
ఓ పోలీసు అధికారి చావు కన్నా.. ఆవు మరణానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. అసలు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తలచుకుంటే భయంగా ఉందంటున్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా. రెండు వారాల క్రితం బులందషహర్ మూక దాడిలో.. జనాలు ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ‘దేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి పూర్తిగా రక్షణ లభిస్తోంది. ఇప్పటికి అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారి చావు కంటే కూడా ఆవు మరణం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.. దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారకరం’ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చాలా భయంగా ఉంది.. ఇలాంటి సమాజంలో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment