![hyderabad: Irani chai Cost increased To 20 rupees - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/6/irani.jpg.webp?itok=KCSGutKm)
సాక్షి, హైదరాబాద్: ఎవరినైనా కలవాలా.. మాట్లాడాలా..? వెంటనే ఫలానా హోటల్/కేఫ్‌కు రావాలంటూ ఆహ్వానిస్తుంటాం. ఇరానీ చాయ్ తాగుతూ ఎన్నో విషయాలను మాట్లాడుకుంటాం. ఇంకా కొందరికైతే ఇరానీ టీ తాగందే ఏమీ తోచదంటే అతిశయోక్తి కాదు. కప్పు టీ తాగి చలాకీగా పనిచేసుకునే వారు ఎంతోమంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ఇరానీ రెస్టారెంట్లు ఫుల్ బిజీగా ఉంటాయి.
అయితే రోజురోజూకీ ఇరానీ చాయ్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అహ్మద్‌నగర్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నంలోని ఎన్నో రెస్టారెంట్లలో చాయ్ రూ.20కి చేరింది. ఇదేంటీ.. మొన్నటి వరకు ఒక ధర ఉండగా ఒక్కసారిగా రూ.20 వరకు చేరింది అంటున్నారు చాయ్ ప్రియులు.
Comments
Please login to add a commentAdd a comment