Taj vivanta
-
బాత్ టబ్‌లో పడి ఎన్నారై మహిళ మృతి!
ఫరిదాబాద్: హరియాణాలో ఓ ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్లో బాత్ టబ్‌లో పడి ఉన్న మహిళ మృతదేహన్ని ఆలస్యంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లండన్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ రీతూ కుమార్ (40) ఈ నెల 22న భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్ బస చేస్తున్నారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం రీతూ కుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వారు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం హోటల్లోని వచ్చి ఆమె గదిలోకి వెళ్లి చూడగా బాత్రూంలో ఆమె మృతదేహం లభించింది. కాగా ఆమె గత కొద్ది రోజులుగా తన భర్తతో కలిసి ఉండడం లేదని, ఆమె గదికి కూడా హోటల్ సిబ్బందిని రావద్దని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. -
సాక్షి పండుగ సంబరాల విజేతలకు బహుమతుల ప్రదానం
-
సాక్షి పండుగ సంబరాల విజేతలకు బహుమతుల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సంబరాల బంపర్‌డ్రాలో గెలిచిన 16 మంది విజేతలకు బుధవారం రాత్రి బేగంపేట తాజ్ వివాంట హోటల్లో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. విజేతలైన ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, సాక్షి ఆపరేషన్స్ డైరెక్టర్ పీవీకే ప్రసాద్, టీఎంసీ సీఎండీ ఉమా అమర్నాథ్, టీవీఎస్ ఏరియా మేనేజర్ తేజపవన్, లక్ష్మీ హ్యుందాయ్ సీఈవో భాస్కర్‌రాజు, వరుణ్ ట్రూవ్యాల్యూ జీఎం వెంకటేశ్వరరావు, యశోదకృష్ణ టయోటా జీఎం వేణుగోపాల్, రాధాకృష్ణ టయోటా మార్కెటింగ్ హెడ్ రాఘవ్, లక్ష్మీ నిస్సాన్ సీఈవో రవికాంత్, లక్ష్మీ నిస్సాన్ జీఎం వేణువినోద్, వరుణ్ మోటార్స్ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, టీవీఎస్ సేల్స్ మేనేజర్ శివరామకృష్ణ, సదరన్ ట్రావెల్స్ మేనేజర్ సత్యనారాయణరావు, సిరిసంపద హోమ్స్ డైరెక్టర్ రాజ్‌మాగంటి, హర్ష టయోటా వీపీ హిమాద్, సాక్షి ఏడీవీటీ జీఎం రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్మని ఇరానీ చాయ్
హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కమ్మని ఇరానీ చాయ్, ఉప్పగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు, సమోసా విత్ మిర్చి. ఇప్పటివరకు ఇరానీ కేఫ్‌లకే పరిమితమైన ఈ మెనూని స్టార్ హోటల్స్ సైతం యాడ్ చేసుకున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి 5.30వరకు ‘ది గ్రిల్’ పేరుతో హైటీ అందిస్తోంది తాజ్ వివంత. ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ దీని రుచి చూపిస్తున్నారు. హ్యాపీగా పూల్‌సైడ్ కూర్చుని దర్జాగా నిజాం నాటి మ్యూజిక్ వింటూ హైదరాబాద్ స్పెషల్ హైటీని ఆస్వాదించొచ్చు. అయితే ఇంగ్లిష్ డిషెస్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల రుచిలో ఇరానీ టీ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు చెఫ్ అర్జున్. దీనికోసం డికాషన్‌ను మూడు నుంచి నాలుగు గంటల పాటు మరిగించి అందులోనే చక్కెర కలిపి కేటిల్లో ఉంచుతారు. చివరకు చిక్కని పాలను యాడ్ చేయగా మిల్కీ ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతుంది. కచ్చితంగా మీకు నోరూరిస్తుందని అంటున్నాడాయన. ఈ చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కట్లు, ఆరంజ్ చాక్లెట్స్, ఇంగ్లిష్ టీ కేక్స్, పిన్ వీల్ శాండ్విచెస్... ఇలా 15 రకాల స్నాక్స్ కూడా ఉంటాయి. దీని ధర వెయ్యి రూపాయలు. -
అదిరే..
-
అదరహో అనిపించిన ఫ్యాషన్ షో
-
‘కింగ్ ఫిషర్’ ఫ్యాషన్ వీక్