Osmania biscuit
-
HYD: ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్‌తో కేటీఆర్ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్‌కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఇరానీ చాయ్‌ను తాజాగా నాంపల్లిలోనిఓ కేఫ్‌లో రుచిచూశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా బిస్కెట్‌తో ఇరాన్ చాయ్‌ని ఎంజాయ్ చేశారు. జనంతో ముచ్చట్లు పెడుతూ అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి నాంపల్లిలోని ఏక్‌మినార్ మసీదు వద్దనున్న ఓ ఇరానీ కేఫ్‌లో చాయ్ తాగారు. ఉస్మానియా బిస్కెట్‌ను ఆస్వాదించారు. కేఫ్‌కు వచ్చిన వారితో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత పక్కనే ఉన్న బట్టల దుకాణ యజమాని ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో ముచ్చటించారు.No Hyderabadi will ever miss a chance to have a sip of our favourite Irani chai & Osmania biscuit 😊I did the same @ Nampalli yesterday pic.twitter.com/qGawPhxAOz— KTR (@KTRBRS) October 24, 2024Iske peene se tabiyat mei ravani aaeBRS Leader KTR Enjoys Irani Chai aT Nampally Restaurant pic.twitter.com/jVfS6Hq3mH— Shakeel Yasar Ullah (@yasarullah) October 23, 2024 -
బన్ను పోయి బిస్కట్
బన్ను... ఉదయం చాయ్‌తోపాటు తినటం ప్రజల అలవాటు. దైనందిన జీవనంలో దీనిది విడదీయరాని బంధం. అయితే ఇది 1920కి ముందు ఉన్న పరిస్థితి. అప్పుడే నగరంలో కాలుమోపింది మరో పదార్థం. చూస్తుండగానే బన్ను కనుమరుగై ఆ కొత్త పదార్థం మన ఇరానీ చాయ్‌కి సరిజోడీ అయింది. దానితో పాటు ఆస్వాదిస్తేనే ఇరానీ చాయ్ రుచికి ఓ అర్థం ఉంటుందనేంతగా సగటు హైదరాబాదీని మెప్పించింది. అదే ఉస్మానియా బిస్కట్..! ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యం ప్రపంచ పటంలో ప్రత్యేకతను సంతరించుకోవాలని కలలుగన్నాడు. ఆ కలలను సాకారం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని అన్నింటా ముందు నిలిపాడు. విద్యుదీకరణ, రైల్వే, రోడ్డు, విమాన సర్వీసుల అభివృద్ధి, అసెంబ్లీ, జూబ్లీహాలు, హైకోర్టు భవనం, స్టేట్ మ్యూజియం, నేటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియూ యూనివర్సిటీ... ఇలా భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకుంటూ ప్రగతి దిశగా పరుగులెత్తింది. దీనికితోడు తన అభి‘రుచు’లు పదికాలాల పాటు నిలిచిపోయేలా కూడా చొరవచూపాడు. అలా పుట్టిందే ఉస్మానియూ బిస్కట్. 1920 నాటికి హైదరాబాద్‌లో బన్ను (డబల్రోటీ)దే హవా. అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఇరాన్ చాయ్‌తోపాటు బన్ను తినటం ఉన్నత వర్గం అలవాటు. ఇరానీచాయ్ లేనిదే నిజాంకు కూడా పూటగడవదు. ఓరోజు చాయ్‌తోపాటు ఆయన మైదా పిండితో రూపొందించిన పదార్థం రుచి చూశారు. అది ఆయనకు తెగ నచ్చేసింది. ఇక నాటి నుంచి చాయ్‌తో పాటు దాన్ని ఆరగించటం ప్రారంభించారు. క్రమంగా అది దివానం దాటి గల్లీలకూ పాకింది. ఆయన నాంది పలికిన అలవాటు కావటంతో ఆ పదార్థానికి ఆయన పేరే దక్కింది. అదే ఉస్మానియూ బిస్కట్..! సిటీలోని కేఫ్‌లో ఓ మూల కూర్చుని చాయ్ తాగుతూ బిస్కట్లను లాగిస్తుంటే సమయం తెలియదు. ఆలోచనలకు పదునుపెడుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది, బద్ధకాన్ని వదిలిస్తుంది, పనిలో వేగాన్ని కలిగిస్తుంది, స్నేహాన్ని పెంచుతుంది... అంటూ యువత కితాబిస్తున్న ఆ కవల జంట కాంబినేషనే... ఇరానీ చాయ్ ఉస్మానియూ బిస్కట్. హైదరాబాద్‌లో పుట్టిన ఈ బిస్కట్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు. ఉస్మానియా బిస్కట్ పేరుతోనే అమెరికా, బ్రిటన్‌లలోనూ అది హల్చల్ చేస్తోంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఎడారి దేశాల్లో దాని హవా చెప్పనే అక్కర్లేదు. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లకు ఏమాత్రం తీసిపోని కీర్తిని ఇది సొంతం చేసుకుంది. బట్టీలో భలేగా సిద్ధం... ఉస్మానియూ బిస్కట్ రుచిలోని మజాయే వేరు. కాసేపు తీయగా, ఆ వెంటనే ఉప్పగా, ఇంతలో కమ్మగా... వెరసి గ‘మ్మత్తు’గా ఉంటుంది. ముందు గట్టిగా అనిపించినా టీలో నంజుకుని నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. గుండ్రగా, మందంగా, వెనకవైపు కాస్త మాడినట్టుగా కనిపించే ఉస్మానియూ బిస్కట్లు బట్టీల్లో సిద్ధమవుతారుు. వీటి తయూరీకి మూల పదార్థం మైదాపిండి. ఇందులో చక్కెర, ఉప్పు, కాస్త నెరుు్య, పాల పొడి, కస్టర్డ్ పొడిని కలిపి బిళ్లలుగా చేసి బట్టీలో నిప్పుల వేడిపై కాలుస్తారు. ప్రతి బేకరీలో వీటిని తయూరు చేస్తున్నారు. నిత్యం లక్షల్లో ఇవి స్వాహా అవుతుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేకరీల్లో వీటి తయూరీపైనే దృష్టి సారిస్తుంటారు. -
వాహ్.. చాయ్
పౌనా చాయ్ విత్ ఉస్మానియా బిస్కట్.. వో భీ చార్మినార్‌కే సామ్నే.. ఇంతకన్నా గొప్ప పెహచాన్ ఉంటుందా అసలైన హైదరాబాదీకి! ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేను స్టార్‌బక్స్ కాఫీ సిప్ చేస్తుంటే గుర్తొచ్చింది. పల్చటి కాఫీలో పాలలాంటి క్రీమర్ ఎంత వేసినా రాని చిక్కదనంతో కుస్తీ పట్టలేక నల్లని అమెరికానోతో సరిపెట్టుకున్నాను. పైగా ఎంత తాగినా తరగనంత పెద్ద లోటాలాంటి గ్లాస్ ఒకటి. కాఫీ క్రావింగ్తో టీ వేట మొదలుపెట్టా. కనీసం అదైనా రుచిగా ఉంటుందేమోనని. అది ఇంకోరకమైన కష్టం. అలా కాఫీ, టీ వేటల్లో అలసిపోయి కళ్లు మూసుకున్నా.. చార్మినార్ ప్రత్యక్షమైంది. నిమ్రా కేఫ్ చాయ్ రుచి గుర్తొచ్చింది. అక్కడి ఉస్మానియా బిస్కట్ కూడా.. కళ్లు తెరిచి ‘వాహ్.. చాయ్’అనుకున్నా! ఇరానీ.. బహుత్ పురానీ బిజీ హైదరాబాద్‌లో ఎన్ని ఇరానీ కేఫ్‌లో! చార్మినార్ని చూస్తూ చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కట్ తినడాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం నిమ్రాలోకి అడుగుపెట్టాల్సిందే! పది నిమిషాలకోసారి ఆ కేఫ్‌లో ఫ్రేమ్ మారిపోతూంటుంది కానీ అరవైఏళ్లుగా మాత్రం ఆ చాయ్ రుచి మారలేదంటారు అక్కడి చాయ్ ప్రేమికులు. ఉస్మానియా బిస్కట్.. హైదరాబాద్‌లో నేను తిన్న బెస్ట్ బిస్కట్ ఉస్మానియా బిస్కట్. పెద్దపెద్ద బ్రాండ్స్ బిస్కట్స్ ఎన్నో తిన్నా ఈ బిస్కట్ రుచికి సాటిరావు. అసలు ఈ బిస్కట్‌కు ఇంత రుచికి కారణమేంటా అని ఆరాతీయాలనిపించి... నిమ్రా కిచెన్‌లోకి వెళ్లా. ఈ బిస్కట్ రుచి వెనుక సీక్రెట్ ఏంటని ముగ్గురు యజమానులనూ (సోదరులు) అడిగా! సీక్రెట్‌కి బదులు చిరునవ్వే సమాధానంగా దొరికింది. పూరీ సృజనకు ఇంధనం... హైదరాబాద్ గల్లీగల్లీల్లోని ఇరానీ కేఫుల్లో మరిగే చాయ్ కనిపిస్తుంది. దాంతోపాటు గరమ్‌గరమ్ కబుర్లూ వినిపిస్తాయి. తలనొప్పికి మందు చాయ్.. బద్ధకానికి మందలింపూ చాయే! కొందరికి పనిలో బ్రేక్నిచ్చేది చాయ్ అయితే.. ఇంకొందరికి చాయ్ కోసమే పనిలో బ్రేక్ కావాలి. ఫ్రెండ్స్‌కి తోడుగా చాయ్.. సిగరెట్‌కే సాథ్‌మే చాయ్! బోర్ కొడితే చాయ్.. బోర్ కొట్టకుండా ఉండటానికీ చాయ్! ఎందరో క్రియేటర్స్ సృజనకు ఇంధనమూ ఇరానీ చాయే! నమ్మలేని వాళ్లకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పాల్సిందే! ఆయన కెరీర్ తొలినాళ్లలో అమీర్‌పేట బస్‌స్టాప్ పక్కనే ఉన్న చిన్న ఇరానీ కేఫ్‌ని తన స్థావరంగా మార్చేసుకున్నారు. ఆయన్ని కలవడానికి ఎవరొచ్చినా సంభాషణ ఒక ఇరానీ చాయ్‌తో మొదలుపెట్టాల్సిందే. అప్పట్లో ఆయన కోసం వాళ్లింటికి ఎవరు వెళ్లినా ఒకటే సమాధానం.. ‘అన్న కేఫ్‌లో ఉన్నారు’ అని. రానురాను ఇంటికి వచ్చేవాళ్లంతా ముందు కేఫ్‌లో చూసుకొని అక్కడ లేకపోతేనే ఇంటికి వెళ్లేవాళ్లు. పూరీగారి హిట్లన్నీ ఆ చాయ్ కిక్కులోంచి వచ్చినవే. సూపర్ కాంబినేషన్ హైదరాబాద్ సంస్కృతిలో భాగమైపోయిన ఇరానీ కేఫ్‌ల స్థానంలో ఇప్పుడు కొత్త కాఫీకేఫ్‌లు దర్శనమిస్తున్నాయి. మీటింగులు, చాటింగులు, హ్యాంగింగ్లకు సెంటర్‌పాయింట్ అయిపోతున్న ఈ మోడర్న్ కేఫుల్లో పదిరకాల చాయ్‌లు, ఇరవైరకాల కాఫీలు.. కాంప్లికేటెడ్ పేర్లు, కాంప్లికేటెడ్ మెషీన్లు, డిస్పెన్సెస్లతో. టెక్నాలజీ హడావిడికి చిరునామాల్లాగా! కాఫీనురగలో డిజైన్హంగులు సరేసరి! జూబ్లీహిల్స్ 180డిగ్రీ కేఫ్‌లో ఒకసారి కాఫీ నురగపై ఏకంగా నా పేరే రాసిచ్చాడు ఓ కళాపోషకుడు. కాఫీల్లో, టీల్లో ఎన్ని రకాలైనా రావచ్చుగాక.. కేఫేలు ఎన్ని కొత్తరూపాలైనా ఎత్తొచ్చుగాక... కొన్ని మాత్రం సజీవంగా ఉంటాయి. అమ్మమ్మ వేసే ఫిల్టర్ వాసన.. అమ్మ కలిపిన ఇన్స్టంట్ రుచి.. అక్క పెట్టిన టీలోని ఆప్యాయత.. శ్రీవారిచ్చిన కప్పులో ప్రేమ.. ఎప్పటికీ మారవు. అలాగే ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కట్ ఇన్ఫ్రంటాఫ్ చార్మినార్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్!