'ఇరానీ చాయ్‌'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్‌ ఎక్కడంటే.. | Sakshi
Sakshi News home page

'ఇరానీ చాయ్‌'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్‌ కేఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటే..

Published Tue, May 7 2024 1:32 PM

The History Of Irani chai And Its Origin In Hyderabad

పనివేళ్లల్లో కాస్త 'టీ బ్రేక్‌' ఎంతో హాయినిస్తుంది. కడుపులో కాసింత టీ పడగానే హమ్మాయ్యా..! అనిపిస్తుంది. వెంటనే ఉత్సాహంగా పనిచేసుకుంటాం. కాస్త సమోసాలు, పేస్ట్రీలు, వంటి ఇతర స్నేక్స్‌ ఐటెమ్స్‌ ఏం తిన్నా.. ఆ తర్వాత కచ్చితంగా 'టీ' సిప్‌ చేయాల్సిందే. అలాంటి చాయ్‌లను ఎన్నో రకాలుగా తయారు చేసి అందిస్తు​న్నాయి పలు కేఫ్‌లు. వాటిల్లో 'ఇరానీ చాయ్‌' టేస్ట్‌ మాత్రం అందరి మనసులను దోచుకుంది. సరదాగా బయటకు వెళ్లి తాగాలనుకుంటే ఇరానీ చాయ్‌ సిప్‌ చేస్తే చాలు అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదు. మరీ ఆ ఇరానీ చాయ్‌ ఎక్కడ నుంచి మన నగరానికి వచ్చింది..? దాని మూలం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!

ఇరానీ చాయ్‌ హిస్టరీ..
జొరాస్ట్రియన్‌ ఇరానియన్లు పర్షియా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చినప్పుడూ..ఈ చాయ్‌ పరిచయమయ్యిందని చెప్పొచ్చు. వీళ్లు మన దేశానికి 18, 19వ శతాబ్దాలలో వచ్చారట. అయితే 18వ శతాబ్దంలో వచ్చినవారిని పార్సీలు అనిపిలిచేవారట. వారు గుజరాత్‌, బొంబాయిలలో స్థిరపడిపోయారు. అయితే 19వ శతాబ్దంలో వచ్చిన వాళ్లు మాత్రం వివిద ప్రాంతాలకు చెదిరిపోయారు. పార్సీలు ప్రధానంగా గుజరాతీ మాట్లాడుతుండగా, తర్వాత వచ్చినవారు మాత్రం ప్రధానంలో పార్సీలోనే సంభాషించడంతో వాళ్లని ఇరానియన్లు లేదా ఇరానీలుగా గుర్తించారు. 

వారు వస్తూ..వస్తూ..తమ మాతృభూమికి సంబధించిన ప్రత్యేకమైన చాయ్‌ రుచిని చూపించారు. అలా హైదరాబాద్‌ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఈ వలసదారులు  కేఫ్‌లను ఏర్పాటు చేయడంతో దీని రుచి ప్రజలకు పరిచయమయ్యింది. వాళ్లు మొదట బొంబాయి,పూణే నుంచి హైదరబాద్‌కు వలస రావడం జరిగింది. అలా మన హైదరాబాద్‌ ఈ ఇరాన్‌ కేఫ్‌లకు సెంటర్‌గా మారింది. అందువల్లే దీన్ని హైదరాబాదీ చాయ్‌ లేదా ఇరానీ దమ్‌ చాయ్‌ అని పిలుస్తారు. ఇక హైదరాబాద్‌లో ది బెస్ట్‌ ఇరానీ చాయ్‌లు ఏవంటే..

ది బెస్ట్‌ ఇరానీ చాయ్‌లు..
గ్రాండ్ హోటల్
హైదరాబాద్‌లోని కోటీలో 1935లో ఈ హోటల్‌ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రద్దీగా ఉండే ఫేమస్‌ హోటల్‌గా స్థిరపడిపోయింది. ఈ హోటల్‌ బిర్యానీతో సహా అనేక స్థానిక డిలైట్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ చాయ్‌ని వారు సంప్రదాయ పద్ధతిలో చిక్కటి క్రీమ్‌ మాదిరిగా తయారు చేస్తారు. ధర వచ్చేసి రూ. 150/-

కేఫ్ నీలోఫర్
ఇరాన్‌కు చెందిన నిజాం కోడలు ఈ కేఫ్‌కి నామకరణం చేసిందట. ఇది 1978 నుంచి ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్‌లకు ఫేమస్‌. ఇక్కడ తాజాగా కాల్చిన బన్‌ మాస్కా తోపాటు రిచ్‌ మలైతో కూడిన కడక్‌ చాయ్‌ లభిస్తుంది. ఇక్కడ ఇరానీ చాయ​ ధర రూ. 100/-

కేఫ్ బహార్
ఇది రంజాన్‌ సమయంలో బిర్యానీ, హలీమ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఉస్మానియా బిస్కెట్లు, క్రీమ్ బన్స్,రుచికరమైన కబాబ్‌లతో కూడిన తాజా టీ వంటి వాటి కోసం ప్రజలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ కూడా ఇరానీ చాయ​ ధర రూ. 150/-

బ్లూ సీ టీ అండ్‌ స్నాక్స్‌..
నగరంలో మరొక ప్రసిద్ధ ఇరానీ బ్లూ సీ 1989లో ప్రారంభమైంది. ఇది దిబెస్ట్‌ టీ కేఫ్‌లో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ సర్వ్‌ చేసే ఇరానీ చాయ్ చాలా చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఎగ్‌ పఫ్‌లు, సమోసాలు, పేస్ట్రీలు, జామ్‌ రోల్స్‌ వంటివి కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ మాత్రం ఇరానీ చాయ్‌ కేవలం రూ. 50/-

నిమ్రా కేఫ్
ఓల్డ్‌ సిటీలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉంటుంది. నాంపల్లి రైల్వేస్టేషన్‌కి సమీపంలో ఉంటుంది. ఇది ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఇరానీ చాయ్‌ ధర రూ. 100/-

(చదవండి: మెట్‌ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్‌! ఏకంగా 163 మంది..)

 

 
Advertisement
 
Advertisement