న్యూఢిల్లీ: దేశ నావికాదళం 25వ చీఫ్‌గా అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సర్వీస్ నుంచి రిటైరవుతున్న అడ్మిరల్ కరంబీర్‌సింగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి విజయలక్ష్మికి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. అడ్మిరల్ కుమార్ ఇప్పటి వరకు వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛీఫ్‌గా వ్యవహరించారు.
1962 ఏప్రిల్ 12వ తేదీన కేరళలో జన్మించిన అడ్మిరల్ కుమార్ భారత నావికాదళంలో 1983 జనవరి ఒకటో తేదీన జాయినయ్యారు. దాదాపు 39 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్ విభాగాల్లో పలు బాధ్యతలు చేపట్టారు. ఐఎన్‌ఎస్ నిషాంక్, ఐఎన్‌ఎస్ కోరా, ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, ఐఎన్‌ఎస్ విరాట్‌లపై కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. వెస్టర్న్ ఫ్లీట్‌కు ఆపరేషన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పరమ విశిష్ట, అతి విశిష్ట, విశిష్ట సేవా పతకాలను ఆయన అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment