Irani Chai
-
HYD: ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌తో కేటీఆర్ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఇరానీ చాయ్‌ను తాజాగా నాంపల్లిలోనిఓ కేఫ్‌లో రుచిచూశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా బిస్కెట్‌తో ఇరాన్ చాయ్‌ని ఎంజాయ్ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్‌మినార్ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగారు. ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు. కేఫ్‌కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.No Hyderabadi will ever miss a chance to have a sip of our favourite Irani chai & Osmania biscuit 😊I did the same @ Nampalli yesterday pic.twitter.com/qGawPhxAOz— KTR (@KTRBRS) October 24, 2024Iske peene se tabiyat mei ravani aaeBRS Leader KTR Enjoys Irani Chai aT Nampally Restaurant pic.twitter.com/jVfS6Hq3mH— Shakeel Yasar Ullah (@yasarullah) October 23, 2024 -
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
పనివేళ్లల్లో కాస్త 'టీ బ్రేక్' ఎంతో హాయినిస్తుంది. కడుపులో కాసింత టీ పడగానే హమ్మాయ్యా..! అనిపిస్తుంది. వెంటనే ఉత్సాహంగా పనిచేసుకుంటాం. కాస్త సమోసాలు, పేస్ట్రీలు, వంటి ఇతర స్నేక్స్ ఐటెమ్స్ ఏం తిన్నా.. ఆ తర్వాత కచ్చితంగా 'టీ' సిప్ చేయాల్సిందే. అలాంటి చాయ్‌లను ఎన్నో రకాలుగా తయారు చేసి అందిస్తున్నాయి పలు కేఫ్‌లు. వాటిల్లో 'ఇరానీ చాయ్' టేస్ట్ మాత్రం అందరి మనసులను దోచుకుంది. సరదాగా బయటకు వెళ్లి తాగాలనుకుంటే ఇరానీ చాయ్ సిప్ చేస్తే చాలు అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. మరీ ఆ ఇరానీ చాయ్ ఎక్కడ నుంచి మన నగరానికి వచ్చింది..? దాని మూలం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!ఇరానీ చాయ్ హిస్టరీ..జొరాస్ట్రియన్ ఇరానియన్లు పర్షియా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చినప్పుడూ..ఈ చాయ్ పరిచయమయ్యిందని చెప్పొచ్చు. వీళ్లు మన దేశానికి 18, 19వ శతాబ్దాలలో వచ్చారట. అయితే 18వ శతాబ్దంలో వచ్చినవారిని పార్సీలు అనిపిలిచేవారట. వారు గుజరాత్, బొంబాయిలలో స్థిరపడిపోయారు. అయితే 19వ శతాబ్దంలో వచ్చిన వాళ్లు మాత్రం వివిద ప్రాంతాలకు చెదిరిపోయారు. పార్సీలు ప్రధానంగా గుజరాతీ మాట్లాడుతుండగా, తర్వాత వచ్చినవారు మాత్రం ప్రధానంలో పార్సీలోనే సంభాషించడంతో వాళ్లని ఇరానియన్లు లేదా ఇరానీలుగా గుర్తించారు. వారు వస్తూ..వస్తూ..తమ మాతృభూమికి సంబధించిన ప్రత్యేకమైన చాయ్ రుచిని చూపించారు. అలా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఈ వలసదారులు కేఫ్‌లను ఏర్పాటు చేయడంతో దీని రుచి ప్రజలకు పరిచయమయ్యింది. వాళ్లు మొదట బొంబాయి,పూణే నుంచి హైదరబాద్‌కు వలస రావడం జరిగింది. అలా మన హైదరాబాద్ ఈ ఇరాన్ కేఫ్‌లకు సెంటర్‌గా మారింది. అందువల్లే దీన్ని హైదరాబాదీ చాయ్ లేదా ఇరానీ దమ్ చాయ్ అని పిలుస్తారు. ఇక హైదరాబాద్‌లో ది బెస్ట్ ఇరానీ చాయ్‌లు ఏవంటే..ది బెస్ట్ ఇరానీ చాయ్‌లు..గ్రాండ్ హోటల్హైదరాబాద్లోని కోటీలో 1935లో ఈ హోటల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రద్దీగా ఉండే ఫేమస్ హోటల్‌గా స్థిరపడిపోయింది. ఈ హోటల్ బిర్యానీతో సహా అనేక స్థానిక డిలైట్లకు ప్రసిద్ధి చెందింది. ఈ చాయ్‌ని వారు సంప్రదాయ పద్ధతిలో చిక్కటి క్రీమ్ మాదిరిగా తయారు చేస్తారు. ధర వచ్చేసి రూ. 150/-కేఫ్ నీలోఫర్ఇరాన్కు చెందిన నిజాం కోడలు ఈ కేఫ్‌కి నామకరణం చేసిందట. ఇది 1978 నుంచి ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్‌లకు ఫేమస్. ఇక్కడ తాజాగా కాల్చిన బన్ మాస్కా తోపాటు రిచ్ మలైతో కూడిన కడక్ చాయ్ లభిస్తుంది. ఇక్కడ ఇరానీ చాయ ధర రూ. 100/-కేఫ్ బహార్ఇది రంజాన్ సమయంలో బిర్యానీ, హలీమ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఉస్మానియా బిస్కెట్లు, క్రీమ్ బన్స్,రుచికరమైన కబాబ్‌లతో కూడిన తాజా టీ వంటి వాటి కోసం ప్రజలు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ కూడా ఇరానీ చాయ ధర రూ. 150/-బ్లూ సీ టీ అండ్ స్నాక్స్..నగరంలో మరొక ప్రసిద్ధ ఇరానీ బ్లూ సీ 1989లో ప్రారంభమైంది. ఇది దిబెస్ట్ టీ కేఫ్‌లో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ సర్వ్ చేసే ఇరానీ చాయ్ చాలా చిక్కగా ఉంటుంది. ఇక్కడ ఎగ్ పఫ్‌లు, సమోసాలు, పేస్ట్రీలు, జామ్ రోల్స్ వంటివి కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ మాత్రం ఇరానీ చాయ్ కేవలం రూ. 50/-నిమ్రా కేఫ్ఓల్డ్ సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది. నాంపల్లి రైల్వేస్టేషన్‌కి సమీపంలో ఉంటుంది. ఇది ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా ఇరానీ చాయ్ ధర రూ. 100/-(చదవండి: మెట్ గాలాలో అలియా చీరపైనే అందరి అటెన్షన్! ఏకంగా 163 మంది..) -
హైదరాబాద్ ఇరానీ చాయ్: ఇలా పెంచేశారేం‘టీ’..?
సాక్షి, హైదరాబాద్: ఎవరినైనా కలవాలా.. మాట్లాడాలా..? వెంటనే ఫలానా హోటల్/కేఫ్‌కు రావాలంటూ ఆహ్వానిస్తుంటాం. ఇరానీ చాయ్ తాగుతూ ఎన్నో విషయాలను మాట్లాడుకుంటాం. ఇంకా కొందరికైతే ఇరానీ టీ తాగందే ఏమీ తోచదంటే అతిశయోక్తి కాదు. కప్పు టీ తాగి చలాకీగా పనిచేసుకునే వారు ఎంతోమంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ఇరానీ రెస్టారెంట్లు ఫుల్ బిజీగా ఉంటాయి. అయితే రోజురోజూకీ ఇరానీ చాయ్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అహ్మద్‌నగర్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నంలోని ఎన్నో రెస్టారెంట్లలో చాయ్ రూ.20కి చేరింది. ఇదేంటీ.. మొన్నటి వరకు ఒక ధర ఉండగా ఒక్కసారిగా రూ.20 వరకు చేరింది అంటున్నారు చాయ్ ప్రియులు. -
ఇరానీ చాయ్ లవర్స్‌కు చేదు వార్త..! భారీగా పెరిగిన ధరలు..!
ఇరానీ చాయ్ లవర్స్ చేదు వార్త..! జంట నగరాల్లో ఇరానీ చాయ్ మరింత ప్రియం కానుంది. ఒక కప్పు ఛాయ్‌పై ఏకంగా రూ. 5 పెంచుతున్నట్లు హోటల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇరానీ చాయ్ రూ. 15 నుంచి రూ. 20కు చేరుకుంది. పెరిగిన ధరలు మార్చి 25 నుంచి అమలులోకి వచ్చాయి. ఇంధన ధరల పెంపు..! రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. క్రూడాయిల్ ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్యాకేజ్డ్ వస్తువులను భారీగా పెంచాయి. ఇక ద్రవ్యోల్భణ ఒత్తిళ్లను అధిగమించడానికి మరోమారు 10-15 శాతం వరకు ధరలను పెంచేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు సిద్దమైన్నాయి. ఇరానీ టీ పొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. పాలు లీటరుకు రూ.100కు చేరింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,800కు చేరుకునే అవకాశం ఉంది. హోటళ్లలో ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇరానీ ఛాయ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరింత కష్టంగా..! కరోనా రాకతో హోటళ్ల నిర్వహణ మరింత కష్టంగా మారింది. హోటళ్ల బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఇక లాక్ డౌన్ అనంతరం అసలు వ్యాపారం సాగడం లేదని యజమానులు పేర్కొన్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. భారీ నష్టాల నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని హోటల్ యాజమానులు తెలిపారు. కరోనాకు ముందు ఒక కప్పు ఇరానీ చాయ్ ధర రూ.10 ఉండేది ఇప్పుడు ఏకంగా..రూ.20కు చేరింది. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! వాటిని తినాలంటే జంకుతున్న భారతీయులు..! -
మన చార్మినార్ ఇరాన్‌లోనూ ఉంది
ఇరాన్ కార్టూన్ అసోసియేషన్ వాళ్లు ఈసారి ‘ట్రంపిజమ్–2’ కార్టూన్స్ అండ్ క్యారికేచర్ పోటీ పెట్టారు. ప్రపంచంలోని ఇప్పటి కార్టూనిస్టులందరూ ఏదో సందర్భంగా ట్రంప్ మీద కార్టూన్లు, క్యారికేచర్లు గీసే ఉంటారు. అలా నేనూ ఓ పది క్యారికేచర్లు, యాభై కార్టూన్లు గీశాను. వాటిలో కొన్నింటిని సెలెక్ట్ చేసి, పోటీకి పంపుదామని సిద్ధపడుతుంటే, ‘మిమ్మల్ని ఈ పోటీకి అంతర్జాతీయ జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా అనుకున్నాం. మీరు ఒప్పుకుంటే సంతోషం’ అని మెయిలొచ్చింది. ఇరాన్ నుంచి ఆహ్వానం అందడం ఇది రెండోసారి. ఇదివరకు 2017లో కూడా జ్యూరీ సభ్యుడిగా వెళ్లాను. మళ్లీ ఇలా పిలుస్తారని ఊహించలేదు. ఇరాన్‌ను ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాల్సింది మిగిలే ఉంటుంది. ముఖ్యంగా అక్కడి పోటీ సంస్కృతి, ఆర్ట్, ఫిల్మ్, ఫొటోగ్రాఫర్లు, డాక్టర్లు ఎంతో అద్భుతం. హైదరాబాద్‌లో జరిగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ ఎలిఫెంట్‌ను ఎన్నోసార్లు గెలుచుకుంది ఇరాన్. అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా పలు అవార్డులు ఇరాన్ సినిమాకు సొంతం. నాకైతే పర్షియన్ కార్పెట్ ఏనిమేటెడ్ మూవీ ఎంతో ఇష్టం. ప్రస్తుత ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఇరానీలు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. అంతర్జాతీయ కార్టూన్, క్యారికేచర్ పోటీల్లోనైతే మొదటి మూడు అవార్డుల్లో ఇరాన్ పేరు తప్పక ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉండటంలో కూడా ఇరాన్ కార్టూన్ పాత్ర కీలకం. గతంలో అంటే 2002, 2003 ప్రాంతంలో ఆ వెబ్సైట్ చూడటానికి ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి గంటకు యాభై, అరవై రూపాయలు చెల్లించేవాడిని. వారు నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి చాలాసార్లు ప్రయత్నించాను. చివరకు ఓ పదేళ్ల తర్వాత ఒక బహుమతి పొందడం ఒక తీయని అనుభూతి. ఇరాన్ కార్టూన్ అసోసియేషన్ వాళ్లు 2009లో ఓ అంతర్జాతీయ పోటీ నిర్వహించారు. కార్టూన్, క్యారికేచర్ పోటీలు, ప్రదర్శనలను వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకమైన అంశంతో నిర్వహిస్తుంటారు. ఇరాన్లో రెండవ శక్తిమంతమైన వ్యక్తి అయిన జనరల్ సులేమాన్ అమెరికా బలగాల ద్రోన్ దాడిలో మరణించడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అయినా, ఇరాన్‌కు పోదామని రెడీ అవుతుంటే కొలీగ్స్, దోస్తులు వద్దు అని వారించారు. అక్కడి నిర్వాహకులు మాత్రం ‘ఫర్వాలేదు వచ్చేయమ’ని నాకు భరోసా ఇచ్చారు. టికెట్స్ రెడీ. పైగా ట్రంప్ మీద కార్టూన్ కాంపిటీషన్... చివరకు కచ్చితంగా వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. అసలు ఈ సమయంలోనే ఇరాన్ వెళ్లి ట్రంప్ కార్టూన్ ఫెస్టివల్లో పాల్గొని నైతికంగా మద్దతు ఇవ్వాలనిపించింది. 7.01.2020 సాయంత్రం 6.30 గంటలకు అల్ ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగగానే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఫెస్టివల్ డైరెక్టర్ సయ్యద్ మసవుది నన్ను ఆప్యాయంగా హగ్ చేసుకుని పూల బొకేలతో ఆహ్వానం పలికారు. ఇరాన్లో వీకెండ్స్ గురు, శుక్రవారాలు సెలవులు. పొద్దున్నే ‘టెహ్రాన్ టైమ్స్’ ఆఫీసుకు పోయాం. అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు. మధ్యాహ్నం విజువల్ ఆర్ట్స్ సెంటర్‌కు వెళ్లి అక్కడున్న పెద్ద ఆర్ట్ స్టూడియోలోకి వెళ్లాం. అందులో ఒకే ఒక మినియేచర్ ఆర్టిస్టు ఉన్నారు. అతనితో కాసేపు ముచ్చటించి విషయాలు అడిగి తెలుసుకున్నాను. ఖురాన్ నుంచి కొన్ని సూక్తులను పర్షియన్ కాలిగ్రఫీ స్టైల్లో వర్క్ చేస్తున్నారు. స్టూడియోలో మిగతా ఆర్టిస్టులు జనరల్ సులేమానీని వివిధ రకాలుగా చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. సెలవులు కావడంతో చాలామంది ఆర్టిస్టులు రాలేదని చెప్పారు. జ్యూరీ సభ్యులు, అవార్డు విన్నర్స్‌తో శంకర్ ప్రపంచంలోనే ఎల్తైన ఆరవ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్లలో ఆరవదైన మిలాద్ టవర్‌ను ఎక్కాం. దాని ఎత్తు 3,435 మీటర్లు. పైన మూడు మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. అందులో పర్షియన్ కవి ఫిరదౌసి శిల్పం కూడా ఉంది. మొదటి మ్యూజియంలో వివిధ నమూనాల్లోని పురాతన వస్తువులు ఉన్నాయి. రెండో మ్యూజియంలో ఇరాన్‌లోనే అతి పురాతన శిల్పం ఒకటి ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. ప్రఖ్యాత ఇరానీ చిత్రకారులు చిత్రించిన కొన్ని ఇలస్ట్రేషన్స్ అక్కడ ఉన్నాయి. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, దయ, ప్రేమ వంటి అంశాలతో ప్రత్యేకమైన మెటల్‌తో ఆ చిత్రాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. తర్వాత నేను, మిత్రుడు జితేత్ కొస్తానా బస చేసిన హోటల్లో రాత్రి డిన్నర్ వన్ బై టూ చేసి పడుకున్నాం. అక్కడ కబాబ్ చాలా ఫేమస్. కాని, అంత క్వాంటిటీ సింగిల్‌గా తినలేక లంచ్, డిన్నర్ వన్ బై టూ తినేవాళ్లం. మంచినీళ్లు మాత్రం చిన్న చిన్న సీసాల్లో ఇచ్చేవారు. టెహ్రాన్‌కు ఒక పక్కన ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోని ఒక కొండ పేరున్న పేరుతో వాటర్ బాటిల్స్ ఉండేవి. వాటిపై ‘నాన్ కార్బోనేటెడ్’ అని రాసి ఉంది. ఇరాన్లో లిక్కర్, ఫేస్‌బుక్‌పై బ్యాన్ ఉంది. తెల్లారే ‘ట్రంపిజమ్–2’ క్లోజింగ్ సెరిమనీ. ‘ఇస్లామిక్ రివల్యూషన్ అండ్ హోలీ డిఫెన్స్ మ్యూజయం’ వేదిక. అక్కడకు వెళ్లే సరికి పోస్టర్లు, ప్రెస్‌మీట్ వేదిక, సెరిమనీ వేదిక, నేను గీసిన ట్రంప్ క్యారికేచర్‌తో ముస్తాబు చేశారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుంటే పక్కన ఒక ఇరానీ ఆర్టిస్టు జనరల్ సులేమానీ పెయింటింగ్ వేస్తున్నారు. ఆ స్టేజ్‌పైన నేను ట్రంప్ మీద గీసిన క్యారికేచర్ వీడియోను ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి అవార్డు విన్నర్స్, ప్రముఖ కార్టూనిస్టులు, అక్కడి ప్రముఖులు, మిలటరీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అవార్డు విన్నర్స్‌తో పాటు నాకు జ్యూరీ అవార్డు ఇచ్చి సత్కరించారు. బయటి హాలులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయట చాలామంది ఇరానియన్ కార్టూనిస్టు మిత్రులు ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడి, ఫొటోలు దిగాం. వారి బుక్స్ నాకు, నా బుక్స్ వారికి ఇచ్చి పుచ్చుకున్నాం. అదేరోజు టెహ్రాన్ నుంచి ఇస్ఫహాన్కు ఫ్లైట్‌లో వన్ అవర్ జర్నీ. అసలు ఇరాన్ అంతటికీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికంతటికీ ఇరాన్ హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్ అక్కడి నుంచే వెళతాయని అక్కడకు పోయేదాకా తెలియదు. అక్కడ అద్భుతమైన కళాకారులు, చిత్రకారుల వర్క్ చూసే అదృష్టం కలిగింది. కల తీరింది ఎప్పట్నుంచో వెబ్‌లో చూడటం తప్ప నిజంగా ఇరాన్ కార్టూన్ హౌస్‌ను చూడాలనే కోరిక తీరింది. అక్కడ ప్రపంచంలోనే ప్రముఖులైన కార్టూనిస్టుల ఒరిజినల్ డ్రాయింగ్స్ చూసే అదృష్టం దక్కింది. చాలాసేపు ఒరిజినల్స్ చూడటం, ఇరాన్ కార్టూన్స్‌కు వచ్చిన అవార్డులు, వారు ప్రచురించిన అనేక కార్టూన్, క్యారికేచర్ ఆల్బమ్స్‌ను చూశాను. అందులో సయ్యద్ మసవుది గీసిన ఎలిఫెంట్ కార్టూన్ పెయింటింగ్ అద్భుతం. సయ్యద్ మసవుది హౌస్ ఆఫ్ ఇరాన్ కార్టూన్‌కి డైరెక్టర్ కూడా. మసవుది కార్టూన్లు చూడటానికి సింపుల్‌గా కనిపించినా, చాలా ఇంటలెక్చువల్‌గా కూడా ఉంటాయవి. ఎక్కువగా ఆయన వార్ కార్టూన్స్ గీశారు. ఇరాన్లో ఇరానీ చాయ్ లేదు ఇరానీ చాయ్ అని ఎక్కడ అడిగినా అలాంటిదేమీ లేదు. వితౌట్ మిల్క్ డికాక్షన్‌తో రకరకాల టీ పొడులతో చేసిన చాయ్‌లే తాగుతున్నారు. పాలే కాదు, చక్కెర కూడా కలుపుకోరు. ఓ సుగర్ టాబ్లెట్‌లాంటిది నోట్లో వేసుకుని టీ తాగుతారు. ఇరాన్ పోయి ఇరానీ చాయ్ తాగలేదని ఇక్కడి ఫ్రెండ్స్‌కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు! హైదరాబాద్‌లో గల్లీ గల్లీలోనూ ఇరానీ చాయ్ ఉంటుందని చెబితే ఆశ్చర్యపోయారు. మా ఆఫీసు ఎదురుగా ఉన్న సర్వీ హోటల్లో ఇరానీ చాయ్ తాగుతామని చెప్పా... పైగా ఆ హోటల్ యజమానులు ఇరానీ వాళ్లు కావడం అదో తృప్తి. ఇరాన్లో చార్మినార్ మన చార్మినార్లాంటిదే ఇరాన్‌లోనూ ఉంటుందని విన్నాను. అక్కడ చార్మినార్‌లా ఉండే కట్టడం నష్కే జహాన్ మసీదు చాలా పురాతనమైనది. నిజానికది చార్మినార్ కాదు, దానికి ఉన్నవి దో మినారే! ఆనుకునే ఉన్న హోటల్లో దిగడం చాలా సంతోషమేసింది. దాని లోపల పనితీరు కూడా మన చార్మినార్లాగానే ఉంది. సిటీ కూడా మన హైదరాబాద్‌లాగానే ఉంది. దానికి ఆనుకుని ఒక పెద్ద ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉండటం విశేషం. మధ్యాహ్నం ఇస్ఫహాన్ హౌస్ ఆఫ్ కార్టూన్‌కి వెళ్లాం. ఇస్ఫహాన్ సిటీలోని ఆ ప్రయాణంలో మధ్యలో ఒక అందమైన నది ఉంది. దాని మధ్యలో 1650లో కట్టిన పురాతనమైన వంతెన ఉంది. నిజంగా సిటీ మధ్యలో ఒక పెద్ద ఓల్డ్ మాస్టర్‌పీస్ పెయింటింగ్‌లా అనిపించింది. అక్కడ చాలాసేపు గడిపాం. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల జనం చేరుకుని భోజనాలు చేయడం, పిల్లలు ఆడుకోవడం, టూరిస్టులు ఫొటోలు తీసుకోవడం కనిపించింది. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్, కార్టూనిస్టులు, క్యారికేచరిస్టుల సమక్షంలో నా వర్క్‌షాపు జరిగింది. దానిలో భాగంగా లైవ్ క్యారికేచర్ స్లైడ్‌షో జరిగింది. నేను వర్క్‌షాప్‌లో బొమ్మలు గీస్తుండగా దాదాపు ఓ ఏడెనిమిది మంది నా క్యారికేచర్ గీసి చూపించడం సరదాగా అనిపించింది. అక్కడి వారి బొమ్మలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూశాను. అక్కడ ఓ నలుగురు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో సెల్ఫీక్లిక్స్! తెల్లారి మళ్లీ టెహ్రాన్. ఆరోజు టెహ్రాన్ సిటీ రోడ్ల మీద చలికి వణుక్కుంటూ చాలాసేపు తిరిగాం. మన డబ్బులతో పోల్చితే వాళ్లవి చాలా తక్కువ. సాయంత్రం వరకు గడిపి, నైట్ హోటల్లో డిన్నర్ చేసి, నిర్వాహకులకు, మసవుదికి, ఇతర కార్టూనిస్టులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేం నైట్ ఒంటిగంటకు మళ్లీ అల్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాం. తోవలో మస్కట్ ఎయిర్‌పోర్టులో మిత్రుడు, తోటి జ్యూరీ సభ్యుడు జిట్ కోస్తానా ఇండోనేసియా వెళుతుండగా సెండాఫ్ ఇచ్చి, క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాం. ఒక మిసైల్ నా మీద కాని, ఇరాన్ మీద కాని ట్రంప్ వేయలేదు. కాని మేం మాత్రం మిసైల్స్ కన్నా పవర్ఫుల్ కార్టూన్లు, క్యారికేచర్లు ‘ట్రంపిజమ్’ పేరుతో వేసి బాగా నవ్వుకున్నాం. ఈ సందర్భంగా నాకొక సామెత గుర్తొచ్చింది. ప్రపంచం ఇంకా బతికే ఉంది. ఎందుకంటే అది ఇంకా నవ్వుతోంది గనుక! 'The world lasts because it laughs' – శంకర్, చీఫ్ కార్టూనిస్ట్, సాక్షి -
వారెవ్వా.. ఏమి‘టీ’!
ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది. సాక్షి, ఒంగోలు: తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది. ఒక్క ఒంగోలు నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా టీలు తాగుతున్నారని వ్యాపారవర్గాల అంచనా. ఈ లెక్కన జిల్లాలో టీ మార్కెట్ అంచనాలకు అందనిది. నాలుగు చినుకులు పడ్డాయంటే.. బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు మిత్రులు కలవగానే నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘టీ తాగుదాం భయ్యా’, ‘టీ తాగుదాం బాబాయ్..’, స్ట్రాంగ్ చాయ్ తాగుదాం మావా..’. ఇక విద్యార్థులైతే ఒన్‌బైటూ చాయ్ చెబుతారు. బందువులు ఇంటికి రాగానే తేనీటి సేవనంతోనే కబుర్లు మొదలవుతాయి. మనసు చికాకు పుట్టినా.. కొత్తవారితో దోస్తీ కట్టినా.. వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. చిరుద్యోగి నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా టీ సేవించాల్సిందే. నగరాల్లో ఇరానీ చాయ్ వచ్చేసింది. ప్రత్యేకంగా ఇరానీ చాయ్ రుచులు చూపించే దుకాణాలు ఉన్నాయి. తేయాకు రుచులకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఆరోగ్యం.. ఆనందం..ఆహ్లాదం.. ఆస్వాదన పంచే తేనీరుతో కొన్ని హోటళ్లు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాయి. సమయానికి తగినట్లుగా, మూడ్‌కు అనుగుణంగా సరికొత్తగా కొత్త కొత్త రుచులతో తేనీరు అందుబాటులోకి వచ్చింది. మారిన జీవన శైలి.. పోటీ పడి అలసిన వారు కాసేపు సేద తీరేందుకు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. నగరంలోనూ కేఫ్ క్లబ్‌లు వెలుస్తున్నాయి. ఆధునిక పోకడలకు దర్పణం పడుతున్నాయి. కొత్తగా ఆస్వాదించాల్సిందే.. మారుతున్న పరిస్థితుల్లో అన్ని వర్గాల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఖర్చు ఎక్కువనా వెనుకంజ వేయడం లేదు. కార్పొరేట్ సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. కాసేపైనా సమావేశాలు, స్నేహితులు బందువులతో గడపాలంటే టీ రూమ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు అనుకూల వాతావరణం ఆస్వాదించడానికి అద్భుతమైన రుచులను కోరుతున్నారు. నగరంలో వివిధ బ్రాండ్ల టీ రకాలు అందుబాటులో ఉన్నాయి. హైవే పైనా కాఫీ క్లబ్‌లు, టీ షాప్‌లు వెలిశాయి. 24 గంటలపాటు వీటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక టీ బంకులు ఉండనే ఉన్నాయి. టీ కాస్త బాగుంటే చాలు.. షాప్ వద్ద జనాలు గుంపులు గుంపులే. అర్ధరాత్రి వరకు టీ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. పాత మార్కెట్ సెంటర్‌తోపాటు పలు ప్రాంతాల్లో రకరకాల టీలు లభిస్తున్నాయి. ఘుమఘుమలతో ఫిదా.. టీ గ్లోబల్ మార్కెట్. అంతర్జాతీయంగా ఉండే టీ రకాలు స్థానిక మార్కెట్‌కు వస్తున్నాయి. మూడు దశాబ్దాల కిందట టీ రకం ఒకటే. ఇప్పుడు రకరకాలు. రంగు.. రుచి.. వాసన ఘుమఘుమలతో నగరవాసులు టీకి ఫిదా అవుతున్నారు. 1853లో తేయాకు తోటలను తొలిసారిగా సాగు చేశారు. క్రమంగా విస్తరించి లక్షలాది ఎకరాల్లో తేయాకు పండిస్తున్నారు. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రకరకాల తేయాకు మార్కెట్‌కు వస్తోంది. కిలో రూ.139 నుంచి రూ.1200 వరకు ఉండే రకాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలు బాగా అవలంబిస్తున్న నేపథ్యంలో బ్లాక్, గ్రీన్, హెర్బల్, దినుసులతో తయారు చేసిన టీ రకాలను ఆస్వాదించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు చిన్న డిస్పోజల్ బ్యాగ్‌లలోనూ టీ లభిస్తోంది. బ్లాక్, చీజ్, పౌడర్, రెడీ టీ, గ్రీన్, జింజర్ రకరకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఔరా అనాల్సిందే.. ఎల్లో బడ్ టీ రెండు కప్పుల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.6,500. స్టార్ హోటళ్లల్లో ఈ టీ లభిస్తుంది. టీ వినియోగానికి పెరిగిన ఆదరణకు ఇది ప్రతీక. అచ్చమైన తేయాకును ఎండబెట్టి 24 కేరట్ల బంగారంతో మిళితం చేసిన ఫ్లేవర్‌తో ఎల్లో బడ్ టీ పొడి తయారు చేస్తారు. ఈ టీ పౌడర్ కిలో ధర సుమారు రూ.8 లక్షలు. ఎంతటి వారైనా ఈ ధర చూసి ఔరా అనాల్సిందే. స్థానిక మార్కెట్లోనూ 40 రకాలకు తగ్గకుండా టీ లభిస్తోంది. అల్పాహార హోటళ్లల్లోనూ నిత్యం వినియోగించే రకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఒంగోలులోని వివిధ సెంటర్లలో జింజర్ టీ, గ్రీన్, బ్లాక్, దాల్చిన చెక్క, వైట్ టీ, ఎల్లో టీ, బాదం టీ, మింట్, మిరియాలు, వాము, గార్లిక్.. ఇలా రకరకాల టీలు విక్రయిస్తున్నారు. ఉదయాన్నే అల్లం టీ తాగేందుకు వాకర్లు గుంపులుగుంపులుగా టీ కొట్ల వద్దకు చేరుతున్నారు. ఉదయం పూట ఒక్క మంగమూరు రోడ్డులోని రెండు మూడు కేంద్రాల్లో వందలాది టీలు అమ్ముడవుతున్నాయి. షాప్ నిర్వాహకులు పార్ట్ టైం సర్వెంట్లను పెట్టుకుని ఉదయం టీ మార్కెట్ నడిపిస్తున్నారు. పాలు, పంచదార కలపకుండా చక్కటి రుచి, సువాసన కలిగిన టీలు కాఫీ షాప్‌ల్లో లభిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కలపకుండా స్వచ్ఛమైన తేయాకుతో తయారు చేసే టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. -
హైదరాబాద్ అంటే దానికి ఫేమస్
హైదరాబాద్ అంటే ఇరానీ ఛాయ్‌కి ఫేమస్ అని చాలా మందికి తెలుసు. కానీ అర బిక్ ఘావా అనే మరో రకం ‘టీ’కి కూడా మనం కేరాఫ్ అడ్రస్ అని ఎంత మందికి తెలుసు. అలాగే పౌనా, సులేమాన్ ఛాయ్, కేశర్.. ఇలా చలికాలంలో సిటీలో ప్రత్యేకంగా లభించే ‘టీ’ వెరైటీలు చాలా తక్కువ మందికే తెలుసు. విభిన్న దేశాలు, సంప్రదాయాలతో మమేకమై ఎన్నో అభి‘రుచుల’ను తనలో ఇముడ్చుకున్న మన సిటీ హిస్టారికల్ ‘టీ’లకు కేంద్రమైంది. - ఎస్.సత్యబాబు కేశర్.. రిచ్ ఫ్లేవర్ ఇది కొంచెం ఖరీదైన టీ. కుంకుమ పువ్వును వినియోగించి ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారు చేస్తారు. గతంలో సంపన్నుల ఇళ్లకు మాత్రమే పరిమితమైనా ఇప్పుడు పాతబస్తీ ఫేవరెట్. నగరంలోని కొన్ని హోటళ్లలో మాత్రమే లభిస్తుంది. జలుబు నివారణకు ఇది ఉపకరిస్తుంది. దీనిని చిన్న పిల్లలు, మహిళలకు విక్రయించరు. ధర రూ.20 నుంచి రూ.45 సులేమానీ.. ఫ్యాట్ పరారీ... ఇది చాపత్తాతో తయారవుతుంది. లెమన్, పుదీనా, మసాలా రుచుల్లో లభ్యమవుతుంది. ఏ కాలంలోనైనా అన్ని వయసుల వారు తాగేందుకు అనువైన పానీయం. సిటీలో లెమన్, పుదీనా సులేమానీల వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. దీన్ని తాగడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు కొవ్వు కరిగిస్తుందని చెబుతున్నారు అమ్మకందారులు. సులేమానీని విక్రయించేందుకు పాతబస్తీలో ప్రత్యేక దుకాణాలున్నాయి. ఇది సౌదీ నుంచి నగరానికి వచ్చింది. ధర రూ.8 నుంచి రూ.20 చలికాలం.. ఛాయ్ కాలం.. వినూత్న రుచితో పాటు వైద్య పరమైన విలువలు కూడా ఉండడం చలికాలం ఛాయ్‌ల పాపులారిటీని ఇనుమడింపజేస్తూ హాట్‌హాట్‌గా అమ్ముడయ్యేలా చేస్తోంది. అరబ్ దేశస్తుల మూలాలు ఎక్కువగా కనిపించే బార్కాస్‌లో ఈ వింటర్ టీలు బాగా పాపులర్. ఈ సీజన్లో బార్కాస్‌లో పెద్ద సంఖ్యలో షాప్‌లు నెలకొల్పి ఈ వేడి వేడి హిస్టారికల్ టీలను అందిస్తారు. పౌనా.. లేడీస్ స్పెషల్ దీని రుచి లైట్‌గా ఉంటుంది. తయారీలో పాలమీగడను వినియోగిస్తారు. ఇందులో డికాక్షన్ తక్కువ, పాల మోతాదు ఎక్కువ. తక్షణ శక్తినివ్వడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది మహిళలకు ప్రత్యేకం. యువతులు బాగా మక్కువ చూపే పానీయం ఇది. ధర రూ.20 నుంచి రూ.30 -
లాస్ట్ కప్...చివరి సిప్
కొద్దిరోజుల్లో దూరం కానున్న గార్డెన్ ఛాయ్ కోసం శనివారం నగర ప్రజలు బారులు తీరారు. ఆదివారం నుంచి రెస్టారెంట్ మూతపడనున్నట్లు తెలియడంతో గార్డెన్ రెస్టారెంట్ అభిమానులు వందల సంఖ్యలో క్లాక్‌టవర్ వద్దకు తరలి వచ్చి గార్డెన్ రెస్టారెంట్లో ఉస్మానియా బిస్కెట్, ఇరానీ చాయ్ సేవించారు. ఈ సందర్బంగా రెస్టారెంట్‌కు వచ్చిన ప్రతి కస్టమర్ హోటల్ కనుమరుగుకానుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు యువకులు చివరి ఛాయ్గా భావించి చీర్స్ కొట్టి మరీ ఛాయ్ మాధుర్యాన్ని గుండెలనిండా నింపుకున్నారు. పలువురు సీనియర్ సిటిజన్లు గార్డెన్ రెస్టారెంట్‌తో తమకు దశాబ్దాల తరబడి పెనవేసుకున్న అనుబంధాన్ని మననం చేసుకోవడం గమనార్హం. శనివారం గార్డెన్ రెస్టారెంట్లో కనిపించిన దృశ్యాలివీ.. కొసమెరుపు...ఇదిలా ఉండగా మెట్రో అధికారుల నుంచి పరిహారం అందని కారణంగా ఈ ప్రాంతంలో మెట్రో పనులకు మరికొంత కాలం పట్ట వచ్చునని సమాచారం. అప్పటి వరకు గార్డెన్ రెస్టారెంట్ యధావిధిగా కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. - సికింద్రాబాద్ -
కమ్మని ఇరానీ చాయ్
హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కమ్మని ఇరానీ చాయ్, ఉప్పగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు, సమోసా విత్ మిర్చి. ఇప్పటివరకు ఇరానీ కేఫ్‌లకే పరిమితమైన ఈ మెనూని స్టార్ హోటల్స్ సైతం యాడ్ చేసుకున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి 5.30వరకు ‘ది గ్రిల్’ పేరుతో హైటీ అందిస్తోంది తాజ్ వివంత. ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ దీని రుచి చూపిస్తున్నారు. హ్యాపీగా పూల్‌సైడ్ కూర్చుని దర్జాగా నిజాం నాటి మ్యూజిక్ వింటూ హైదరాబాద్ స్పెషల్ హైటీని ఆస్వాదించొచ్చు. అయితే ఇంగ్లిష్ డిషెస్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల రుచిలో ఇరానీ టీ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు చెఫ్ అర్జున్. దీనికోసం డికాషన్‌ను మూడు నుంచి నాలుగు గంటల పాటు మరిగించి అందులోనే చక్కెర కలిపి కేటిల్లో ఉంచుతారు. చివరకు చిక్కని పాలను యాడ్ చేయగా మిల్కీ ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతుంది. కచ్చితంగా మీకు నోరూరిస్తుందని అంటున్నాడాయన. ఈ చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కట్లు, ఆరంజ్ చాక్లెట్స్, ఇంగ్లిష్ టీ కేక్స్, పిన్ వీల్ శాండ్విచెస్... ఇలా 15 రకాల స్నాక్స్ కూడా ఉంటాయి. దీని ధర వెయ్యి రూపాయలు. -
డ్రింక్.. డైన్.. డ్యాన్స్
సిటీలో ఒక రెస్టారెంట్లో ఫుడ్‌ఫెస్టివల్ అంటేనే... ఫుడీస్‌కి ఫుల్ మీల్స్ లాంటి కబురది. అలాంటిది ఏకంగా 16 రెస్టారెంట్లు ఒక చోట చేరి తమదైన శైలి విందుని అందిస్తే, డ్రింక్, డైన్, డ్యాన్స్... మూడూ కలగలిపిన త్రీడీ ఎఫెక్ట్ సందడిని మోసుకొస్తే... అంతకు మించిన విశేషం ఏముంటుంది! సిటీలోని టాప్ రెస్టారెంట్స్ వంటలతో వినోదాన్ని కలగలిపి, హైటెక్స్ వేదికగా ఈ త్రీడీ ఎఫెక్ట్‌ను మనకు శుక్రవారం నుంచి రుచి చూపనున్నాయి. మూడు రోజుల పాటు ‘రెలిష్ హైదరాబాద్’ పేరుతో డిఫరెంట్ టేస్ట్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరానీ చాయ్ నుంచి బిర్యానీ దాకా మన సిటీకి ఇంటర్నేషనల్ పాపులారిటీ తెచ్చిన ఫుడ్ వెరైటీలు ఎన్నో ఉన్నాయి. ఇంటి వంటను బయట గెలిపించడంలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ రుచుల్ని ఇంటికి అందించడంలోనూ నగరానికి చెందిన రెస్టారెంట్లు ముందంజలో ఉన్నాయి. తమదైన క్యుజిన్‌ను, స్పెషాలిటీస్‌ను ఫుడ్ లవర్స్‌కు రుచి చూపడానికి సిటీకి చెందిన రెస్టారెంట్లు అలా లిబర్టీ, ది ఓరియంటల్ బ్లసూమ్, తబలా, సెవెన్త్ హెవెన్, ఎఫ్ కేఫ్, రోటీస్, ది స్పైసీ అవెన్యూ, ఫోర్ సీజన్స్, సిన్నామన్ ఫ్యూజన్, లిటిల్ ఇటలీ, సింప్లీ సౌత్, జిటి కంఫర్ట్, వయా మిలానో, ఈట్ ఇండియా కంపెనీ, ఐ గ్రిల్లు ఒక వేదికలో రుచుల ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఏమి చేస్తాయి? ఈ రెస్టారెంట్లన్నీ తమ కిచెన్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తాయి. ఇందులో తమకు మాత్రమే ప్రత్యేకించిన 4 స్పెషలైజ్డ్ డిష్‌లను అక్కడికక్కడే తయారు చేసి ప్రదర్శిస్తాయి. అలాగే మరొక ఐకానిక్ వంటకాన్ని రుచి చూపిస్తాయి. మొత్తం 80 డిష్‌లు కను ‘విందు’ చేస్తాయి. సో.. విభిన్న రకాల రుచుల్ని టేస్ట్ చేయవచ్చు. అది కూడా అందుబాటు ధరల్లో. అంతే కాకుండా మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఫుడ్లవర్స్కి బోనస్. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి కొనసాగింపు ఇది. అన్ని రకాాల గ్లోబల్ క్వీజిన్లకు సిటీ వేదిక అని, మనది అసలు సిసలు అంతర్జాతీయ నగరం అని నిరూపించేందుకే ఈ ఈవెంట్ డిజైన్ చేశాం’ అని హైటెక్స్ సీఈఓ కె.వి.నాగేంద్రప్రసాద్ అంటున్నారు. భారత్‌లో తొలిసారి ‘ఇదో అంతర్జాతీయ కాన్సెప్ట్. ఇలాంటివి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. భారత్‌లోనే తొలిసారిగా మేం ఇక్కడ నిర్వహిస్తున్నాం’ అని ఈవెంట్ కోఆర్గనైజర్, నెక్ట్స్ ఈవెంట్స్ (ముంబై) డెరైక్టర్ అనిల్ అరోరా చెప్పారు. ప్రత్యేకతలెన్నో... ఈ రెలిష్ హంగామాలో ఫుడ్‌తో పాటు మరిన్ని విశేషాలున్నాయి. సిటీలోని పది మంది టాప్ చెఫ్‌లు అప్పటికప్పుడు ఇక్కడ వండి వార్చే సెలబ్రిటీ చెఫ్ థియేటర్, గృహిణులు, కలినరీ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థుల కోసం ‘ది గ్రేట్ హైదరాబాద్ హోమ్ కుక్ చాలెంజ్’ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో విజేతకు రూ.2 లక్షల వరకు బహుమతులున్నాయి. సందర్శకులను హుషారెత్తించేందుకు టాప్ బ్యాండ్ సమర్పించే లైవ్మ్యూజిక్తో పాటు పరిమిత స్థాయిలో లైఫ్‌స్టైల్ బజార్, కిడ్స్జోన్లు ఉంటాయి. కొత్తగా వచ్చిన రేడియో ట్యాక్సీ సర్వీస్ ఊబర్ విజిటర్లకు ఫ్రీ సర్వీస్‌ను అందిస్తోంది. ఈ ఈవెంట్‌కు 10 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా. తొలి రోజు సాయంత్రం 6కు, చివరి రెండు రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సందర్శించవచ్చు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.200, చిన్నారులకు రూ.100. రూ.1,100 ఫుడ్ కూపన్ కొనుగోలు చేస్తే ప్రవేశం ఉచితం. - ఎస్.సత్యబాబు -
వాహ్.. చాయ్
పౌనా చాయ్ విత్ ఉస్మానియా బిస్కట్.. వో భీ చార్మినార్‌కే సామ్నే.. ఇంతకన్నా గొప్ప పెహచాన్ ఉంటుందా అసలైన హైదరాబాదీకి! ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేను స్టార్‌బక్స్ కాఫీ సిప్ చేస్తుంటే గుర్తొచ్చింది. పల్చటి కాఫీలో పాలలాంటి క్రీమర్ ఎంత వేసినా రాని చిక్కదనంతో కుస్తీ పట్టలేక నల్లని అమెరికానోతో సరిపెట్టుకున్నాను. పైగా ఎంత తాగినా తరగనంత పెద్ద లోటాలాంటి గ్లాస్ ఒకటి. కాఫీ క్రావింగ్తో టీ వేట మొదలుపెట్టా. కనీసం అదైనా రుచిగా ఉంటుందేమోనని. అది ఇంకోరకమైన కష్టం. అలా కాఫీ, టీ వేటల్లో అలసిపోయి కళ్లు మూసుకున్నా.. చార్మినార్ ప్రత్యక్షమైంది. నిమ్రా కేఫ్ చాయ్ రుచి గుర్తొచ్చింది. అక్కడి ఉస్మానియా బిస్కట్ కూడా.. కళ్లు తెరిచి ‘వాహ్.. చాయ్’అనుకున్నా! ఇరానీ.. బహుత్ పురానీ బిజీ హైదరాబాద్‌లో ఎన్ని ఇరానీ కేఫ్‌లో! చార్మినార్ని చూస్తూ చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కట్ తినడాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం నిమ్రాలోకి అడుగుపెట్టాల్సిందే! పది నిమిషాలకోసారి ఆ కేఫ్‌లో ఫ్రేమ్ మారిపోతూంటుంది కానీ అరవైఏళ్లుగా మాత్రం ఆ చాయ్ రుచి మారలేదంటారు అక్కడి చాయ్ ప్రేమికులు. ఉస్మానియా బిస్కట్.. హైదరాబాద్‌లో నేను తిన్న బెస్ట్ బిస్కట్ ఉస్మానియా బిస్కట్. పెద్దపెద్ద బ్రాండ్స్ బిస్కట్స్ ఎన్నో తిన్నా ఈ బిస్కట్ రుచికి సాటిరావు. అసలు ఈ బిస్కట్‌కు ఇంత రుచికి కారణమేంటా అని ఆరాతీయాలనిపించి... నిమ్రా కిచెన్‌లోకి వెళ్లా. ఈ బిస్కట్ రుచి వెనుక సీక్రెట్ ఏంటని ముగ్గురు యజమానులనూ (సోదరులు) అడిగా! సీక్రెట్‌కి బదులు చిరునవ్వే సమాధానంగా దొరికింది. పూరీ సృజనకు ఇంధనం... హైదరాబాద్ గల్లీగల్లీల్లోని ఇరానీ కేఫుల్లో మరిగే చాయ్ కనిపిస్తుంది. దాంతోపాటు గరమ్‌గరమ్ కబుర్లూ వినిపిస్తాయి. తలనొప్పికి మందు చాయ్.. బద్ధకానికి మందలింపూ చాయే! కొందరికి పనిలో బ్రేక్నిచ్చేది చాయ్ అయితే.. ఇంకొందరికి చాయ్ కోసమే పనిలో బ్రేక్ కావాలి. ఫ్రెండ్స్‌కి తోడుగా చాయ్.. సిగరెట్‌కే సాథ్‌మే చాయ్! బోర్ కొడితే చాయ్.. బోర్ కొట్టకుండా ఉండటానికీ చాయ్! ఎందరో క్రియేటర్స్ సృజనకు ఇంధనమూ ఇరానీ చాయే! నమ్మలేని వాళ్లకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పాల్సిందే! ఆయన కెరీర్ తొలినాళ్లలో అమీర్‌పేట బస్‌స్టాప్ పక్కనే ఉన్న చిన్న ఇరానీ కేఫ్‌ని తన స్థావరంగా మార్చేసుకున్నారు. ఆయన్ని కలవడానికి ఎవరొచ్చినా సంభాషణ ఒక ఇరానీ చాయ్‌తో మొదలుపెట్టాల్సిందే. అప్పట్లో ఆయన కోసం వాళ్లింటికి ఎవరు వెళ్లినా ఒకటే సమాధానం.. ‘అన్న కేఫ్‌లో ఉన్నారు’ అని. రానురాను ఇంటికి వచ్చేవాళ్లంతా ముందు కేఫ్‌లో చూసుకొని అక్కడ లేకపోతేనే ఇంటికి వెళ్లేవాళ్లు. పూరీగారి హిట్లన్నీ ఆ చాయ్ కిక్కులోంచి వచ్చినవే. సూపర్ కాంబినేషన్ హైదరాబాద్ సంస్కృతిలో భాగమైపోయిన ఇరానీ కేఫ్‌ల స్థానంలో ఇప్పుడు కొత్త కాఫీకేఫ్‌లు దర్శనమిస్తున్నాయి. మీటింగులు, చాటింగులు, హ్యాంగింగ్లకు సెంటర్‌పాయింట్ అయిపోతున్న ఈ మోడర్న్ కేఫుల్లో పదిరకాల చాయ్‌లు, ఇరవైరకాల కాఫీలు.. కాంప్లికేటెడ్ పేర్లు, కాంప్లికేటెడ్ మెషీన్లు, డిస్పెన్సెస్లతో. టెక్నాలజీ హడావిడికి చిరునామాల్లాగా! కాఫీనురగలో డిజైన్హంగులు సరేసరి! జూబ్లీహిల్స్ 180డిగ్రీ కేఫ్‌లో ఒకసారి కాఫీ నురగపై ఏకంగా నా పేరే రాసిచ్చాడు ఓ కళాపోషకుడు. కాఫీల్లో, టీల్లో ఎన్ని రకాలైనా రావచ్చుగాక.. కేఫేలు ఎన్ని కొత్తరూపాలైనా ఎత్తొచ్చుగాక... కొన్ని మాత్రం సజీవంగా ఉంటాయి. అమ్మమ్మ వేసే ఫిల్టర్ వాసన.. అమ్మ కలిపిన ఇన్స్టంట్ రుచి.. అక్క పెట్టిన టీలోని ఆప్యాయత.. శ్రీవారిచ్చిన కప్పులో ప్రేమ.. ఎప్పటికీ మారవు. అలాగే ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కట్ ఇన్ఫ్రంటాఫ్ చార్మినార్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్!