samosas
-
‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్‌తో సరిపెట్టారు’
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్ నేత సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. JDU सांसद सुनील कुमार पिंटू का बड़ा बयान। I.N.D.I. अलायंस की बैठक को बताया टांय-टांय फिस्स। pic.twitter.com/saHVMze4bJ — News18 Bihar (@News18Bihar) December 20, 2023 Video Credits:News18 Bihar ఆయ్.. హిందీ తెలియాల్సిందే విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్‌ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్‌గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు. -
సమోసా రెడీ
లాక్ డౌన్ కారణంగా అందరికీ వీలైనంత ఖాళీ సమయం దొరుకుతోంది. షూటింగ్‌లు, ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా స్టార్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాజల్ కూడా వంట గదిలోకి వెళ్లి సమోసాలు తయారు చేశారు. బాగా రావడంతో శబాష్ అనేసుకున్నారు కూడా. ‘‘తొలిసారి సమోసా చేశాను. చాలా బాగా కుదిరింది. మా అమ్మ ఆధ్వర్యంలో చాలా శుభ్రతను, క్వాలిటీని పాటిస్తూ తయారు చేశాను’’ అని పేర్కొన్నారు కాజల్. -
యూపీ సర్కార్ టీ సమోసాల కోసం 9 కోట్లు
-
టీ, సమోసా, గులాబ్జామ్లకు రూ. 9 కోట్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రులు తమను కలవడానికి వచ్చిన అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామ్ వంటి అల్పాహారం ఇవ్వడానికి నాలుగేళ్లలో ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేశారు. అదేదో వారి సొంత డబ్బుతో కాక ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజల సొమ్ముతో వారు ఈ ఆర్భాటాలు చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా బుధవారం శాసనసభలో వెల్లడించారు. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి అక్షరాలా రూ.8,78,12,474 ఖర్చయిందని ఆయన చెప్పారు. అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అరుణ్ కుమార్ కోరి ఇందుకోసం అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు. ప్రజాపనుల విభాగం మంత్రి శివ్‌పాల్ యాదవ్ మాత్రం అల్పాహారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో తమ అతిథులకు మర్యాదలు చేయడానికి అక్కడి మంత్రులు రోజుకు రూ.2,500 ల నుంచి రూ. 3 వేల వరకు ఖర్చు పెట్టొచ్చు. -
టేస్టీ (స)మోసాలు!
హ్యూమర్ ‘‘మోసాన్ని చాలా మంది నెగెటివ్‌గా చూస్తుంటార్రా... కానీ మోసం ఎంతో పాజిటివ్. పైగా అదెంతో అవసరం’’ అన్నాడు రాంబాబు గాడు. ‘‘మోసం పాజిటివా? పైగా మంచిదా? ఏం మాట్లాడుతున్నావ్‌రా నువ్వు?’’ అంటూ ఒకింత కోపంతో గద్దించాను నేను. వాడేమీ చలించలేదు. ‘‘సజలం, సకాలం లోని పదాలలాగే మోసాలు అనే మాటకు ‘స’ను జోడించు. ఇప్పుడు చెప్పు ‘సమోసాలు’ అందరూ కోరుకునేవా, కావా నువ్వే చెప్పు’’ అన్నాడు వాడు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలిగానీ సమోసాలంటే నాకు ఇష్టమే. నా బలహీనతను ఆసరాగా తీసుకునేవాడిలా మాట్లాడుతున్నాడనిపించింది. ‘‘అదేంట్రా మోసాలకు ముందు ‘స’ అనే అక్షరం పెట్టినంత మాత్రాన మోసాలకూ, సమోసాలకూ సాపత్యమేమిటి?’’ అని అడిగా. ‘‘మోసం అన్నమాటే నీచం అన్నట్లుగా చెబుతుంటారు. కానీ అదే మోసాన్ని పాజిటివ్‌గా చూపే సామెతలనూ, కథలనూ మనకు చిన్నప్పట్నుంచే వినిపిస్తూ, మోసాలు చేయమని పెద్దలే చెబుతారు’’ అన్నాడు వాడు. ‘‘మోసాలు చెయ్యండంటూ పెద్దలే చెబుతారా?’’ ఒళ్లు మండి అనడిగాన్నేను. ‘‘ఆ... అవును. పైగా మోసం చేయడం చాలా అవసరం అని చెప్పడానికి నిదర్శనంగా ఒక కథ కూడా చెబుతారు. ఒక సింహం అడవిలోని జంతువులనన్నింటినీ రోజూ అప్పనంగా తినేస్తోందట. ‘రోజుకు ఒకటి చొప్పున స్వచ్ఛందంగా ఆహారమవుతాం’ అని జంతువులన్నీ ఆ సింహానికి నచ్చజెప్పాయట. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చిందట. అది సింహం దగ్గరకు కాస్త ఆలస్యంగా వెళ్లిందట. సింహానికి కోపం వచ్చి జాప్యానికి కారణం అడిగిందట. అప్పుడా కుందేలు... ‘రాజా... నీకోసమే బయల్దేరితే మధ్యలో మరో సింహం ఎదురైంది. అది అటకాయించడం వల్లనే ఆలస్యం అయ్యింది’ అంటూ జవాబిచ్చిందట. అప్పుడా సింహానికి మరింత కోపం వచ్చి ఎవరా సింహం చూపమందట. దాంతో ఆ కుందేలు ఒక పాడుబడ్డ బావిని చూపి అందులోనే అది ఉందని చెప్పిందట. అప్పుడు తన ప్రతిబింబాన్నే మరో మృగరాజుగా భావించిన ఆ సింహం దానితో పోరాడటానికి బావిలోకి దూకి చచ్చూరుకుందంటారు. కుందేలు మోసాన్ని మెచ్చుకుంటారు. ఇక్కడ చివరన... మోసాన్ని మోసంతోనే జయించాలని నీతి చెబుతారు విజ్ఞులు’’ అన్నాడు వాడు. ‘‘ఒరే ఇక్కడ కుందేలు చేసింది మోసం కాదురా... దాన్ని యుక్తి అంటారు’’ చెప్పాను నేను. అప్పటికీ రాంబాబు గాడు తగ్గలేదు. ‘‘మనం ప్రదర్శిస్తే యుక్తి. అదే ఇతరులు మనకు చేస్తే మోసం. పైగా మోసాలు అనేవి తప్పు కాదనీ, అవి ప్రకృతి ధర్మమని తెలుసు కోవాలి’’ అన్నాడు వాడు. ‘‘మోసాలు ప్రకృతిలో భాగమా?’’ అడిగాను నేను. ‘‘అవున్రా. మొక్కలూ మోసాలు చేస్తాయి. ఫ్లై ఆర్కిడ్ అనే మొక్క ఎంత మోసం చేస్తుందో చూస్తే మతిపోతుంది. అది తన పూల ఆకృతిని ఎలా ఉంచుతుందో తెలుసా? అచ్చం ఆడ తుమ్మెద రూపంలా. అంతేకాదు... వయసుకు వచ్చిన ఆడ తుమ్మెద నుంచి వెలువడే వాసననూ ఆ పువ్వు వెలువరిస్తుంది. సదరు హార్మోన్ల పరిమళాలకు పరవశిస్తాయి మగ తుమ్మెదలు. అంతే... పాపం ఆ మగపురుగులు మోసపోయి... ఆడ తుమ్మెదను కలుస్తున్నాం కదా అన్న భ్రాంతితో ఆ పువ్వు మీద వాలిపోతాయి. ఆ తర్వాత ఆశాభంగం చెంది కునారిల్లిపోతాయి. ‘తుమ్మెద ఫీలింగ్స్ ఎలా పోతే మనకెందుకు? మన పుప్పొడి దాని కాళ్లకు అంటి వ్యాపించింది కదా’ అని ఖుషీ అవుతుంది మన ఫ్లై ఆర్కిడ్ మొక్క. యుద్ధంలో, ప్రేమలో అంతా యుక్తమేనట. తమ పుప్పొడి ఆడపువ్వును చేరడం కోసం తమ పూ రెక్కలతో ఇలా మోసానికి పాల్పడతాయి ఆ మొక్కలు. ఇది ఇలా ఉంటే ఇక విజ్ఞులంతా వజ్రాన్ని వజ్రమే ఖండిస్తుంది. అలాగే మోసాన్ని మోసంతోనే జయించాలని ఉద్బోధిస్తుంటారు. అంటే మోసం ఈజ్ ఈక్వల్ టు వజ్రం అన్నమాట. మరి వజ్రమంత విలువైనదాన్ని అలా నెగెటివ్‌గా చూడటం మన తప్పుకాదా?’’ అన్నాడు వాడు. రాంబాబు గాడితో ఇక నేను వాదించలేక ‘‘ఒరేయ్... ఎవరైనా నిన్ను మోసం చేసినప్పుడు తెలుస్తుందిరా నీకు ఆ బాధేమిటో’’ అన్నాను కినుకగా. ‘‘నీకు నేచురల్ సైన్స్‌లోని నేచర్ అర్థం కావడం లేదు. అందుకే నీకు అర్థమయ్యే భాషలో చెబుతా విను. చిన్నప్పటి మన ‘అడవిరాముడు’ దగ్గర్నుంచి మొన్నటి మహేశ్ బాబు ‘దూకుడు’ వరకూ... మన హీరోలు పాపం విలన్లను మోసం చేస్తూ ఆటపట్టిస్తూ ఉంటే... ఇంటర్వెల్లో సమోసాలు తెచ్చుకుని తింటూ మరీ ఆ మోసాలను ఎంజాయ్ చేశావా లేదా? మోసం నీకు మోదం ఇస్తుంటే అది నెగెటివ్ ఎలా అవుతుంద్రా’’ అన్నాడు వాడు. ఏమీ బదులు ఇవ్వలేక ‘‘నీదంతా తొండి. నువ్వు చేసేదంతా మాటల గారడీరా’’ అన్నాన్నేను. ‘‘గారడీ అంటేనే మోసం. అది కూడా నువ్వు ఎంజాయ్ చేసేదే’’ అంటే నిశ్శబ్దంగా మోసపోవడమే మరోమారు నా వంతయ్యింది. - యాసీన్ -
ఉల్లి దోసెకు విరామం
* గుంటూరు, కృష్ణా జిల్లాల హోటళ్ల యజమానుల నిర్ణయం * ధర దిగొచ్చే వరకూ ఇదే పరిస్థితి * బెంబేలెత్తిస్తోన్న ఉల్లి సాక్షి, విజయవాడ బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల నుంచి ఉల్లి దోసె దొరకడం గగనమైంది. ఉల్లి దోసె, సమోసాల విక్రయాలకు పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల యజమానులు తాత్కాలిక విరామం పలికారు. ‘సారీ సార్... ఉల్లి దోసె వేయడం లేదు’ అని సమాధానమిస్తున్నారు. మార్కెట్లో ఉల్లి ధర చుక్కలనంట డమే దీనికి కారణం. ధర దిగొచ్చే వరకూ ఉల్లి దోసె కష్టమేనని బదులిస్తున్నారు. దీంతో ఉల్లిదోసె ప్రియులకు కష్టమొచ్చి పడినట్లయ్యింది. వీరు నోరు కట్టేసుకుని ఇడ్లీ, సాదా దోసెలతో సరిపుచ్చుకుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోని హోటళ్లలో రోజుకు సగటున 20 క్వింటాళ్ల ఉల్లిపాయల వాడకం ఉంటుందని అంచనా. గుంటూరు నగరంలో ఉల్లితో తయారు చేసే తినుబండారాల ద్వారా రోజుకు రూ. 30 లక్షల నుంచి 35 లక్షల వ్యాపారం ఉంటుందని సీనియర్ హోటల్ వ్యాపారి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధర కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పలుకుతోంది. ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రూ.20 లకే సరఫరా చేస్తున్నా, అవన్నీ గృహ అవసరాలకే సరిపోవడం లేదు. ఇక హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు ఎక్కడ దొరుకుతాయని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధిక ధర పెట్టి ఉల్లిపాయలు కొని ఉల్లి దోసెను అందుబాటులో ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న దోసె రేటును రెట్టింపు చేయాల్సి ఉంటుందనీ, ఆ విధంగా రేటు పెంచితే కస్టమర్లు రారని, దీంతో వాటికివిరామం ఇచ్చామని చెబుతున్నారు. -
మన్ పసంద్
ఓ చక్కని సాయంత్రం, వేడి వేడి సమోసాలు, మంచి ఇరానీ చాయ్.. వీటితో పాటు చక్కటి బుల్లి సినిమాలు వరుసగా ప్లే అవుతుంటే... ఇంక చెప్పేదేముంది... ఓ హైదరాబాదీకి నచ్చే మన్ పసంద్ ఈవెనింగ్ బుధవారం లామకాన్‌లో సాగింది. రెండున్నర గంటలపాటు తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో ప్రదర్శించిన షార్ట్ఫిలింస్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆక్టోపస్ స్టూడియోస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఏ షార్ట్ ఈవెనింగ్ విత్ ఫిలింస్ - 15’ ప్రదర్శనలో మొత్తం 8 చిత్రాలను ప్రదర్శించారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ కోసం యూకే, అమెరికా నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయని ఆక్టోపస్ స్టూడియోస్ ఫౌండర్ రాహుల్‌రెడ్డి తెలిపారు. ఈసారి దాదాపు 120 చిత్రాలు స్క్రీనింగ్ కోసం వచ్చాయని... అందులో 8 చిత్రాలను సెలెక్ట్ చేసి ప్రదర్శించావుని చెప్పారు. ప్రదర్శించిన వాటిలో ‘కాంట్రాక్ట్, హ్యపీ బర్త్‌డే, మదర్స్‌డే, అయ్యో’ చిత్రాలు వైవిధ్యంతో అలరించారుు. - సాక్షి, సిటీ ప్లస్ -
చాయ్ సమోసా.. స్టార్ హోటల్
చల్లగాలి అల్లరి చేస్తూ గిరికీలు కొడుతుంటే.. గొంతులో వెచ్చగా ఇరానీ చాయ్ జారాలని కోరుకోనివారెవరూ ఉండరు. ఇక పక్కా హైదరాబాదీలైతే దానికి సమోసాను కూడా జోడించి ఆస్వాదిస్తారు. ఈ మాన్సూన్కి అంతకన్నా పర్ఫెక్ట్ మెనూ ఏముంటుం ది? అందుకే... హోటల్ మారియట్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘చాయ్ విత్ సమోసా’ టేస్ట్‌ను తెచ్చింది చాయ్ ప్రియుల కోసం. ఈ నెల 17 వరకు కొనసాగే ఈ ఫెస్ట్‌లో వెజ్, నాన్‌వెజ్ సమోసాతోపాటు వివిధ రకాల టీలు, బిస్కెట్స్ అందుబాటులో ఉన్నాయి. వావ్ అనాల్సిందే... ఆలూ అండ్ గ్రీన్‌పీస్ సమోసా, క్యారెట్ అండ్ బీన్స్ సమోసాతో జింజర్ టీ టేస్ట్ చేసే ఎంతటివారైనా వావ్ అనాల్సిందే. ఆంధ్రా చిల్లీ చికెన్, మిరియూల మటన్ సమోసాతో ఇలాచీ చాయ్, కాన్ అండ్ స్పినచ్ సమోసాతో లెమన్ చాయ్ కాంబినేషన్స్ రుచికే కాదు ఆరోగ్యానికి మంచిది. పాలు, చక్కెర లేకుండా, కొంత తేనె కలిపి తయారుచేసిన ‘లెమన్ గ్రాస్ టీ’ రుచి అమోఘం. ఇది సీనియర్ సిటిజన్స్ హాట్ ఫేవరేట్! - చెఫ్ ఎం.మధుసూదన్‌రావు సమోసా... వెజ్ ఆలూ అండ్ గ్రీన్‌పీస్ సమోసా పన్నీర్ అండ్ అనియన్ సమోసా కాన్ అండ్ స్పినచ్ సమోసా క్యారెట్ అండ్ బీన్స్ సమోసా నాన్ వెజ్ మటన్ కీమా సమోసా చికెన్ టిక్కా సమోసా మిర్యాల మాంసం సమోసా ఆంధ్రా చిల్లీ చికెన్ సమోసా వెరైటీస్ ఇలాచీ, జింజర్, మసాలా, లెమన్ గ్రాస్ టీ తీపిని ఇష్టపడేవారికి స్వీట్ సమోసా కూడా ఉంది -
సమోసాలు తిని 27 మందికి అస్వస్థత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ దుకాణంలో సమోసాలు కొనుక్కుని తిన్న దాదాపు 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన భత్కారీ గ్రామంలో జరిగింది. వీరందరినీ వెంటనే గత రాత్రే దేబాయ్ పట్టణంలో ఉన్న ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీళ్లంతా సమోసాలు తిన్నందువల్లే వీరికి ఆరోగ్యం పాడైందని, అయితే ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓహ్రి తెలిపారు. ఇవి రెండు మూడు రోజుల క్రితం నాటివి అయి ఉంటాయని, అందుకే పాడైనవి తినడంతో వారు అనారోగ్యం పాలయ్యారని ఆయన చెప్పారు. దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపారు.