bulandshahar
-
వేయించిన శనగలు తిని ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం
బులంద్‌షహర్: యూపీలోని బులంద్‌షహర్‌లో ఆందోళనకర ఉదంతం చోటుచేసుకుంది. వేయించిన శనగలు తిన్న ఒకే కుటుంబంలోని ఇద్దరు అనారోగ్యానికి గురై మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన దౌలత్‌పూర్‌లో చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న బులంద్‌షహర్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ విపిన్ కుమార్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బులంద్‌షహర్‌లోని బర్వాలా గ్రామానికి చెందిన కలువా(49) దౌలత్‌పూర్ నుంచి వేయించిన శనగలను ఇంటికి తీసుకువచ్చాడు. దీనిని ఇంటిలోని కుటుంబ సభ్యులంతా తిన్నారు. కొద్దసేపటికి వారంతా అనారోగ్యం పాలయ్యారు. చుట్టుపక్కలవారు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. కలువాతో పాటు అతని మనుమడు గోలు చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సంభాల్ ఘటన: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు -
అభివృద్ధి నినాదమే సమర నాదం
బులంద్‌షెహర్/రేవారీ: ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ లేదు లేదంటూనే ఎన్నికల ఊసెత్తి పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లాలో రూ.19,100 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం యావత్తూ ప్రచారధోరణిలోనే కొనసాగింది. ‘‘ నేను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. మోదీ గ్యారెంటీల బండి ప్రతి ఒక్క లబి్ధదారుని చెంతకొస్తుంది. ప్రభుత్వ పథకాలు చిట్టచివరి లబ్ధిదారునికి చేరిన నాడు సమాజంలో వివక్ష, అవినీతి అనేవే ఉండవు. అదే అసలైన లౌకికవాదం. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమైనట్లు లెక్క. మీరే నా కుటుంబం. మీ కలలే నాకు సంకల్పాలు. మీలాంటి సాధారణ కుటుంబాలు ఆర్థికాభివృద్దితో సాధికారత సాధించినప్పుడే నా ‘ఆస్తి’ మరింత పెరిగినట్లు సంతోషిస్తా. మా ప్రభుత్వం ఏం చెబుతోందో దానిని చేసి చూపిస్తుంది. మీరు సంతృప్తి చెందే గ్యారెంటీ నాది. 100 శాతం లబి్ధదారులకు పథకాలు చేరేలా నేను కృషిచేస్తా’’ అని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్‌పై విమర్శలు ‘‘ చాన్నాళ్ల క్రితం ఒకరు గరీభీ హఠావో అని గట్టిగానే నినదించారు. కానీ సామాజిక న్యాయం కలగానే మిగిలిపోయింది. కొందరు మాత్రమే సంపన్నులై, వారి రాజకీయాలు మాత్రమే నడవడం పేదలు కళ్లారా చూశారు’’ అని కాంగ్రెస్‌ను విమర్శించారు. ‘‘ ఈ రోజు కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారానికి నేను శ్రీకారం చుడుతున్నానని మీడియాలో ప్రచారం జరిగింది. నేను ఆ పని అస్సలు చేయను. నాకు అవసరం లేదు కూడా. బీజేపీకి భవిష్యత్తులో కూడా ఆ అవసరం పడదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. ప్రజలే నా కోసం ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నపుడు నేను ప్రత్యేకంగా ప్రచారానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నా సమయమంతా ప్రజాసేవకే కేటాయిస్తాను. అభివృద్ది నినాదం మాత్రమే నేను ఇస్తా. దానినిప్రజలే ఎన్నికల సమర నినాదంగా దేశవ్యాప్తంగా మార్మోగిస్తారు’ అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ అన్నారు. కుటుంబ పారీ్టలను ఓడించండి మరోవైపు, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా యువ ఓటర్లతో మాట్లాడారు. ‘‘ లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ పారీ్టలను ఓడించండి. భారత దేశ దశ, దిశలను నిర్ణయించే సత్తా యువ ఓటర్లకు ఉంది. పది, పన్నెండేళ్ల క్రితం నాటి ప్రభుత్వాల పాలనలో నాటి యువత అంధకారంలో మగ్గిపోయింది. మేమొచ్చాక దేశాన్ని అంధకారం నుంచి బయటికి తెచ్చాం. ఇప్పుడు యువతరానికి అవకాశాలు మెరుగయ్యాయి. బీజేపీ మేనిఫెస్టోకు మీరూ సలహాలు, సూచనలను నమో యాప్ ద్వారా పంపండి. మీ చక్కని ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు బీజేపీ ప్రయతి్నస్తుంది’’ అని యువ ఓటర్లకు మోదీ సూచించారు. -
ఈ స్టూడెంట్ వయసు జస్ట్... 92
‘చదువుకు వయసుతో పనేమిటి’ అనేది పాత డైలాగే కావచ్చు గానీ 92 సంవత్సరాల సలీమాఖాన్‌కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే బామ్మను 92 ఏళ్ల వయసులోనూ బడి బాట పట్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమాకు బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం దొరకలేదు. ఆరు నెలల క్రితం బడిలో చేరిన సలీమా పిల్లలతో పాటు క్లాస్‌రూమ్‌లో కూర్చునేది. చదవడం, రాయడం నేర్చుకుంది. ‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను అనే సంతోషాన్ని చెప్పడానికి మాటలు లేవు’ అంటుంది సలీమాఖాన్. ‘మొదట్లో ఆమెకు చదువు చెప్పడానికి టీచర్లు తటపటాయించారు. అయితే ఆమెను వద్దనడానికి మా దగ్గర ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు ఉత్సాహం వచ్చింది. అక్షరాస్యురాలిని కావాలి అనే ఆమె పట్టుదల టీచర్లకు నచ్చింది’ అంటుంది స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ శర్మ. -
Saloni Gaur: కంగనాను అనుకరిస్తూ ‘రన్- అవుట్’.. 17 లక్షల మంది సబ్స్క్రైబర్స్!
Saloni Gaur Story In Telugu: ఆమెకు చిన్నప్పటినుంచి రోజూ న్యూస్ పేపర్లు చదవడం అలవాటు. వీటితోపాటు కథల పుస్తకాలు, నవలలు కూడా చదివేది. అలాగని పాఠ్యపుస్తకాలంటే పడదని కాదు...పాఠాలు కూడా శ్రద్ధగానే చదివేది. ఇలా బాల్యం నుంచి అనేక అంశాలపై పట్టుపెంచుకుని వాటి మీద కామెడీ చేసేది. అప్పట్లో సరదాగా చేసిన ఆ కామెడీనే ఇప్పుడామెని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఆమే సలోని. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సలోని గౌర్ అక్కడే స్కూలు చదువు పూర్తిచేసింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. చిన్నప్పటి నుంచి కరెంట్ ఈవెంట్స్‌ను ఫాలో అవుతూ అన్నింటిలోనూ చురుకుగా ఉండేది. దేశంలో జరిగే అనేక సమకాలీన అంశాలపై హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అందరినీ అనుకరించేది. ఆమె అనుకరణకు స్నేహితులు బాగా నవ్వుకునేవారు. దాంతో తను చేసే కామెడీని తన ఫోన్లో వీడియోలు తీసుకునేది. తర్వాత వాటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసేది. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వీడియోలను మరింత మెరుగ్గా పోస్ట్ చేసేందుకు ప్రయత్నించేది. కాలుష్యంపై కామెడీ.. చిన్న చిన్న కామెడీ వీడియోలు పోస్టుచేస్తోన్న సలోనీ.. 2019 నవంబర్‌లో తన పేరు మీదనే ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని కాలుష్యంపై ‘నజ్మా ఆపీ’ పేరిట వీడియో పోస్టు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో దాదాపు పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. నజ్మా అంటే.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మధ్యతరగతి ముస్లిం మహిళ. తన సాధక బాధలు, రాజకీయ, సామాజిక అంశాలను తోటివారితో ఎలా చర్చిస్తుందో తెలిపే ఫన్నీవీడియోలు నజ్మా ఆపీలో కనిపిస్తాయి. ఈ క్యారెక్టరేగాక దేశంలోని ట్రెండింగ్‌లో ఉన్న వార్షిక బడ్జెట్, ఉల్లిపాయ ధరలు, సీఏఏ, ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, పాకిస్థాన్ రచయిత ఫైజ్ అహ్మద్ వివాదాస్పద రచనలు, కరోనా, లాక్డౌన్, నిరసన లు, ఇండియన్ మామ్స్, డే టు డే లైఫ్, దేశంలో నిరసనలు, హక్కుల పోరాట ఉద్యమాలు, బాలీవుడ్ నటీనటులపై కామెడీ, మిమిక్రీ వీడియోలను పోస్టు చేసేది. వీటికి మంచి స్పందన ఉండేది. రన్–అవుట్ టిక్‌టాక్, కరోనా వైరస్, ఢిల్లీ ఎన్నికలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వంటి సలోని కామెడీ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. కామెడీతోపాటు.. అనుకరణ కూడా చేసేది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వరాన్ని బాగా అనుకరిస్తుంది. కంగనా మీడియా వేదికగా ఏది మాట్లాడినా, దానిని నవ్వించే విధంగా ‘రన్–అవుట్’ పేరిట వీడియోలు పోస్ట్ చేసేది. ఈ వీడియోలు నెటిజనులను బాగా ఆకట్టుకునేవి. ఆ మధ్యకాలంలో కమేడియన్ కునాల్ కమరా, న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిపై కంగన స్పందనను అనుకరించిన వీడియోలకు యాభై లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేగాక నజ్మా ఆపీ క్యారెక్టర్‌తో వందకుపైగా వీడియోలు చేసింది. వీటన్నింటికీ లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఆదర్శ బహు, ట్యూమర్ భరద్వాజ్, సాసు మా వంటి క్యారెక్టర్లు కూడా మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు సలోనీ యూట్యూబ్ చానల్‌కు దాదాపు 17 లక్షలమంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
ప్లాన్ బెడిసికొట్టింది.. ఈసారి భార్య కూడా
లక్నో: మనుషుల్లో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని తప్పులైనా చేసేందుకు నేరగాళ్లు వెనకాడటం లేదు. హత్యలు చేస్తూ, మహిళలపై అకృత్యాలు కొనసాగిస్తున్న మృగాళ్లు, ఆధారాలను మాయం చేసే క్రమంలో ఘాతుకాలకు పాల్పడుతున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి కేసు నుంచి బయటపడేందుకు పక్కా పథకం రచించి అడ్డంగా దొరికిపోయాడు. డబ్బు ఆశజూపి ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు. సినిమా స్టోరీని తలపించే ఆ ఘటన వివరాలు.. యూపీకి చెందిన కుమార్‌పై హత్యానేరం, లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనలో గతంలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. మృతి) తన గుర్తింపును మాయం చేసేందుకు ఈ క్రమంలో అతడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చాడు. కేసుల భయం వెంటాడటంతో ఎలాగైనా వాటి నుంచి విముక్తి పొందాలని భావించాడు. ఈ విషయం గురించి భార్య, తన అనుచరులతో చర్చించి ఓ పథకం రచించాడు. తన పోలికలతో ఉన్న వ్యక్తి కోసం అన్వేషించాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 23న బులంద్‌షహర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న మత్తులో జోగుతున్న బాధితుడికి డబ్బు ఇచ్చి మరింత మద్యం సేవించేలా ప్రోత్సహించాడు. ఆ తర్వాత తన దుస్తులు కూడా ఇచ్చి వేసుకోమని చెప్పాడు. ఇందుకు అతడు వెంటనే అంగీకరించి, కుమార్ చెప్పినట్లుగా చేశాడు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న కుమార్ భార్య, అనుచరుడు, బాధితుడిని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు. అనంతరం అతడి జేబులో కుమార్ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టారు. ముఖం ఆనవాలు తెలియకుండా బండరాళ్లతో నుజ్జునుజ్జు చేశారు. ఆ తర్వాత కుమార్ అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లగా, సహ నిందితులు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన కార్డుల ఆధారంగా అది కుమార్‌దేనని తొలుత భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో కుమార్ ఇంటికి వెళ్లి అతడి భార్యను ప్రశ్నించిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమార్ జాడను ట్రేస్ చేశారు. అలీఘడ్‌లో అతడిని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో హత్య, అత్యాచారం కేసు నమోదైందని, తన స్థానంలో మరో వ్యక్తి శవాన్ని పెట్టి, తన గుర్తింపును మాయం చేసేందుకే కుమార్ ఈ నేరానికి పాల్పడ్డట్లు వెల్లడించారు. -
విద్యార్థిని దుర్మరణం..'ఇన్సురెన్స్ డబ్బుల కోసమే'
లక్నో: అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బులంద్‌షహర్‌కు చెందిన 20 ఏళ్ల సుధీక్షా భాటి అనే మహిళ రోడ్డు ప్రమాదంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. తాజాగా సుధీక్షా భాటి యాక్సిడెంట్ కేసులో ఓ కొత్త ట్విస్ట్ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. సుధీక్షా కుటుంబం ఆరోపిస్తున్నట్లు ఆకతాయి వేధింపుల వల్లే ప్రమాదం జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. అంతేకాకుండా సుధీక్షా మెరిట్ స్టూడెంట్ అయినందున కేవలం ఇన్సురెన్స్ డబ్బుల కోసమే ఆమె కుటుంబం ఈ విధంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇందుకు తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. (విద్యార్థిని దుర్మరణం.. పలు అనుమానాలు) బులంద్‌షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్‌ను వెంబండించాడు. వివిధ రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సదరు బైకర్ కావాలనే తమ కూతురిని వెంబడించి యాక్సిడెంట్ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు బైక్ నడిపింది సుధీక్షా అంకుల్ కాదని, ఆమె తమ్ముడని పోలీసులు అన్నారు. ఇతను మైనర్ అని, సరైన అనుభవం లేని కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో సుధీక్షా అంకుల్ వేరే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. (గుడిని కాపాడేందుకు ముస్లింల మానవ హారం) -
కావాలనే యాక్సిడెంట్ చేశాడు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వరకు ప్రస్థానం కొనసాగించిన ఓ విద్యా కుసుమం నేల రాలిపోయింది. ఎదురుగా వచ్చిన బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదం ఆమె ప్రాణాలను బలిగొంది. ఉన్నత విద్యనభ్యసించి తమకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తుందనుకున్న కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. వివరాలు.. బులంద్‌షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. (యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత) ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్‌ను వెంబండించాడు. వివిధ రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!) సదరు బైకర్ కావాలనే తమ కూతురిని వెంబడించి యాక్సిడెంట్ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ జామ్ వల్ల ముందున్న బైకర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు బులంద్ షహర్ పోలీసులు తెలిపారు. సుదీక్షను ఎవరూ వేధించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలిలో వ్యక్తిని విచారించామని.. అతడు వేధింపుల విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే సుదీక్ష కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనే అని ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. थाना औरंगाबाद क्षेत्रार्न्तगत एक छात्रा की सड़क दुर्घटना में मृत्यु होने की दुखद घटना के संबंध में अपर पुलिस अधीक्षक @bulandshahrpol महोदय द्वारा दी गई #अपडेट बाइट @Uppolice @dgpup @CMOfficeUP @UPGovt @PrashantK_IPS90 @adgzonemeerut @igrangemeerut pic.twitter.com/xizGFZxmDa — Bulandshahr Police (@bulandshahrpol) August 11, 2020 -
అత్యాచార కేసు ప్రధాన నిందితుడు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బులంద్‌షహర్ సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సలీం బవారీ మృతి చెందాడు. కిడ్నీ వ్యాధితో బాధ పడతున్న అతడు ప్రభుత్వాసుపత్రిలో మరణించాడు. సలీం బవారియా అనే వ్యక్తి 2016లో తన స్నేహితులతో కలిసి బులంద్‌షహర్ వద్ద ఓ కుటుంబాన్ని అడ్డగించాడు. ఢిల్లీ- కాన్పూర్ జాతీయ రహదారి గుండా వెళ్తున్న వారిపై దాడి చేసి.. మగవాళ్లందరినీ చెట్టుకు కట్టేసి పదమూడేళ్ల బాలిక, ఆమె తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సలీం బవారియాతో పాటుగా అతడి స్నేహితులు జుబేర్, సాజిద్‌లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం వీరంతా బులంద్‌షహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సలీం ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో అతడిని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా... డయాలసిస్ నిర్వహించారు. అయితే సలీం ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారడంతో అతడిని తిరిగి బులంద్‌షహర్‌కు తీసుకురాగా మృతి చెందాడని జిల్లా ఎస్పీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సామూహిక అత్యాచార కేసులో మిగిలిన నిందితులు ఇద్దరూ బులంద్‌షహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘చంపేస్తావా ఏంటి.. మర్యాదగా మాట్లాడు’
లక్నో : దళితులమైన కారణంగా తమను గుడిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారంటూ కొంతమంది మహిళలు ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అక్టోబరు 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. వివరాలు... బులంద్‌షహర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయంలోకి వెళ్లేందుకు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇద్దరు అగ్ర కులస్తులు వారిని అడ్డుకున్నారు. గుడిలోకి రానిచ్చేది లేదంటూ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బాధిత బృందంలో ఉన్న ఓ మహిళ ఘటనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించారు. ‘మమ్మల్ని చంపేస్తారా ఏంటి? అయినా ఇది దేవాలయం. అందరూ ఇక్కడ పూజలు చేస్తారు. మీరెంతగా భయపెట్టినా ఇక్కడ నుంచి కదిలేది లేదు. మీ బలగాన్నంతా తెచ్చుకోండి. అప్పుడు చూద్దాం. ఎవరి సత్తా ఏంటో అంటూ మహిళలు సదరు వ్యక్తులకు గట్టి సమాధానమిచ్చారు. దీంతో తొలుత కులం పేరుతో దూషించిన సదరు వ్యక్తి ఆ తర్వాత.. ‘ నేను మిమ్మల్ని ఎందుకు భయపెడతాను? ఎందుకు కొడతాను? ఇది ఠాకూర్లకు చెందిన ఆలయం. ఇక్కడ ఠాకూర్లు, బ్రాహ్మణులు మాత్రమే పూజ చేస్తారు. మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది’ అంటూ మాట మార్చాడు. అయినప్పటికీ గుడికి తాళం వేసి వాళ్లను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వాల్మీకి సామాజికవర్గ నాయకుడు విజేందర్ సింగ్ వాల్మీకి, బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇంకెంత కాలం ఈ వివక్ష కొనసాగుతుంది. ఇప్పటికైనా అగ్ర కులస్తులు పంథా మార్చుకోవాలి. వాళ్లు మమ్మల్ని హిందుత్వం నుంచి దూరం చేయాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. In 21st century India,a puported conversation caught on camera ,between SC women and upper caste man preventing temple entry in UP's Bulandshahr Man:go to some other temple Women:why?if someone listens to this thought process,they will be ashamed Man:aaraam se baat karo pic.twitter.com/yAvk7KGDDg — Alok Pandey (@alok_pandey) October 31, 2019 -
సరిగ్గా నెలరోజులకు నిందితుడి అరెస్టు
లక్నో : గోవులను వధించారనే వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో ఎస్ఐ సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన డిసెంబర్ 3న జరగగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యోగేష్రాజ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ యోగేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అరెస్టు ముందు అతనొక వీడియోలో.. అల్లర్లు జరిగిన చోట నేను లేను. హింసాకాండ, ఆందోళలనకు నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వం నన్ను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. చెరుకు తోట సమీపంలో పశువుల కళేబరాలున్నాయని ఎవరో కాల్ చేశారు. దాంతో నేరుగా సియానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. ఆందోళన జరుగుతున్న సమయంలో భజరంగ్‌దళ్ మిత్రులతో కలిసి స్టేషన్లోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. (యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా) ఇదొక కథ..? యోగేష్‌రాజ్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరాలు మరోలా ఉన్నాయి. మిత్రులతో కలిసి సోమవారం (డిసెంబర్, 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లినట్టు చెప్పాడు. పొరుగునున్న మహావ్ గ్రామంలోని చెరుకు తోట సమీపంలో గోవులను వధిస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను గుర్తించామని, వారిని పట్టుకుందామనే లోపలే పారిపోయారని వివరించాడు. ఆ యువకులు తమ గ్రామానికి చెందినవారేనని తెలిపాడు. ఇదిలాఉండగా.. హింసాకాండ చెలరేగిన అనంతరరం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిల్లో.. పశువధ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యోగేష్ రోడ్లను బ్లాక్ చేయించినట్టుగా ఉంది. ఆందోళన సాగుతున్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకొచ్చింది. వీడియోల్లో లభ్యమైన ఆధారాలను బట్టి హింసాకాండకు ప్రధాన సూత్రధారి యోగేష్ అనేందుకు బలం చేకూరుతోంది. భజరంగ్‌దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ భాటి మాట్లాడుతూ.. బులంద్‌షహర్ హింసాకాండతో యోగేష్రాజ్కి సంబంధం లేదని అన్నారు. ఆందోళన సమయంలో అతను పోలీసులకు సాయం చేశాడని చెప్పారు. హత్య, హత్యాయత్నం నేరాల కింద యోగేష్‌పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టపరిచారని కూడా కేసు పెట్టారు. -
తానే కాల్చుకున్నాడు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకున్న హింసాకాండపై బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ లోధి మరో వివాదం లేవనెత్తారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించి సరికొత్త వివాదం రేపారు. డిసెంబర్ 3న జరిగిన విధ్వంసకాండ సందర్భంగా బుల్లెట్ గాయంతో సుబోధ్ మరణించారు. ‘జనమంతా చుట్టుముట్టినప్పుడు సుబోధ్ సింగ్ నిస్సహాయంగా ఉన్నారు. ఆందోళనకారుల బారి నుంచి కాపాడుకునేందుకు తనను తాను కాల్చుకోవాలనుకున్నారు. చివరికి తుపాకిని తలకు గురిపెట్టి కాల్చుకున్నార’ని దేవేంద్ర సింగ్ అన్నారు. సుబోధ్ పుర్రెలో బుల్లెట్ ఉందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఆరు చోట్ల రాళ్లతో కొట్టిన గాయాలు ఉన్నట్టు కూడా పేర్కొంది. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’) మహావ్ గ్రామంలోని ఓ చెరుకుతోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదం మొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, కీలక నిందితుడు ప్రశాంత్ నాథ్‌ను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు గురువారం ప్రకటించారు. సుబోధ్ సింగ్‌ను కాల్చినట్టు అతడు ఒప్పుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే తాను కాల్చలేదని కోర్టు బయట మీడియాతో ప్రశాంత్ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. -
‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా.. ఏం కాదు’
ఓ పోలీసు అధికారి చావు కన్నా.. ఆవు మరణానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. అసలు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తలచుకుంటే భయంగా ఉందంటున్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా. రెండు వారాల క్రితం బులందషహర్ మూక దాడిలో.. జనాలు ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ‘దేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి పూర్తిగా రక్షణ లభిస్తోంది. ఇప్పటికి అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారి చావు కంటే కూడా ఆవు మరణం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.. దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారకరం’ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చాలా భయంగా ఉంది.. ఇలాంటి సమాజంలో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉందని తెలిపారు. -
ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ రోడ్డుపై సోమవారం జరిగిన హిందూత్వ మూకల విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని ఆరోపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు మాట మార్చి అది ఒక ప్రమాదం మాత్రమేనని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన శాంతిభద్రల సమస్య ఎంత మాత్రం కాదని, ఆ నాటి విధ్వంసకాండ వెనక పెద్ద కుట్రే ఉందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ కూడా వ్యాఖ్యానించిన విషయం ఇక్కడ గమనార్హం. ‘ఎవరో, ఎక్కడి నుంచో పశు కళేబరాలను తీసుకొచ్చి ఇక్కడెందుకు వేశారు? వారి ఉద్దేశం ఏమిటీ? ఎలాంటి పరిస్థితుల్లో వారీ పని చేశారు?’ అంటూ ఆయన వేసిన ప్రశ్నల్లో అనుమానపు ఆనవాళ్లు లేవా? నాటి విధ్వంసకాండలో సుమిత్ కుమార్ అనే 20 ఏళ్ల పౌరుడితోపాటు పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ మరణించడం మామూలు విషయం కాదు. పైగా యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం ఎంత మాత్రం యాధృశ్చికం కాదు. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్ దళ్ నాయకులు నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. హింసాకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్ రాజ్ కూడా భజరంగ్ దళ్ నాయకుడు కావడం గమనార్హం. ఆ రోజు తాను తన మిత్రులతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా రోడ్డు పక్క పొలంలో ఏడుగురు వ్యక్తులు పశువును కోస్తుండడం కనిపించిందని తాను అక్కడికి వెళ్లే వరకల్లా వారంతా పారిపోయారని యోగేశ్ రాజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగేష్ రాజ్ సోదరి సుమత్ మహర్ కథనం అందుకు భిన్నంగా ఉంది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడి నుంచో ఫోన్ వస్తే యోగేష్ ఇంటి నుంచి బయల్దేరి వెళ్లారని ఆమె తెలిపారు. పైగా పొలంలో పడి ఉన్న పశు ఎముకలు తాజావి కావని, రెండు, మూడు రోజుల క్రితం చంపేసిన పశు కళేబరాలని అక్కడికి స్వయంగా వెళ్లి పరిశీలించినన సియాన తహసిల్దార్ రాజ్‌కుమార్ భాస్కర్ చెప్పడం కూడా గమనార్హం. పశు ఎముకలు కనిపించిన మహావ్ గ్రామం పొలం పక్కనే ఉన్న చెరకు తోటలో ఆవు తలకాయ, తోలు ఆరేసి ఉన్నాయని, మాంసం కోసం ఆవును చంపేసే వాళ్లు ఇలా ‘ఎగ్జిబిట్’ చేయరని ఆయన చెప్పారు. తన గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలు ఆవును చంపడం తాను కళ్లారా చూశానంటూ సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సియానా గ్రామంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి నయాబామ్ గ్రామానికి చెందిన యోగేశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఆయన పేర్కొన్న ఏడుగురు ముస్లింలలో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా, వారు ఆవు మాంసం తీస్తు కనిపించారని, దగ్గరికెళ్లే సరికి పారిపోయారని రాజ్ అంతకుముందు వీడియా ముఖంగా కూడా చెప్పారు. అలా పారిపోయిన వారిని ఆయన పేర్లతో సహా ఎలా కనిపెట్టారన్నది మరో ప్రశ్న. ఆ ఎముకలు రెండు, మూడు రోజుల క్రితం చంపిన ఆవు వన్నప్పుడు, ఆ ఏడుగురు అక్కడ ఉండే అవకాశం ఉందా? సియాన పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుభోత్ కుమార్ సింగ్ అప్పటికే ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆ విషయం సియాన పోలీసు స్టేషన్‌కు అందలేదా? అందలేదనుకుంటే అదనపు బలగాలను అక్కడి నుంచి ఎలా పంపించారు? ఛింగ్రావత పోలీసు అవుట్ పోస్ట్ వద్ద పోలీసు ఇన్స్పెక్టర్ సుభోద్ కుమార్ సింగ్‌తో భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ వాగ్వాదానికి దిగడం పలు సెల్‌ఫోన్ వీడియోల్లో కూడా రికార్డయింది. ఆ తర్వాత సుభోద్ తలలో బుల్లెట్ గాయంతో మరణించాడు? ఎలా జరిగింది ? ఎముకలను తీసుకొచ్చిన ట్రాక్టర్ ఏమయింది? ఫోరెన్సిక్‌లాబ్‌కు పంపించాల్సిన ట్రాక్టర్‌లోని ఎముకలు ఎందుకు అదృశ్యమయ్యాయి? పొలంలో కూడా ఎముకల ఆనవాళ్లు లేకుండా ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? యోగేశ్ రాజ్ ఫిర్యాదు మేరకు ఏడుగురు ముస్లింలను అరెస్ట్ చేసిన పోలీసులు విధ్వంసకాండలో ప్రధాన నిందితుడైన యోగేశ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. పారిపోయే అవకాశం ఆయనకు ఎందుకు ఇచ్చారు? ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్ వద్ద విధ్వంసకాండ జరిగితే చుట్టుపక్కలున్న ఏడు గ్రామాల ప్రజలు, అంతా యువకులే వాహనాల్లో ఎలా వచ్చారు? వారి వద్ద తుపాకులు ఎందుకు ఉన్నాయి? ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన పిల్లలకు ఐదేసి లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి నిరాకరించిన యోగి ఆదిత్యనాథ్ సంఘటన జరిగిన రోజే సుబోధ్ కుమార్ కుటుంబానికి 40 లక్షల రూపాయల నష్ట పరిహారం, భార్యకు లేదా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ అంత ఉదాహరంగా ఎలా ప్రకటించారు? ఇద్దరు మరణానికి కారణమైన విధ్వంసకాండ కేంద్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసులు ఆవును చంపడం తీవ్రమైన నేరం అంటూ ఆ దిశగానే దర్యాప్తు జరపడం కుట్రలో భాగం కాదా? -
‘బులంద్‌షహర్ ఘటన ఓ ప్రమాదం మాత్రమే’
లక్నో : బులందషహర్‌లో జరిగింది మూక దాడి కాదు.. అది ఒక ప్రమాదం అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల కిత్రం బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడి ఘటనలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. యోగి ఈ దాడిని ఒక ప్రమాదంగా ప్రకటించడమే కాక.. సరైన సమయంలో స్పందిచంలేదంటూ ఇద్దరు పోలీసు అధికారులను ట్రాన్సఫ్ర్ చేశారు. అడిషనల్ డీజీపీ ఎస్బీ షిరాద్కర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం యోగి ప్రభుత్వం సర్కిల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ శర్మ, ఇన్ చార్జ్ ఆఫ్ ద పోలీస్ పోస్ట్ సురేష్ కుమార్‌లను ట్రాన్సఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే గతంలో ఈ దాడిని భారీ కుట్రగా పేర్కొన్న యోగి.. మాట మార్చి ఇది కేవలం యాక్సిడెంట్ అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ దాడికి కారకులుగా భావిస్తూ పోలీసు అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. కానీ ముఖ్యమైన కుట్రదారు యోగేష్ రాజా పరారీలో ఉండగా తాజాగా ఓ జవాను పేరు తెరమీదకు వచ్చింది. -
‘నా కొడుకు తప్పు చేసి ఉంటే.. తప్పకుండా శిక్షించాలి’
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో బులంద్‌షహర్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్‌కుమార్ సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు యోగేశ్ రాజ్, సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానించారు. తాజాగా.. జమ్ముకశ్మీర్‌కు చెందిన జవాను జీతు ఫ్యూజి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారాడు. శ్రీనగర్‌కు చెందిన జీతు ఇన్స్పెక్టర్ సుబోధ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు ఫ్యూజి అక్కడే ఉన్నట్లు.. అనంతరం అదే రోజు సాయంత్రమే శ్రీనగర్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బులందషహర్ ఘటనలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోల్లో జీతు ఫ్యూజి స్పష్టంగా కనిపించాడు. అతడిని పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు జమ్ముకశ్మీర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుబోధ్ హత్య వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా అల్లర్ల సమయంలో సుబోధ్‌ను చంపేయ్యండి అంటూ కొందరు ఆందోళనకారులు అరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ ఘర్షణలో మరో యువకుడు సుమిత్ కూడా చనిపోయాడు. సుమిత్ మృతికి ప్రతీకారంగానే సుబోధ్‌పై దాడి చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. కొందరు ఆందోళన కారులు పోలీసులను వెంబడిస్తూ ‘వారి దగ్గర నుంచి తుపాకీలు లాక్కొని వారిని చంపేయండి’ అని అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. (జవాన్ జీతు ఫ్యూజీ తల్లిదండ్రులు) పదునైన ఆయుధంతో సుబోధ్‌పై దాడి చేసి ఆ తర్వాత తలపై కాల్చి చంపారు. సుబోధ్ చనిపోయిన సమయంలో జీతు అతని ఎదురుగానే ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే అతన్ని గుర్తు పట్టడంలో జీతు తల్లి తడబుతున్నట్లు తెలుస్తోంది. వీడియోల్లో తన కొడుకును స్పష్టంగా గుర్తించలేకపోయానని తెలిపింది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లు తన కొడుకే సుభోద్‌ను హత్య చేసి ఉంటే.. ఢ. మరో కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. సుభోద్ సింగ్ మరణించిన రోజున జీతు ఘర్షణ జరిగిన ప్రాంతంలోనే ఉన్నాడని తెలిపారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ‘డ్రామా చూశారా’ అంటూ ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నారు. అనంతరం సాయంత్రం కార్గిల్ వెళ్లాడని తెలిపారు. -
‘ఆ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర’
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చెలరేగిన ఘర్షణల్లో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు ఓ యువకుడు మరణించిన క్రమంలో రాజకీయ దుమారం రేగుతుండగా, ఈ వ్యవహారం వెనుక కుట్ర కోణం ఉందని పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బులంద్‌షహర్ ఘటన భారీ కుట్ర..ఇది శాంతి భద్రతల సమస్యే కాదని, అసలు అక్కడికి జంతు కళేబరం ఎలా వచ్చిందని, దీన్ని ఎవరు, ఎందుకోసం, ఏ పరిస్థితుల్లో తీసుకువచ్చారని యూపీ డీజీపీ ఓపీ సింగ్ బుధవారం ప్రశ్నించారు. మరోవైపు బులంద్‌షహర్ ఘర్షణ నాటకీయ ఘటన అని, హింసాకాండకు బీజేపీదే బాధ్యతని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముజఫర్‌నగర్ ఘటన తరహాలోనే బులంద్‌షహర్ ఘటనను నాటకీయంగా ముందుకుతెచ్చారని శివసేన సందేహం వ్యక్తం చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం అంత సులభం కాదని గ్రహించిన బీజేపీ మతపరంగా ప్రజల మధ్య వైషమ్యాల చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. కాగా, బులంద్‌షహర్‌లోని అక్రమ కబేళాలో గోవధ జరుగుతుందనే ఆరోపణలతో ఆందోళనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీస్ అధికారి సుబోధ్ కుమార్ సింగ్ సహా ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. -
నా భర్తను చంపిన వారికీ అదేగతి..
లక్నో : తన భర్తను చంపిన వారికీ అదే గతిపడితేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని యూపీలోని బులంద్‌షహర్‌లో సోమవారం జరిగిన అల్లర్లలో మరణించిన పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ భార్య అన్నారు. విధి నిర్వహణలో తన భర్త నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండేవారని మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. విధి నిర్వహణలో తన భర్తపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదన్నారు. గతంలో ఆయనకు రెండు సార్లు బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. ఇప్పుడు ఆయనకు ఎవరూ న్యాయం చేయలేరని, తన భర్తను చంపిన వారిని హతమార్చితేనే న్యాయం జరుగుతుందని సింగ్ భార్య అన్నారు. దాద్రిలో మహ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసును విచారిస్తున్న పోలీస్ అధికారుల్లో ఒకరైన సింగ్ మరణం పట్ల ఆయన సోదరి సైతం విచారం వ్యక్తం చేశారు. గోవధ కేసును విచారిస్తున్నక్రమంలో తన సోదరుడిని హత్యచేయడం కుట్రపూరితమేనని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన తన సోదరుడికి అమరవీరుడి హోదా ఇవ్వాలని, తమ స్వస్ధలంలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బులంద్‌షహర్‌లోని అక్రమ కబేళాలో గోవధ జరుగుతుందనే ఆరోపణలతో ఆందోళనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీస్ అధికారి సుబోధ్ కుమార్ సింగ్ సహా ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. -
ఆ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కుట్ర..
లక్నో : పోలీస్ అధికారి సహా ఇద్దరు మరణించిన బులంద్‌షహర్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ వ్యక్తులే ఈ అల్లర్లకు కుట్ర జరిపారా అనేది తాము తేల్చుతామని స్వామి చెప్పుకొచ్చారు. యూపీ తగలబడుతుంటే యోగి ఆదిత్యానాథ్ ప్రచారంలో బిజీగా మారారనే కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో భారత్ తగులబడలేదా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీలో ఎలాంటి విచారణ లేకుండానే వేలాది మంది అమాయక ప్రజలను జైళ్లలో నిర్భందించిన కాంగ్రెస్ యూపీ సీఎంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో గోవధ వదంతుల నేపథ్యంలో హింసాత్మక నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అల్లరిమూకలు పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలకు నిప్పంటించి రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లర్ల ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ వర్మ సహా స్ధానిక యువకుడు మరణించారు. -
‘చివరిసారిగా నాతో బాగా చదువుకో అని చెప్పారు’
లక్నో : మా నాన్న మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారు.. మతం పేరుతో ప్రజలు హింసకు పాల్పడటాన్ని ఆయన ఏ మాత్రం సహించే వారు కారు అంటున్నారు అభిషేక్. నిన్న యూపీలోని బులందషహర్‌లో గోరక్షకులకు, పోలీసులకు నడుమ జరిగిన దాడుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించిన సంగతి తెలిసింది. మరణించిన సుబోధ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు అభిషేక్.. ఇంటర్ పూర్తి చేశాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న అభిషేక్ ప్రపంచం.. తండ్రి మరణవార్తతో ఒక్కసారిగా మూగ బోయింది. ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు నేను మా నాన్నతో మాట్లాడాను. అప్పుడు ఆయన వీక్‌గా ఉన్న సబెక్ట్‌ల మీద దృష్టి సారించాల్సిందిగా నాకు సూచించారు . గత పరీక్షల్లో ఏ సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయో వాటి మీద బాగా ఫోకస్ చేయమని చెప్పారు అంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాక నాన్న మాతో ఎప్పుడు మీ ఆహారాన్ని మీరు సంపాదించుకున్న రోజున నేను మరణించినా పర్వాలేదు అని చెప్పేవారు. కొన్ని సార్లు కొన్ని కేసులను విచారించకూడదంటూ ఆయన మీద ఒత్తిడి వచ్చేది. కానీ ఆయన అలాంటి వాటికి ఎప్పుడు భయపడలేదు అని తెలిపారు. సుబోధ్ సింగ్ పెద్ద కొడుకు అతని అంత్యక్రియలను నిర్వహించాడు. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కబేళాల్లో గోవధ జరుగుతుందంటూ స్ధానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్-సైనా రహదారిపై ఆందోళనకు దిగిన పలు హిందూ సంస్థల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. హిందూ యువవాహని, బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాలను దగ్ధం చేసి, పోలీస్ అధికారులపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. ఈ హింసాకాండలో సైనా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించగా, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. -
అక్రమ కబేళాలపై ఆందోళన హింసాత్మకం
లక్నో : యూపీలోని బులంద్‌షహర్‌లో అక్రమ కబేళాలు నడుస్తున్నాయనే వదంతులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోరక్షకుల పేరుతో గుమికూడిన ఆందోళనకారులు, పోలీసుల నడుమ జరిగిన ఘర్షణలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మరణించారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కబేళాల్లో గోవధ జరుగుతుందంటూ స్ధానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్-సైనా రహదారిపై ఆందోళనకు దిగిన పలు హిందూ సంస్థల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. హిందూ యువవాహని, బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాలను దగ్ధం చేసి, పోలీస్ అధికారులపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. హింసాకాండలో సైనా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించగా, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బులంద్‌షహర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు రప్పించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీనియర్ పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై మరణించాడని వార్తలు రాగా, ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించలేదు. -
మన బులంద్ బెహన్
ఉన్నతమైన ఆశయాలున్న గర్జనపల్లి చెల్లిసామాన్యమైన కుటుంబంలో పుట్టి...శిఖరాన్ని అధిరోహించిన కరీంనగర్ బిడ్డ.అసలు ‘బులంద్’ అంటేనే ఎల్తైన, ఉన్నతమైన అని అర్థం.మన తెలుగు బిడ్డ బానోత్ చంద్రకళ...యూపీలోని బులంద్ శహర్‌ని పాలించింది.ఆలోచన గొప్పదైనప్పుడు...ఆశయం ఉన్నతమైనదైనప్పుడు...లక్ష్యం ఎల్తైనదైనప్పుడు...కీర్తి... కిరీటమవుతుంది.బానోత్ చంద్రకళ, ఐఏఎస్... మన తెలుగింటి అమ్మాయి. కరీంనగర్ జిల్లాలో పుట్టింది. ఉత్తర ప్రదేశ్‌లో అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతోంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి మగవాళ్లు కూడా భయపడతారు. అలాంటిది 38 ఏళ్ల చంద్రకళ పదేళ్లు అక్కడ నెగ్గుకు వచ్చింది. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంలోనూ నిజాయితీ కలిగిన మంచి చురుకైన అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. యోగి ఆదిత్యనాథ్ హయాంలోనూ అదే గౌరవాన్ని అందుకుంది. ఐఏఎస్ కావడానికి చంద్రకళ పుట్టిల్లు వడ్డించిన విస్తరేమీ కాదు. ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చిందామె. ఒక్కొక్క మెట్టునూ అధిరోహిస్తూ విజయాన్ని తన దగ్గరకు తెచ్చుకుంది. సామాన్య కుటుంబం కరీంనగర్ జిల్లా, ఎల్లారెడ్డి మండలం, గర్జన పల్లి గ్రామం ఆమెది. పెద్దగా సౌకర్యాల్లేని లంబాడా తండా అది. తండ్రి కిషన్ రామగుండం ఎరువుల కంపెనీలో ఫోర్మన్. మొత్తం నలుగురు పిల్లలు, అన్న రఘువీర్, తమ్ముడు మహావీర్, చెల్లెలు మీనా. చంద్రకళ తల్లి లక్ష్మికి పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనే కల ఉండేది. కానీ కోఠీ ఉమెన్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే పెళ్లి చేశారు. పెళ్లి తరవాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో ఎం.ఏ పట్టా అందుకుంది. గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరవాత ప్రతి అడుగునూ ఒక చాలెంజ్‌గానే వేసింది. ఒక సవాల్‌ని ఎదుర్కొంటున్నట్లు ప్రిపేరైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో టాపర్. సివిల్ సర్వీసెస్‌లో 2008లో 409వ ర్యాంకుతో ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా నియామకం. లక్ష్మి నలుగురు పిల్లల్లో అత్యున్నత స్థాయికి చేరిన బిడ్డ చంద్రకళ. ఈ సంతోషం లక్ష్మికి మాత్రమే కాదు చుట్టుపక్కల అనేక లంబాడా తండాల జనం కలెక్టరయింది తమింటి బిడ్డే అన్నంతగా సంతోషించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బులంద్ శహర్, బిజౌర్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో పనిచేసింది. కలెక్టర్‌గా బాధ్యతల నిర్వహణలో రాజీ పడని అధికారిగా, హార్డ్ వర్కర్ అనే గుర్తింపు వచ్చిందామెకు. ఆగని పయనం ప్రయాణానికి గమ్యం ఉండాలి, జీవితానికి లక్ష్యం ఉండాలి. గమ్యం లేని ప్రయాణానికి, లక్ష్యం లేని జీవితానికీ అర్థం ఉండదు. అందుకు చంద్రకళ ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లల్ని పెద్ద హోదాల్లో చూడాలనే తపన తప్ప ఏం చదివించాలో తెలియని అమాయకత్వం లక్ష్మిది. మార్గదర్శనం చేసేవాళ్లు లేకపోవడంతో కొంతకాలం తడబాట్లతో సాగింది చంద్రకళ పయనం. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే... లక్ష్యం అంటూ స్థిరంగా ఏర్పరుచుకోక ముందు కూడా ప్రయాణం ఆపలేదామె. తనకు ఇష్టమైన కోర్సులో కొనసాగింది. మెదడులో ఒకసారి కెరీర్ అనే బీజం పడిన తర్వాత ఇక వెనక్కి చూసుకోలేదు. అందరిలో ఒకరిగా కాదు, పదిమందిలో గౌరవం అందుకునే బాధ్యతాయుతమైన హోదాలో జీవించాలనే కోరిక ఆమె బుర్రలో పడిన తర్వాత ఆమెకు ఏదీ కష్టంగా అనిపించలేదు. గర్భిణిగా బిడ్డను మోస్తున్నప్పుడు కానీ, బిడ్డకు తల్లి అయిన తర్వాత కానీ ఆమె ప్రిపరేషన్లో విరామం తీసుకోలేదు. మోదీ స్ఫూర్తితో... సాధారణ పాలనాధికారాలు, బాధ్యతలతోపాటు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాల్లో స్వచ్ఛభారత్‌ను ప్రత్యేక శ్రద్ధతో నిర్వర్తిస్తోందామె. ఢిల్లీ నగరం దాటి ఉత్తరప్రదేశ్‌లో అడుగు పెట్టగానే సరిహద్దు దాటామనే సంగతి సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి వీధుల్లో రాజ్యమేలే చెత్త స్వాగతం పలుకుతుంటుంది. అలాంటి రాష్ట్రంలో స్వచ్ఛభారత్ కోసం రోజుకు ఇరవై గంటలైనా పని చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రకళ స్వచ్ఛభారత్ ప్రోగ్రామ్‌ను వాడవాడలా అమలు చేయించడానికి కంకణం కట్టుకుంది. ఇంతలో ప్రధాని అధికార కార్యాలయం ఆమె సేవలను కోరుకుంది. చంద్రకళను డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్కు డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డెప్యుటేషన్ మీద బదిలీ చేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం శ్రమించే చంద్రకళ ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావించింది. సోషల్ మీడియాలో చురుకు చంద్రకళకు ఇష్టమైన ఆట బ్యాడ్మింటన్. పుస్తకాలు చదవడం, చారిత్రక ప్రదేశాలు చూడడం, వంట చేయడం, యోగసాధన ఆమె హాబీలు. ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉండే చంద్రకళకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాగే కొద్దిపాటి విమర్శలు కూడా. సోషల్ మీడియాను పరిపాలన సౌలభ్యం కోసం కంటే ప్రచారానికే ఎక్కువగా వినియోగిస్తోందనే అపవాదు వచ్చి పడింది. ఆమెలో ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం రెండూ ఎక్కువే. ఆ లక్షణాలనే ఒక్కమాటలో ‘ఆమె అహంకారి’ అనేసే వాళ్లూ ఉన్నారు. వృత్తిపరమైన విధుల నిర్వహణలో రాజీ పడనంత వరకు ఎవరికీ తలొగ్గాల్సిన పనిలేదనేది ఆమె ఫిలాసఫీ. మూడేళ్ల కిందట బులంద్ శహర్ జిల్లాలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది చంద్రకళ. మహమూద్‌పూర్‌లో కొత్తగా వేసిన రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం నాసిరకంగా ఉంది. కొన్ని టైల్స్ పగిలిపోయి ఉన్నాయి, కొన్నయితే ఆనవాలుకు కూడా లేవు. ఆ రోడ్లను చూసి ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మీకిది అవమానంగా లేదా? ఇది ప్రజల డబ్బు. ఈ నష్టాన్ని మీ జీతాల నుంచి కట్టిస్తారా. మీరు రాత్రి వేసిన రోడ్లు ఉదయానికి పగిలిపోతాయా’ అంటూ మున్సిపల్ అధికార్లను, కాంట్రాక్టర్‌ను గట్టిగా మందలించింది. ఆ వీడియో వైరల్ అయింది. పై ఫొటో ఆ వీడియోలోదే.ఆమె ఆగ్రహం అధికారులకు, రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు కష్టంగా అనిపించింది. సామాన్య ప్రజలు మాత్రం... ఇలాంటి అధికారులుంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. అప్పుడప్పుడూ అయినా ఇలాంటి వాళ్లు వస్తుంటే గ్రామాలు, పట్టణాలు బాగుపడతాయనుకున్నారు. రోడ్ల తనిఖీ తర్వాత ఆమె ఆరోజు సికందరాబాద్లో 36 గంటల పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏడు బృందాలు, ఒక్కో బృందంలో అరవై మంది పాల్గొన్న పరిశుభ్రత ప్రోగ్రామ్‌లో 36 గంటల్లో జిల్లాలోని ప్రధాన కూడళ్లన్నీ శుభ్రమయ్యాయి. – మంజీర -
కలెక్టరమ్మ.. తప్పును నిలబెట్టి నిలదీసింది!!
-
సమోసాలు తిని 27 మందికి అస్వస్థత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ దుకాణంలో సమోసాలు కొనుక్కుని తిన్న దాదాపు 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన భత్కారీ గ్రామంలో జరిగింది. వీరందరినీ వెంటనే గత రాత్రే దేబాయ్ పట్టణంలో ఉన్న ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీళ్లంతా సమోసాలు తిన్నందువల్లే వీరికి ఆరోగ్యం పాడైందని, అయితే ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓహ్రి తెలిపారు. ఇవి రెండు మూడు రోజుల క్రితం నాటివి అయి ఉంటాయని, అందుకే పాడైనవి తినడంతో వారు అనారోగ్యం పాలయ్యారని ఆయన చెప్పారు. దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపారు.