HYD: ఇరానీ చాయ్‌, ఉస్మానియా బిస్కెట్‌తో కేటీఆర్‌ సందడి | KTR Drinks Irani Chai And Osmania Biscuit At Namplally Cafe | Sakshi
Sakshi News home page

HYD: ఇరానీ చాయ్‌, ఉస్మానియా బిస్కెట్‌తో కేటీఆర్‌ సందడి

Oct 24 2024 10:28 AM | Updated on Oct 24 2024 10:41 AM

KTR Drinks Irani Chai And Osmania Biscuit At Namplally Cafe

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదు. అయితే ఇరానీ చాయ్‌ను తాజాగా నాంపల్లిలోనిఓ కేఫ్‌లో రుచిచూశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఉస్మానియా బిస్కెట్‌తో ఇరాన్‌ చాయ్‌ని ఎంజాయ్‌ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. 

కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్‌ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్‌మినార్‌ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్‌ తాగారు. ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు. కేఫ్‌కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.

Advertisement
 
Advertisement
Advertisement