Irani tea
-
హైదరాబాద్ ఇరానీ చాయ్: ఇలా పెంచేశారేం‘టీ’..?
సాక్షి, హైదరాబాద్: ఎవరినైనా కలవాలా.. మాట్లాడాలా..? వెంటనే ఫలానా హోటల్/కేఫ్‌కు రావాలంటూ ఆహ్వానిస్తుంటాం. ఇరానీ చాయ్ తాగుతూ ఎన్నో విషయాలను మాట్లాడుకుంటాం. ఇంకా కొందరికైతే ఇరానీ టీ తాగందే ఏమీ తోచదంటే అతిశయోక్తి కాదు. కప్పు టీ తాగి చలాకీగా పనిచేసుకునే వారు ఎంతోమంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ఇరానీ రెస్టారెంట్లు ఫుల్ బిజీగా ఉంటాయి. అయితే రోజురోజూకీ ఇరానీ చాయ్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అహ్మద్‌నగర్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నంలోని ఎన్నో రెస్టారెంట్లలో చాయ్ రూ.20కి చేరింది. ఇదేంటీ.. మొన్నటి వరకు ఒక ధర ఉండగా ఒక్కసారిగా రూ.20 వరకు చేరింది అంటున్నారు చాయ్ ప్రియులు. -
మన్ పసంద్
ఓ చక్కని సాయంత్రం, వేడి వేడి సమోసాలు, మంచి ఇరానీ చాయ్.. వీటితో పాటు చక్కటి బుల్లి సినిమాలు వరుసగా ప్లే అవుతుంటే... ఇంక చెప్పేదేముంది... ఓ హైదరాబాదీకి నచ్చే మన్ పసంద్ ఈవెనింగ్ బుధవారం లామకాన్‌లో సాగింది. రెండున్నర గంటలపాటు తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ప్రదర్శించిన షార్ట్ఫిలింస్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆక్టోపస్ స్టూడియోస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఏ షార్ట్ ఈవెనింగ్ విత్ ఫిలింస్ - 15’ ప్రదర్శనలో మొత్తం 8 చిత్రాలను ప్రదర్శించారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ కోసం యూకే, అమెరికా నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయని ఆక్టోపస్ స్టూడియోస్ ఫౌండర్ రాహుల్‌రెడ్డి తెలిపారు. ఈసారి దాదాపు 120 చిత్రాలు స్క్రీనింగ్ కోసం వచ్చాయని... అందులో 8 చిత్రాలను సెలెక్ట్ చేసి ప్రదర్శించావుని చెప్పారు. ప్రదర్శించిన వాటిలో ‘కాంట్రాక్ట్, హ్యపీ బర్త్‌డే, మదర్స్‌డే, అయ్యో’ చిత్రాలు వైవిధ్యంతో అలరించారుు. - సాక్షి, సిటీ ప్లస్ -
చాయ్ సమోసా.. స్టార్ హోటల్
చల్లగాలి అల్లరి చేస్తూ గిరికీలు కొడుతుంటే.. గొంతులో వెచ్చగా ఇరానీ చాయ్ జారాలని కోరుకోనివారెవరూ ఉండరు. ఇక పక్కా హైదరాబాదీలైతే దానికి సమోసాను కూడా జోడించి ఆస్వాదిస్తారు. ఈ మాన్సూన్కి అంతకన్నా పర్ఫెక్ట్ మెనూ ఏముంటుం ది? అందుకే... హోటల్ మారియట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘చాయ్ విత్ సమోసా’ టేస్ట్‌ను తెచ్చింది చాయ్ ప్రియుల కోసం. ఈ నెల 17 వరకు కొనసాగే ఈ ఫెస్ట్‌లో వెజ్, నాన్‌వెజ్ సమోసాతోపాటు వివిధ రకాల టీలు, బిస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి. వావ్ అనాల్సిందే... ఆలూ అండ్ గ్రీన్‌పీస్ సమోసా, క్యారెట్ అండ్ బీన్స్ సమోసాతో జింజర్ టీ టేస్ట్ చేసే ఎంతటివారైనా వావ్ అనాల్సిందే. ఆంధ్రా చిల్లీ చికెన్, మిరియూల మటన్ సమోసాతో ఇలాచీ చాయ్, కాన్ అండ్ స్పినచ్ సమోసాతో లెమన్ చాయ్ కాంబినేషన్స్ రుచికే కాదు ఆరోగ్యానికి మంచిది. పాలు, చక్కెర లేకుండా, కొంత తేనె కలిపి తయారుచేసిన ‘లెమన్ గ్రాస్ టీ’ రుచి అమోఘం. ఇది సీనియర్ సిటిజన్స్ హాట్ ఫేవరేట్! - చెఫ్ ఎం.మధుసూదన్‌రావు సమోసా... వెజ్ ఆలూ అండ్ గ్రీన్‌పీస్ సమోసా పన్నీర్ అండ్ అనియన్ సమోసా కాన్ అండ్ స్పినచ్ సమోసా క్యారెట్ అండ్ బీన్స్ సమోసా నాన్ వెజ్ మటన్ కీమా సమోసా చికెన్ టిక్కా సమోసా మిర్యాల మాంసం సమోసా ఆంధ్రా చిల్లీ చికెన్ సమోసా వెరైటీస్ ఇలాచీ, జింజర్, మసాలా, లెమన్ గ్రాస్ టీ తీపిని ఇష్టపడేవారికి స్వీట్ సమోసా కూడా ఉంది