లక్ష్మీపురం పరిధిలోని పోలవరం కుడికాలువ గట్టుపై అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం మంగళవారం లభ్యమైంది.
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతదేహం
Dec 7 2016 12:59 AM | Updated on Sep 4 2017 10:04 PM
లక్ష్మీపురం(పెదవేగి రూరల్) : లక్ష్మీపురం పరిధిలోని పోలవరం కుడికాలువ గట్టుపై అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం మంగళవారం లభ్యమైంది. పెదవేగి ఎస్సై వీరంకి రామకోటేశ్వరరావు కథనం ప్రకారం.. పెదవేగి మండలం లక్ష్మీపురం పరిధిలోని సాయిబాబా మందిర సమీపంలో పోలవరం కుడికాలువ గట్టుపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉందని స్థానిక వీఆర్వో పసుపులేటి విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరావు, ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, ఎస్సై రామకోటేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో చుట్టుపక్కల గాలించారు. ఆమె హత్యకు గురైందా? లేక ఏమై ఉంటుంది అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement