కొద్దిరోజుల్లో దూరం కానున్న గార్డెన్ ఛాయ్ కోసం శనివారం నగర ప్రజలు బారులు తీరారు. ఆదివారం నుంచి రెస్టారెంట్ మూతపడనున్నట్లు తెలియడంతో గార్డెన్ రెస్టారెంట్ అభిమానులు వందల సంఖ్యలో క్లాక్‌టవర్ వద్దకు తరలి వచ్చి గార్డెన్ రెస్టారెంట్‌లో ఉస్మానియా బిస్కెట్, ఇరానీ చాయ్ సేవించారు. ఈ సందర్బంగా రెస్టారెంట్‌కు వచ్చిన ప్రతి కస్టమర్ హోటల్ కనుమరుగుకానుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు యువకులు చివరి ఛాయ్‌గా భావించి చీర్స్ కొట్టి మరీ ఛాయ్ మాధుర్యాన్ని గుండెలనిండా నింపుకున్నారు. పలువురు సీనియర్ సిటిజన్లు గార్డెన్ రెస్టారెంట్‌తో తమకు దశాబ్దాల తరబడి పెనవేసుకున్న అనుబంధాన్ని మననం చేసుకోవడం గమనార్హం. శనివారం గార్డెన్ రెస్టారెంట్‌లో కనిపించిన దృశ్యాలివీ..
కొసమెరుపు...ఇదిలా ఉండగా మెట్రో అధికారుల నుంచి పరిహారం అందని కారణంగా ఈ ప్రాంతంలో మెట్రో పనులకు మరికొంత కాలం పట్ట వచ్చునని సమాచారం. అప్పటి వరకు గార్డెన్ రెస్టారెంట్ యధావిధిగా కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
- సికింద్రాబాద్
లాస్ట్ కప్...చివరి సిప్
Published Sun, Feb 22 2015 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement