కమ్మని ఇరానీ చాయ్
హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కమ్మని ఇరానీ చాయ్, ఉప్పగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు, సమోసా విత్ మిర్చి. ఇప్పటివరకు ఇరానీ కేఫ్‌లకే పరిమితమైన ఈ మెనూని స్టార్ హోటల్స్ సైతం యాడ్ చేసుకున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి 5.30వరకు ‘ది గ్రిల్’ పేరుతో హైటీ అందిస్తోంది తాజ్ వివంత.
ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ దీని రుచి చూపిస్తున్నారు. హ్యాపీగా పూల్‌సైడ్ కూర్చుని దర్జాగా నిజాం నాటి మ్యూజిక్ వింటూ హైదరాబాద్ స్పెషల్ హైటీని ఆస్వాదించొచ్చు. అయితే ఇంగ్లిష్ డిషెస్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల రుచిలో ఇరానీ టీ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు చెఫ్ అర్జున్. దీనికోసం డికాషన్‌ను మూడు నుంచి నాలుగు గంటల పాటు మరిగించి అందులోనే చక్కెర కలిపి కేటిల్‌లో ఉంచుతారు.
చివరకు చిక్కని పాలను యాడ్ చేయగా మిల్కీ ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతుంది. కచ్చితంగా మీకు నోరూరిస్తుందని అంటున్నాడాయన. ఈ చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కట్లు, ఆరంజ్ చాక్లెట్స్, ఇంగ్లిష్ టీ కేక్స్, పిన్ వీల్ శాండ్‌విచెస్... ఇలా 15 రకాల స్నాక్స్ కూడా ఉంటాయి. దీని ధర వెయ్యి రూపాయలు.