హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ చేట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18న పిటిషనర్ కేటీఆర్‌తో పాటు.. నలుగురు సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పటిషన్ సాక్షులుగా చేర్చారు. మంత్రి కొండా సురేఖ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment