వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం | 2 People Including a Child of the Same Family Died After Eating Roasted Chana | Sakshi
Sakshi News home page

వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం

Published Mon, Nov 25 2024 1:30 PM | Last Updated on Mon, Nov 25 2024 1:30 PM

2 People Including a Child of the Same Family Died After Eating Roasted Chana

బులంద్‌షహర్: యూపీలోని బులంద్‌షహర్‌లో ఆందోళనకర ఉదంతం చోటుచేసుకుంది. వేయించిన శనగలు తిన్న ఒకే కుటుంబంలోని ఇద్దరు అనారోగ్యానికి గురై మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన దౌలత్‌పూర్‌లో చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న బులంద్‌షహర్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ విపిన్ కుమార్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బులంద్‌షహర్‌లోని బర్వాలా గ్రామానికి చెందిన కలువా(49) దౌలత్‌పూర్ నుంచి వేయించిన శనగలను ఇంటికి తీసుకువచ్చాడు. దీనిని ఇంటిలోని కుటుంబ సభ్యులంతా తిన్నారు. కొద్దసేపటికి వారంతా అనారోగ్యం పాలయ్యారు. చుట్టుపక్కలవారు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. కలువాతో పాటు అతని మనుమడు గోలు చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: సంభాల్‌ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement