూ 'ప్రియమైన నిక్కూ.. మనిద్దరం కలిసి ఉండటమే నాకు ఓ అద్భుత ప్రదేశం. నువ్‌ నా పక్కనే ఉంటే చాలు ఒక్క చేత్తో ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇన్నేళ్ల మన లవ్‌ జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మధుర క్షణాలు. అన్నింటిని మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అని రాసుకొచ్చింది. 

చదవండి: మగజాతి పరువు తీస్తున్నారు: దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్‌


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనసూయ, సుశాంక్‌ల మధ్య పరిచయం ఏర్పడి 21 సంవత్సరాలు అయింది.  9 ఏళ్ల డేటింగ్‌ అనంతరం అనసూయ, సుశాంక్‌ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement