వ్యక్తి అనుమానాస్పద మృతి
నిడదవోలు : పట్టణంలోని పాటిమీద సెంటర్‌లో ఇండియన్ బ్యాంకు అరుగుపై ఓ వ్యక్తి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన చాపల కొండయ్య (45) తీ¯Œæమార్ బృందంలో డప్పు వాయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. బుధవారం ఆయన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వెళ్లాడు. తిరిగి గ్రామానికి బయలుదేరాడు. ఏమైందో ఏమోగానీ గురువారం పట్టణంలోని బ్యాంకు ముందు మృతిచెంది పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ డి.భగవా¯Œæప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి S భార్య మంగ, ముగ్గురు కుమారులు ఉన్నారు.
దళిత సంఘాల రాస్తారోకో
కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో రెవెన్యూ, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రి ముందు దళిత సంఘాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పట్టణ ఎస్‌ఐ డి.భగవాన్‌ప్రసాద్ ఆందోళనకారులతో చర్చించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని సూచించడంతో వారు రాస్తారోకోను విరమించారు. ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. చాపల కొండయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.