ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్ జిల్లాలో ఓ దుకాణంలో సమోసాలు కొనుక్కుని తిన్న దాదాపు 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షహర్ జిల్లాలో ఓ దుకాణంలో సమోసాలు కొనుక్కుని తిన్న దాదాపు 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన భత్కారీ గ్రామంలో జరిగింది. వీరందరినీ వెంటనే గత రాత్రే దేబాయ్ పట్టణంలో ఉన్న ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వీళ్లంతా సమోసాలు తిన్నందువల్లే వీరికి ఆరోగ్యం పాడైందని, అయితే ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓహ్రి తెలిపారు. ఇవి రెండు మూడు రోజుల క్రితం నాటివి అయి ఉంటాయని, అందుకే పాడైనవి తినడంతో వారు అనారోగ్యం పాలయ్యారని ఆయన చెప్పారు. దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపారు.