
బుధవారం తాజ్ వివాంట హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సాక్షి పండుగ సంబరాల బంపర్‌డ్రా విజేతలతో సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, సాక్షి ఆపరేషన్స్ డైరెక్టర్ పీవీకే ప్రసాద్, సాక్షి ఏడీవీటీ జీఎం రమణకుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సంబరాల బంపర్‌డ్రాలో గెలిచిన 16 మంది విజేతలకు బుధవారం రాత్రి బేగంపేట తాజ్ వివాంట హోటల్‌లో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. విజేతలైన ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, సాక్షి ఆపరేషన్స్ డైరెక్టర్ పీవీకే ప్రసాద్, టీఎంసీ సీఎండీ ఉమా అమర్‌నాథ్, టీవీఎస్ ఏరియా మేనేజర్ తేజపవన్, లక్ష్మీ హ్యుందాయ్ సీఈవో భాస్కర్‌రాజు, వరుణ్ ట్రూవ్యాల్యూ జీఎం వెంకటేశ్వరరావు, యశోదకృష్ణ టయోటా జీఎం వేణుగోపాల్, రాధాకృష్ణ టయోటా మార్కెటింగ్ హెడ్ రాఘవ్, లక్ష్మీ నిస్సాన్ సీఈవో రవికాంత్, లక్ష్మీ నిస్సాన్ జీఎం వేణువినోద్, వరుణ్ మోటార్స్ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, టీవీఎస్ సేల్స్ మేనేజర్ శివరామకృష్ణ, సదరన్ ట్రావెల్స్ మేనేజర్ సత్యనారాయణరావు, సిరిసంపద హోమ్స్ డైరెక్టర్ రాజ్‌మాగంటి, హర్ష టయోటా వీపీ హిమాద్, సాక్షి ఏడీవీటీ జీఎం రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.