మన్ పసంద్
ఓ చక్కని సాయంత్రం, వేడి వేడి సమోసాలు, మంచి ఇరానీ చాయ్.. వీటితో పాటు చక్కటి బుల్లి సినిమాలు వరుసగా ప్లే అవుతుంటే... ఇంక చెప్పేదేముంది... ఓ హైదరాబాదీకి నచ్చే మన్ పసంద్ ఈవెనింగ్ బుధవారం లామకాన్‌లో సాగింది. రెండున్నర గంటలపాటు తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ప్రదర్శించిన షార్ట్‌ఫిలింస్ ఎంతో ఆకట్టుకున్నాయి.
ఆక్టోపస్ స్టూడియోస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఏ షార్ట్ ఈవెనింగ్ విత్ ఫిలింస్ - 15’ ప్రదర్శనలో మొత్తం 8 చిత్రాలను ప్రదర్శించారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ కోసం యూకే, అమెరికా నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయని ఆక్టోపస్ స్టూడియోస్ ఫౌండర్ రాహుల్‌రెడ్డి తెలిపారు. ఈసారి దాదాపు 120 చిత్రాలు స్క్రీనింగ్ కోసం వచ్చాయని... అందులో 8 చిత్రాలను సెలెక్ట్ చేసి ప్రదర్శించావుని చెప్పారు. ప్రదర్శించిన వాటిలో ‘కాంట్రాక్ట్, హ్యపీ బర్త్‌డే, మదర్స్‌డే, అయ్యో’ చిత్రాలు వైవిధ్యంతో అలరించారుు.
- సాక్షి, సిటీ ప్లస్