నన్ను.. నేను.. పెళ్లి చేసుకున్నా?! | Italian woman marries herself | Sakshi
Sakshi News home page

నన్ను.. నేను.. పెళ్లి చేసుకున్నా?!

Published Fri, Sep 29 2017 7:34 PM | Last Updated on Fri, Sep 29 2017 7:35 PM

Italian woman marries herself

ఇదేంటి.. శీర్షికలో తప్పుందా.. లేక​నేను తప్పు చదివానా.. అన్న అనుమానం మీకు వచ్చిందా?  మ అనుమానం నిజమే.. శీర్షికలో పొరపాటు లేదు. మరి ఇదేం విడ్డూరం.. ఒంటరిగా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అసలు ఎక్కడైనా జరుగుతుందా? అన్న సందేహం మీకు వచ్చిందా? మీ అనుమానాల నివృత్తి కోసం ఈ స్టోరీని చదివేయండి.

న్యూఢిల్లీ :  ఇదిగో ఇక్కడ ఫొటోలో పెళ్లి కూతురు దుస్తుల్లో ధగధగా మెరుస్తున్న అమ్మాయి పేరు లారా మెస్సీ. ఉండేది ఇటలీలోని మిలన్‌ పట్టణంలో..  అక్కడ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తోంది. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అనే మాట ఈ అమ్మాయి విషయంలో అక్షరాలా నిజం. పెళ్ళి చేసుకోవడానికి నాకు  పురుషుడితో పనిలేదు.. నన్ను నేనే వివాహం చేసుకుంటాను.. అని పట్టుబట్టి అలాగే చేసుకుంది. తనను తాను చేసుకునే పెళ్లికి కూడా ఈ అమ్మడు.. అక్షరాలా రూ. 8 లక్షలను ఖర్చుచేసింది. ఈ ఒంటరి పెళ్లిని మెస్సీ బంధువులైన 70 కుటుంబాల వారు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిని అక్కడి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు గుర్తించలేదట.

ఇంతకూ ఈ అమ్మడు ఇంత అఘాయిత్యపు చేష్టలకు ఎందుకు దిగిందనే సందేహం పెళ్లికి వచ్చిన ఒక పెద్దాయన వచ్చింది. అదే తడవుగా.. మెస్సీని అడిగేశాడు.. అందుకు మెస్సీ సమాధానమిస్తూ.. నేను ఒక అబ్బాయి 12 ఏళ్ల పాటు లివ్‌ రిలేషన్‌ షిప్‌ కొనసాగించాం.. ఈ మధ్యనే మేం బ్రేకప్‌ అయ్యాం.. బ్రేకప్‌ తరువాత నాకు ఒకటే అనిపించింది..  స్త్రీ జీవించేందుకు మగ తోడు అవసరం లేదనిపించింది.. అందుకే ఇలా ఒంటరిగా నన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది.

అన్నట్లు కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.. గురువారం తన 40 పుట్టిన రోజును జరుపుకుంది. మరో విషయం ఏమిటంటే.. సాధారణంగా ఎలా పెళ్లి జరుగుతుందో.. అచ్చం అలాగే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు.,  ఈ వివాహానికి హాజరైన వారంతా.. పిదకాలం.. పిదపబుద్ధులు అనుకుంటూ వెళ్లి పోయారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement