Naseeruddin Shah
-
పవన్ కళ్యాణ్ 06 లో ఛాన్స్ ఎలా వచ్చిదంటే..
-
నా భర్తకు ఎంతోమందితో ఎఫైర్లు.. నేనే లాస్ట్: నటి
సినిమా ఇండస్ట్రీలో లవ్ బ్రేకప్‌లు సర్వసాధారణం. చాలామంది సెలబ్రిటీలు ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడినవారే! ఆ లిస్టులో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఉన్నాడు. అయితే అతడికి బోలెడన్ని ప్రేమకథలు ఉండవచ్చేమో కానీ చివరిగా ప్రేమించింది, ప్రేమిస్తోంది మాత్రం తననే అంటోంది నటి రత్న పాఠక్ షా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమాలో కలిసి నటించాం. అప్పుడే మేమిద్దరం కలిసుండాలని నిర్ణయించుకున్నాం. నిజంగా, మేమెంత పిచ్చివాళ్లమంటే? ఒకరి గురించి మరొకరు పెద్దగా ఏమీ ఆరా తీయలేదు. కలిసుండాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నామంతే! పెళ్లి, ఎఫైర్లు.. చరిత్రే ఉంది అతడి గతం గురించి నేనసలు పట్టించుకోలేదు.. ఎందుకంటే నేను ఆ సమయంలో అతడి మీద పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆయన చాలాకాలం క్రితమే మొదటి భార్యతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పెళ్లి ఒక్కటే కాదు, అతడికి గతంలో చాలా ఎఫైర్లు ఉన్నాయి. అదంతా ఒక చరిత్రలా అనిపిస్తుంది. ఆయన చివరగా ప్రేమించింది నన్నే.. ఆయన జీవితంలోకి ప్రవేశించాక నేను మాత్రమే ఉన్నాను.. అది చాలనిపించింది. పెళ్లి చేసుకున్నాం. తర్వాత హనీమూన్‌కు కూడా వెళ్లాం. హనీమూన్‌కు వెళ్లొచ్చాక నసీరుద్దీన్ షా.. జానే బీ దో యారో సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. పెళ్లికి ఒప్పుకోని పేరెంట్స్ అప్పుడు రెండుమూడు రోజుల తర్వాత కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. తను బతికున్నాడా? లేదా? ఎవరితోనైనా పారిపోయాడా?(నవ్వుతూ) అనేది కూడా తెలిసేది కాదు' అని చెప్పుకొచ్చింది రత్నపాఠక్ షా. కాగా నసీరుద్దీన్‌షా, రత్నపాఠక్ షా 1982లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మొదట రత్న పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటికే అతడు ఒకసారి పెళ్లి చేసుకుని భార్యను వదిలేయడంతో పాటు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దీంతో అతడిని అల్లుడిగా అంగీకరించడానికి రత్న కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయితే వారు ప్రేమ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో చివరకు వారి సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నారు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి సీరియల్ నటి.. అత్యధిక పారితోషికం ఆమెకే.. -
నా అవార్డులను వాష్‌రూమ్ డోర్ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు
బాలీవుడ్ స్టార్ నసీరుద్దీన్ షా సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇచ్చిన అవార్డులను బాత్రూమ్ డోర్లకు హ్యాండిల్స్‌గా వాడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఒక పాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్పనటుడు అవుతాడు. అంతేకానీ ఇండస్ట్రీలో ఉన్న బోలెడంతమంది నటుల్లో ఒకరిని సెలక్ట్ చేసుకుని ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడు ఇతడే అని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి అవార్డులను చూసి నేను పొంగిపోను. ఆ అవార్డులతో అదే పని చేస్తా అంతెందుకు ఇటీవల నాకు ప్రకటించిన రెండు పురస్కారాలను అందుకోవడానికి కూడా నేను వెళ్లలేదు. కాబట్టి నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను ఫామ్‌హౌస్ కడితే అక్కడ వాష్‌రూమ్ హ్యాండిల్స్‌గా అవార్డులను పెట్టాలనుకున్నాను. అప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్లే అందరూ హ్యాండిల్ పట్టుకుంటారు. అంటే వారికి అవార్డు వచ్చినట్లే కదా! అందుకే అదే పని చేశాను. ఫిలింఫేర్ అనీ, అదనీ, ఇదనీ.. ఇచ్చే అవార్డుల్లో నాకేమీ గొప్ప కనిపించడం లేదు. కెరీర్ ప్రారంభంలో అవార్డు వస్తే సంతోషంగా ఫీలయ్యాను. ఆ తర్వాత వరుసగా ట్రోఫీలు రావడం మొదలయ్యాయి. వెధవలా మిగిలిపోతానేమోనని నాన్న కంగారు రానురానూ ఇవన్నీ లాబీయింగ్ వల్ల వచ్చినవే అని అర్థమైంది. దీంతో వాటిని పట్టించుకోవడం మానేశా. కానీ పద్మశ్రీ, పద్మ భూషణ్ అందుకున్నప్పుడు మాత్రం మా నాన్న అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ పనికి మాలిన పని చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక వెధవలా మిగిలిపోతావు అనేవాడు. ఆరోజు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి పురస్కారం అందుకుంటున్న సమయంలో మా నాన్న ఇదంతా చూసి సంతోషిస్తాడని కృతజ్ఞతగా పైకి చూశాను. ఈ రెండు పురస్కారాలు అందుకున్నందుకు నేను గర్విస్తున్నాను. కానీ పోటీపడి ప్రకటించే అవార్డులకు మాత్రం నేను వ్యతిరేకిని' అని చెప్పుకొచ్చాడు నసీరుద్దీన్ షా. చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్ -
సౌత్ సినిమాలు లాజిక్ లెస్.. బాలీవుడ్ నటుడు విమర్శలు
బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లో సీన్స్ ఊహకందని విధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కొన్ని సీన్స్ సంబంధం లేకుండా ఉంటాయన్నారు. అలాగే పాటలు కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయని విమర్శించారు. సౌత్ సినిమాల్లో అసలు లాజిక్ కొంచెం కూడా ఉండదన్నారు. సినిమాలు హిట్ అయినా కూడా స్క్రిప్ట్ తెరకెక్కించడంలో తప్పులు చేస్తారని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకూ హాజరైన నసీరుద్దీన్ సౌత్ చిత్రాలపై విమర్శలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలకు ఇది కొత్తేమీ కాదని నసీరుద్దీన్ అంటున్నారు. నసీరుద్దీన్ షా మాట్లాడుతూ..' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు హిట్ అయినా.. వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఊహకి అందని విధంగా ఉంటాయి. వాటిలో పిచ్చి పిచ్చి పాటలు ఒకటి. హిట్ సినిమాలు అయినా కనీసం లాజిక్ పాటించరు. చిత్రీకరణలో చాలా లోపాలు ఉంటాయని' ఘాటుగా విమర్శించారు. ఇది చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు హిందీ చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలకు ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకుంటున్నాయని నసీరుద్దీన్ చెప్పారు. దక్షిణాది చిత్రాలను చాలా కష్టపడి తీస్తారని.. హిందీ సినిమాల కంటే హిట్ అవుతాయనడంలో సందేహం లేదన్నారు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి, అయితే 'కేజీఎఫ్', 'పుష్ప: ది రైజ్', కాంతార, 'ఆర్ఆర్ఆర్' వంటి సౌత్ చిత్రాలు హిందీ చిత్రాల బాక్సాఫీస్‌ను దాటేశాయి. కాగా.. నసీరుద్దీన్ షా.. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'కుట్టే'లో టబు, అర్జున్ కపూర్, రాధిక మదన్, కొంకణా సెన్శర్మ, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అతను తదుపరి 'తాజ్-డివైడెడ్ బై బ్లడ్' పేరుతో రాబోయే హిస్టారికల్ డ్రామా సిరీస్‌లో అక్బర్ చక్రవర్తిగా కనిపించనున్నారు. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్‌బనేగా శిఖర్వతి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. -
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా
సాక్షి, ముంబై: వరుస సంఘటనలు బాలీవుడ్ వర్గాలను కలవర పరుస్తున్నాయి. ప్రముఖ నటి మందిరా బేడీ భర్త హఠాన్మరణం బాలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, మరో ప్రముఖ యాక్టర్ నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం మరింత ఆందోళనకు గురి చేసింది. జూన్ 11న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దాదాపు రెండు వారాల తరువాత, దిలీప్ కుమార్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దిలీప్ కుమార్ (98)కు మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను ఆసుపత్రికి తరలించామన్నారు. దిలీప్ కుమార్ ఆరోగ్యంపైఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (70) కూడా బుధవారం ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియాతో బాధపడుతున్న షా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు షా బాగానే స్పందిస్తున్నారని షా మేనేజర్ ధృవీకరించారు. అటు నసీరుద్దీన్ షా భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను జూన్ 29వ తేదీన హాస్పిటల్లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు.త్వరలో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామని నసీరుద్దీన్ షా భార్య, నటి రత్నా పథక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆసుప్రతిలో చేర్పించాల్సి వచ్చిందన్నారు. కాగా మందిరా బేడీభర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత Gold Price: గుడ్‌న్యూస్,ఈ ఒక్క నెలలోనే ఎంత తగ్గిందో తెలుసా? -
డిఫికల్ట్ స్టూడెంట్
1972–74 కాలం. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు నటుడు గిరిష్ కర్నాడ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. నసీరుద్దీన్ షా స్టూడెంట్. అక్కడ డైరెక్షన్ కోర్సు మూడేళ్లు. యాక్టింగ్ రెండేళ్లు. డైరెక్షన్ కోర్సులో ఉన్నవారు తమ అసైన్మెంట్ల కోసం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో ఉన్న స్టూడెంట్లను కాకుండా బయటి నటులను తీసుకురావడం గురించి అభ్యంతరం చెప్తూ నసీరుద్దీన్ షా స్ట్రయిక్‌కు పిలుపు ఇచ్చాడు. ఇది పెద్ద గొడవ అయ్యింది. డైరెక్షన్ కోర్సులో ఉన్నవారు ‘మా ఊహలకు ఈ స్టూడెంట్స్ సరిపోరు’ అని ఎదురు తిరిగారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది గిరిష్ కర్నాడ్ పరిస్థితి. నసీరుద్దీన్ షా లాంటి మొండి విద్యార్థి నాయకుణ్ణి ఇన్స్టిట్యూట్ నుంచి వదిలించుకోమని వాళ్లూ వీళ్లూ చెప్పి చూశారు. ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు పంపితే అడ్డుకునేవారు కూడా లేరు. కాని గిరిష్ కర్నాడ్ అలా చేయలేదు. ‘నసీరుద్దీన్‌షా మొండివాడైతే ఏమిటి. చాలా ప్రతిభ కలవాడు. అతన్ని డిస్మిస్ చేయను’ అన్నాడు. అన్నమాట ప్రకారమే ఏదో ఒక సర్దుబాటు చేసి అందరినీ శాంత పరిచాడు. నిజానికి తన ముందు తల ఎగరేసినవాణ్ణి క్షమించకూడదు. కాని ఏ మంచి గురువు అలా ఎప్పటికీ చేయలేడు. దర్శకుడు శామ్ బెనగళ్ సినిమా తీయడానికి గిరిష్ కర్నాడ్ దగ్గరకు వచ్చి ‘మంచి స్టూడెంట్ ఉంటే చెప్పు తీసుకుంటాను’ అనంటే ‘మా నసీర్ని తీసుకో’ అని పంపించాడు. శ్యామ్ బెనగళ్ నసీరుద్దీన్‌ని తీసుకున్నాడు. ఆ సినిమాయే ‘నిషాంత్’. ఆ తర్వాత నసీరుద్దీన్ ఎన్నో సినిమాలలో నటించాడు. జునూన్, స్పర్శ్, ఆక్రోశ్, మాసూమ్, మిర్చ్ మసాలా... భారతీయ సినిమా నటనలోఅతిశయోక్తిని తీసేసిన నటుడుగా నిలిచాడు. ‘వెయిటింగ్’ ఇటీవలి ఆయన మంచి సినిమా. రేపు ఆయన 70వ పుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే. -
నేను బాగానే ఉన్నాను
బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని నసీరుద్దీన్ షా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘‘నాన్నగారికి ఏం కాలేదు. ఆయన బాగానే ఉన్నారు’’ అని ట్వీటర్ ద్వారా స్పందించారు ఆయన కుమారుడు వివాన్ షా. ‘నా ఆరోగ్య సమాచారం గురించి ఆందోళన చెందుతూ, నన్ను సంప్రదిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. పుకార్లను నమ్మొద్దు’’ అని ఫేస్ బుక్ లో స్పష్టం చేశారు నసీరుద్దీన్ షా. -
మహిళలను కొట్టిన నటుడి కూతురు
ముంబై : ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కుమార్తె హీబా షా.. మహిళా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ నెల 16న హీబా షా తన స్నేహితురాలికి చెందిన రెండు పిల్లులను స్టెరిలైజేషన్(శస్త్ర చికిత్స) కోసం ముంబైలోని వెటర్నరీ క్లినిక్‌కు వెళ్లారు. అక్కడ పనిచేసే మహిళా సిబ్బంది ఆమెను వేచి ఉండమని చెప్పగా.. అసహనానికి గురైన హీబా ఇద్దరు మహిళలను కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతోఆమె అడ్డంగా దొరికి పోయారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై షీబాకు వ్యతిరేకంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. Mumbai's Versova police have registered a non-cognizable offence against actress Heeba Shah (daughter of actor Naseeruddin Shah) for allegedly assaulting 2 employees of a veterinary clinic on January 16. pic.twitter.com/M2u4rdgGTL — ANI (@ANI) January 25, 2020 ఆస్పత్రి చైర్మన్ మాట్లాడుతూ.. ‘నటి హీబా షా స్టెరిలైజేషన్ కోసం రెండు పిల్లులతో తమ వెటర్నరీ క్లినిక్‌కు వచ్చారు. పిల్లులకు స్టెరిలైజేషన్ జరిగిందని, తమ సిబ్బంది ఆమెను అయిదు నిమిషాలు వేచి ఉండమని కోరారు. రెండు మూడు నిమిషాలు వేచి ఉండి.. అంతలోనే ఆమె మా సిబ్బందిపై దూకుడుగా ప్రవర్తించారు. నేను ఎవరో మీకు తెలియదా? ఎవరో తెలియకుండానే మీరు నన్ను ఇంతసేపు బయట వేచి ఉంచుతారా అంటూ ఆసుపత్రి మహిళా సిబ్బందిపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన హీబా.. ఆసుపత్రి ఉద్యోగులను కొట్టినట్లు అంగీకరించారు. అయితే ముందుగా ఆసుపత్రి సిబ్బందే తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. క్లినిక్‌కు వెళ్లినప్పుడు తన వద్ద అపాయింట్మెంట్ ఉందని చెప్పినా కూడా వాచ్మెన్ లోపలికి అనుమతించలేదని, అనేక ప్రశ్నలు అడిగాడని తెలిపారు. లోపలికి వచ్చాక సిబ్బంది కూడా తనతో అసభ్యంగా మాట్లాడారని.. అక్కడున్న మరో మహిళ తనను ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోవాలని నెట్టేసిందని పేర్కొన్నారు. క్లినిక్‌కు వచ్చిన వారితో ప్రవర్తించే విధానం ఇది కాదని, మర్యాదగా మాట్లాడాలని హీబా షా సూచించారు. -
ఇంతకన్నా ఏం కావాలి?
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు నసీరుద్దీన్ షాపై సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నసీరుద్దీన్‌కు దేశం ఎంతో పేరుప్రతిష్టలు ఇచ్చినా దేశం పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మాట్లాడిన సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుమప్ ఖేర్‌ను నసీరుద్దీన్ విమర్శించిన నేపథ్యంలో స్వరాజ్ కౌశల్ ట్విటర్లో స్పందించారు. ‘మిస్టర్ నసీరుద్దీన్ షా మీరు కృతజ్ఞత లేని వ్యక్తి. ఈ దేశం మీకు పేరు, ప్రతిష్టలతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నారు. మీ మతం కాని మహిళను మీరు పెళ్లి చేసుకున్నా ఎవరూ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీ సోదరుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. సమాన అవకాశాలకు ఇంతకన్నా ఏం కావాలి. అయినప్పటీకి మీకు సంతృప్తి లేదు. పక్షపాతం, వివక్షపూరితంగా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. స్వదేశంలో నిరాశ్రయులుగా మారి పడ్డ కష్టాల గురించి అనుపమ్ మాట్లాడారు. దేశం ఎన్ని ఇచ్చినా మీరు మాత్రం దేశానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు. హుందా కలిగిన వ్యక్తిగా అనుపమ్ స్పందించారు. మీ మాటలను బట్టి చూస్తే మీరు అల్పంగా కనిపిస్తున్నారు. నిరాశ నుంచి మీ కోపం వ్యక్తమవుతున్నట్టు కనబడుతోంద’ని స్వరాజ్ కౌశల్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా, ఏబీవీపీ దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థులను పరామర్శించిన హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రశంసించిన నసీరుద్దీన్ బుధవారం అనుపమ్ ఖేర్‌పై విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ సర్కారుకు బాకా ఊదుతున్నారని, ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆమె ధైర్యాన్ని ప్రశంసించిన నటుడు) -
ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం ఎవరంటే..
ముంబై: సీనియర్ నటుడు, దర్శకుడు నసీరుద్దీన్ షా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను ప్రశంసించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్ధీన్ పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఢిల్లీ విద్యార్థుల నిరసనలు గురించి విపులంగా చర్చించారు. అలాగే దీపికా జేఎన్‌యూను సందర్శించడాన్ని ఆయన అభినందించారు. ఇటీవల ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడి అనంతరం దీపిక అక్కడికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించిన విషయం తెలిసిందే. అదోక సాహోసోపేత చర్యగా నసీర్ అభివర్ణించారు. అదే విధంగా జేఎన్‌యూ సందర్శన తర్వాత దీపిక ఆదరణ తగ్గదని పేర్కొన్నారు. (దీపికపై కంగనా ఘాటు వ్యాఖ్యలు) అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వలన ఒక సెలబ్రిటీ భవిష్యత్తుకు హాని కలిగించదా అని ప్రశ్నించగా.. ‘నటుడు కేవలం తన గురించే ఆలోచిస్తాడు. అయితే దీపిక జేఎన్‌యూని సందర్శించింనందుకు ఆమె ధైర్యాన్ని ప్రశంసించాలి. ఆమె ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో ఉంది. ఈ చర్య వల్ల తనకు నష్టం జరుగుతుందని తెలిసినా ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసింది. దీపికకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు త్వరలోనే ఇవన్నీ మరిచిపోతారు. ఆమె దీనిని ఎలా స్వీకరిస్తుందో, ఈ నిర్ణయం ఆమె పాపులారిటీని తగ్గిస్తుందా.. ఇలాంటి విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే ఏకైక దైవం డబ్బు మాత్రమే’ అని నసీరుద్దీన్ తెలిపారు. కాగా నవంబరులో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును సవాలు చేస్తూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని కొంతమంది న్యాయవాదులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన 100 మంది ముస్లింలలో నసీరుద్దీన్ ఒకరు. వివాదాన్ని ఇలాగే కొనసాగించడం ద్వారా సమాజానికి హాని కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. చదవండి :నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్! ఛపాక్ ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్! -
‘అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచొద్దు’
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయమై పునర్ ఆలోచించాలని బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షాతో పాటు దేశంలోని వందకు పైగా ముస్లిం ప్రముఖులు కోరారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచితే ముస్లిం కమ్యూనిటీకి హాని కలుగుతుందని అభిప్రాయపడుతూ మంగళవారం వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు విషయమై మరోసారి ఆలోచించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇందులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాయర్లు, పత్రికా విలేకరులు, సామాజిక కార్యకర్తలు, నటులు, వ్యాపారవేత్తలు, సంగీతకారులతో పాటు విద్యార్థులు ఉన్నారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా భారత ముస్లిం సామాజిక వర్గానికి హాని కలుగుతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో సినీ రచయిత అంజుమ్ రాజ్బలి, జర్నలిస్ట్ జావేద్ ఆనంద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించిన సంగతి విధితమే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) నవంబర్ 17న ప్రకటించింది. -
‘వారి మీద బాంబులేయ్యాలి’
లక్నో : మనిషి ప్రాణం కంటే ఆవు చావుకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నేలకొన్న పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ నటుడు నసీరుద్దిన్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సురక్షితం కాదనే వారి మీద బాంబులు వెయ్యాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ జిల్లా ఖతౌళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొంత మంది దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం వారికి సురక్షితం కాదని భావిస్తున్నారు. నాకే గనక ఓ మంత్రి పదవి ఉంటే ఇలాంటి వారందరి మీద బాంబులు వేసేవాడిని. ఒక్కరిని కూడా వదలే వాడిని కాదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ తెలిపారు. విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. -
‘ముందు మీ ఇంటిని చూసుకోండి’
న్యూఢిల్లీ : భారతదేశంలోని మైనారిటీలను ఉద్దేశిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఇమ్రాన్ వ్యాఖ్యాల పట్ల క్రికెటర్ మహ్మద్ కైఫ్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా మాత్రం ఇమ్రాన్ వ్యాఖ్యల పట్ల కాస్త భిన్నంగా స్పందించారు. తన ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పేర్కొన్నారు. నసీరుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇమ్రాన్ వ్యాఖ్యల గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడిన నన్నో పాకిస్తాన్ ఏజెంట్లా చూస్తారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే.. అప్పుడు నేను మాట మార్చానంటారు’ అని తెలిపారు. తన దేశ ప్రజల మెప్పు పొందడం కోసం ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు ఇవి అన్నారు. ఒక వేళ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు అని అడగ్గా.. ‘అవును అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను. మా దేశంలో జరిగే విషయాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు మీ ఇంటి గురించి పట్టించుకోండి అని చెప్తాన’న్నారు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుందన్నారు. అంతటితో ఊరుకోక మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
రాజకీయమా, అసహనమా !?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ఓ పోలీసు అధికారి చావుకన్నా ఆవు చావు చాలా ప్రాముఖ్యమైనది’ అని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా డిసెంబర్ 17వ తేదీన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై ఇప్పుడు రాద్దాంతం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆవును చంపారన్న ఆరోపణలపై బజరంగ్ దళ్ కార్యకర్తలు సృష్టించిన హింసాండలో ఓ పోలీసు అధికారి చనిపోయిన ఉదంతం గురించి నసీరుద్దీన్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారిని కాల్చి చంపిన బజరంగ్ దళ్ నాయకుడు యోగేశ్ రాజ్‌ను ఇంతవరకు అరెస్ట్ చేయలేక పోయిన బులంద్‌షహర్ పోలీసులు ఆవును చంపిన కేసులో నలుగురు ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆ నలుగురు ముస్లింలు ఆవును చంపారనడానికి ఎలాంటి ఆధారాలు పోలీసులు సేకరించలేక పోయారు. ఈ నేపథ్యంలో మతోన్మాద పరిస్థితుల గురించి, నేరం చేసిన తప్పించుకుంటున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ నసీరుద్దీన్ ఓ మనిషి చావుకన్నా చావు ముఖ్యంగా మారిందని విమర్శించారు. ఆవును చంపారన్న ఆరోపణలపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, పోలీసు అధికారి చావును మాత్రం అదొక ‘యాక్సిడెంట్’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో తప్పుకనిపించని మూకలకు ఇప్పుడు నసీరుద్దీన్ మాటల్లో తప్పు కనిపిస్తోంది. నసీరుద్దీన్‌ను పాకిస్థాన్ ఏజెంట్ అంటూ యూపీ బీజేపీ చీఫ్ మహేంద్ర నాథ్ పాండే విమర్శించగా, దేశద్రోహి అంటూ బీజేపీ మిత్రుడు రాందేవ్ బాబా ఆరోపించారు. మతోన్మాద రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా వారిని పాకిస్తాన్ ఏజెంట్ అనడమో, పాకిస్తాన్ టెర్రరిస్టుతో పోల్చడమో మతోన్మాద నాయకులకు కొత్తకాదు. ఇంతకుముందు ఇదే యోగి ఆదిత్యనాథ్, దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ హఫీద్ సయీద్‌తో పోల్చారు. దేశంలో అసహన పరిస్థితులు పెరుగుతున్నాయన్నందుకు మరో నటుడు ఆమిర్ ఖాన్‌ను కూడా మతోన్మాద మూకలు విమర్శించాయి. పర్యావసానంగా ఆమిర్ ఖాన్ కొన్ని కోట్ల రూపాయల యాడ్ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నసీరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు మొన్న శుక్రవారం నాడు ‘అజ్మీర్ సాహిత్య వేడుకల్లో’ నిర్వాహకులు ఆయన పాల్గొనాల్సిన సెషన్‌ను రద్దు చేశారు. ఎంత రాజకీయమైనా ఇంత అసహనం పనికి రాదు! -
‘అసహన’ ఆరోపణలపై రాజ్‌నాథ్ కౌంటర్
లక్నో : దేశంలో అసహనం పెరిగిపోతుందన్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిప్పికొట్టారు. భారత్‌లో ఉన్న సహనశీలత ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని చెప్పుకొచ్చారు. భారత్‌లోనే సహనం ఉందని..ప్రపంచంలో మరే చోట ఇది ఉందని తాను అనుకోవడం లే’దని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ 114వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఇక్కడికి వచ్చిన రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా కలిసి జీవించే వాతావరణం కేవలం భారత్‌లోనే ఉందని, భారత్‌ను సాధికార దేశంగా, స్వయం సమృద్ధి సాధించే దిశగా వారు పాటుపడుతున్నారని, ఈ పరంపర కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల ఆరంభంలో యూపీలోని బులంద్‌షహర్‌లో పోలీస్ అధికారి మృతి నేపథ్యంలో నటుడు నసీరుద్దన్ షా వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. హింసాకాండలో మరణించిన పోలీసు కంటే చనిపోయిన ఆవుకే అధిక ప్రాధాన్యత లభించిందని నసీరుద్దీన్ షా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా.. ఏం కాదు’
ఓ పోలీసు అధికారి చావు కన్నా.. ఆవు మరణానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. అసలు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తలచుకుంటే భయంగా ఉందంటున్నారు బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దిన్ షా. రెండు వారాల క్రితం బులందషహర్ మూక దాడిలో.. జనాలు ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. ‘దేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి పూర్తిగా రక్షణ లభిస్తోంది. ఇప్పటికి అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారి చావు కంటే కూడా ఆవు మరణం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.. దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారకరం’ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చాలా భయంగా ఉంది.. ఇలాంటి సమాజంలో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉందని తెలిపారు. -
ఓ చెత్త ఆటగాడిలా కోహ్లి ప్రవర్తన!
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు అత్యంత చెత్త ప్రవర్తన గల ఆటగాడని బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర విమర్శలు చేశాడు. దూకుడు, చెడు ప్రవర్తన కారణంగా క్రికెట్లో అతడు సాధించిన నైపుణ్యం, ప్రతిభలను కోల్పోతున్నాడని నసీరుద్దీన్ తన అధికారిక ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. తనేం దేశం విడిచిపోవడం లేదని కూడా పేర్కొన్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇరుజట్ల కెప్టెన్లు మాటల యుద్దానికి దిగిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో ప్రాంరంభమైన ఈ వార్.. నాలుగో రోజు ఆటలోను కొనసాగింది. ఎంతలా అంటే వీరి మాటల యుద్ధం ఆపేందుకు... చివరకు అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బుమ్రా బౌలింగ్‌లో మిడ్‌వికెట్ దిశగా ఆడిన పైన్ సింగిల్ పూర్తి చేసుకోబోతున్న సమయంలో లాంగాఫ్‌లో ఉన్న కోహ్లి క్రీజ్ వైపు నడిచాడు. వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు. దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తలేవు’ అంటూ పైన్ బదులిచ్చాడు! దాంతో అంపైర్ క్రిస్ గాఫ్నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్ వ్యాఖ్యానించాడు. ఈ మాటల యుద్దం నేపథ్యంలోనే నసీరుద్దీన్ షా కోహ్లిని తప్పుబట్టాడు. -
సినిమా... ఓ కొలమానం అవ్వాలి
‘‘సినిమా అనేది ఆ కాలమానంలో మనుషులు ఎలా ఉండేవారో, ఎలా జీవించారో భవిష్యత్తులో చెప్పడానికి ఓ రికార్డ్‌లా ఉండాలి’’ అన్నారు నటుడు నసీరుద్దిన్ షా. ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఒకవేళ ఓ వందేళ్ల తర్వాత 2018లో సినిమా చూస్తే అప్పటి పరిస్థితులు, స్థితిగతులు ఆ సినిమా కళ్లకు కట్టాలి. సినిమా అంటే కేవలం వినోదంగానే మిగిలిపోకూడదు. సినిమా సమాజాన్ని మార్చదు, ఎటువంటి మార్పూ తీసుకు రాలేదనీ నాకు తెలుసు. సినిమాను ఎడ్యుకేషన్ మీడియంగానూ చూడలేను. ఎందుకంటే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం. మళ్లీ మర్చిపోతాం. అయితే పూర్వకాలపు పరిస్థితులు భవిష్యత్తులో తెలుసుకోవాలంటే అందుకు తగ్గట్టుగా అప్పటి స్థితిగతులను సినిమాల్లో క్యాప్చర్ చేయాలి. 2018లో ఇండియన్స్ ఇలా ఉండేవారా? అని చూపించుకునేలా ఉండాలి. సినిమా ఓ కొలమానంలా ఉండాలి. కేవలం సల్మాన్‌ఖాన్ సినిమాలతో మిగిలిపోకూడదు. అలా చూసుకోవడం నటీనటుల బాధ్యత’’ అని అన్నారు. -
భ్రాంతి కాదు నిజం అయారి
‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ (దేశాన్నే అమ్మేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది?) అంటూ దేశమంతా అలుముకున్న అవినీతి మీద ఆలోచనను రేకెత్తించేదే ‘అయారి’ సినిమా! ‘ఎ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ చబ్బీస్’, ‘బేబీ’ తీరులో ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తించలేకపోయినా.. దర్శకుడు నీరజ్ పాండే మార్క్నైతే చూపిస్తుంది. అయారి.. అంటే భ్రాంతి.. తాంత్రికత.. మాంత్రికత! అన్నీ బాగున్నట్టు అనిపించే, ఫీల్ గుడ్ ఫీల్ భ్రాంతిని కలిగించే పరిస్థితుల వెనక ఉన్న అసలు కథను చూపించే సినిమా. ఇది కేవలం కల్పితం. ఎవరినీ, దేనినీ ఉద్దేశించి కాదు అంటూ ప్రారంభంలో డిస్క్లేమర్ వేసినా.. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతిని సెల్యూలాయిడ్ మీద చూపించిన చిత్రం ఇది. అందుకే పైన చెప్పిన మాట అంటాడు ఆర్మీ చీఫ్ ‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ అని! ఆహారధాన్యాల దగ్గర నుంచి ఆయుధాల దాకా అన్ని శాఖల్లో అంతటా అవినీతే. ఎక్కడికక్కడ దేశాన్ని అమ్ముకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? మనకన్నా ముందు తరం.. తర్వాత తరాలకు ఏం స్ఫూర్తిని పంచుతారు? సంపాదన ఆశలో పడి ఈ తరం ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటూ తరాల ఆలోచనల అంతరాలనూ ప్రశ్నిస్తుంది? చర్చకు చోటిస్తుంది. దేశ భక్తి అనే పెద్ద మాటలు వద్దు కాని.. ఆరోగ్యకరమైన వాతావరణమైతే దేశంలో ఉండాలికదా! మన దేశంలో మనం భద్రంగా ఉన్నామనే భావనైతే కలగాలి కదా! దేశానికి కంచెలా ఉన్న రక్షణ శాఖ ఆ నమ్మకాన్నివ్వాలి కదా! అదే అమ్మకానికి తయారైపోతే? విశ్వాసాన్ని కోల్పోతాడు ఓ యంగ్ సోల్జర్, మేజర్ జయ్ బక్షి (సిద్ధార్థ్ మల్హోత్రా). రక్షణ శాఖలోని పెద్ద తలకాయలైతే ఆయుధాలు అమ్మే డీలర్స్‌తో డీల్ కుదుర్చుకొని నిజాయితీగా పనిచేస్తున్న టీమ్‌ను పణంగా పెట్టాలనుకున్నప్పుడే మొత్తం మిలటరీ వ్యవస్థ మీదే గౌరవాన్ని తుడిచేసుకుంటాడు. ఆ డీల్‌లో తానూ వాటా పంచుకోవాలనుకుంటాడు. డ్యూటీని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కల్నల్ అభయ్ సింగ్ (మనోజ్ బాజ్‌పాయ్)ను స్ఫూర్తిగా తీసుకుని.. విధి నిర్వహణలో అతనంతటివాడిని కావాలని కలలు కని ఆర్మీలోకి వస్తాడు. కల్నల్ అభయ్‌సింగ్ నేతృత్వంలోని కోవర్ట్ ఆపరేషన్స్ (స్పెషల్)లో సభ్యుడిగా ఉంటుంటాడు జయ్ భక్షి. ఒకరకంగా కల్నల్‌కు ఏకలవ్య శిష్యుడు జయ్. ఆపరేషన్స్ నిర్వహణలో ఆలోచన దగ్గర్నుంచి, వ్యూహప్రతివ్యూహాలు, ఆచరణ అన్నీ తన గురువులాగే చేస్తుంటాడు. ట్యాపింగ్.. రేటింగ్ ఈ స్పెషల్ టీమ్ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఓ మిలిటరీ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు ఓ డీల్ తీసుకుని రావడం గురించి. ఓ ఆర్మ్స్ డీలర్ తరపున ఓ ఆఫర్ తీసుకొని వస్తాడు ఆ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు. ఆ డీల్‌ను మన్నించి వాళ్ల దగ్గర ఆయుధాలు కొంటే అమరవీరుల వితంతువులకు సంక్షేమ ఫండ్‌నూ ఇస్తారనే తాయిలాన్నీ చూపిస్తాడు. ఆ ఆఫర్‌కు తల వంచని చీఫ్ ‘‘చివరకు దేశాన్నీ అమ్మేస్తున్నామన్న మాట’’ అంటూ చురకా అంటిస్తాడు. ‘‘అనధికారికంగా.. 20 కోట్ల ఫండ్‌తో మీరు నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్ కోవర్ట్ ఆపరేషన్స్ మాటేంటి?’’ అని అప్పటిదాకా రహస్యంగా ఉన్న విషయాన్ని బయటపెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు తలపడ్తాడు ఆ ఆఫీసర్. ఆ స్పెషల్ టీమ్ ఓ కాజ్ కోసం.. ఎవరికీ తెలియకుండా నియమించింది. అది బయటపడేసరికి ఖంగు తింటాడు ఆర్మీ చీఫ్. వాళ్ల సంభాషణను ట్యాప్ చేస్తున్న జయ్ కూడా విస్మయం చెందుతాడు. అయినా తలవంచడు ఆర్మీ చీఫ్. దేశానికి రక్షణగా నిలవాల్సిన ఆ శాఖలోని అవినీతి మొత్తం మిలటరీ మీదే విశ్వాసాన్ని పోగొడ్తుంది జయ్‌కు. ఆ టీమ్‌లోంచి ఈ ఆఫీసర్ టీమ్‌లోకి మారుతాడు జయ్.. డబ్బు సంపాదించుకోవడానికి. అప్పటికే ఈ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం ఓ ఎథికల్ హ్యాకర్ సోనియా (రకుల్‌ప్రీత్ సింగ్)తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్తాడు జయ్. ఇప్పుడు ఈ ఆఫీసర్ టీమ్‌లో చేరి తన కోవర్ట్ టీమ్ రహస్యాలను చెప్పేందుకు పదికోట్లకు డీల్ కుదుర్చుకుని తన ప్రియురాలితో దేశాన్ని వదిలిపోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు కూడా. ఈ విషయం కల్నల్ అభయ్సింగ్కు తెలుస్తుంది. జయ్ కోసం వేట మొదలుపెడ్తాడు. ఇందులో భాగంగానే లండన్ చేరతారు ఇద్దరూ. అప్పటికే సోనియా లండన్ చేరుకుని ఉంటుంది జయ్ ప్లాన్‌లో భాగంగా. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతో అతనికి దొరక్కుండా జాగ్రత్త పడ్తుంటాడు జయ్. ఇంకా పై ఎత్తులు వేసి దగ్గరకు రప్పిస్తాడు కల్నల్. ఇందులో ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ (అదిల్ హుస్సేన్)ను పావులా వాడుకుంటాడు అభయ్. ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ కూడా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆఫీసరే. ఇండియన్ ఆర్మీలో ఉన్న లొసుగులు, విధివిధానాలన్నిటినీ ఔపోసన పట్టిన అతను ఆయుధాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తొచ్చని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వ్యాపారం మొదలుపెడ్తాడు. విదేశీ కంపెనీల ఆయుధాలకు డీలర్‌గా మారి మన దేశంలోని మిలటరీ అధికారులకు లంచాలిస్తూ అసలు ధరకన్నా నాలుగు రెట్ల ధరతో ఆయుధాలను కొనిపిస్తుంటాడు. అలా రిటైరయ్యి, మళ్లీ ఉద్యోగంలో చేరిన ఓ ఆర్మీ ఆఫీసర్‌నూ పట్టి.. ఆయన ద్వారా చీఫ్‌కు తన వర్తమానం పంపిస్తాడు అలా. ఆర్మీ చీఫ్ వద్దనేసరికి జయ్ భక్షి సహాయంతో ఆ చీఫ్ నియమించిన కోవర్ట్ ఆపరేషన్స్ గుట్టు రట్టు చేసి టీఆర్పీలో నంబర్ మూడులో ఉన్న ఓ చానల్ రిపోర్టర్‌కు ఇస్తాడు టెలికాస్ట్ చేయమని. దాంతో చానల్ రేటింగ్‌ను పెంచుకొని నంబర్‌వన్ చానల్‌గా అయిపోమ్మని. మోసం.. దగా అయితే కల్నల్ అభయ్ సింగ్ ఆ పాచిక పారనివ్వడు. జయ్‌ను పట్టుకునే క్రమంలో జయ్ ద్వారా తెలుసుకున్న, అందుకున్న సమాచారంతో ఆ చానల్ రిపోర్టర్‌ను కలుసుకొని ఇంకో రికార్డర్ ఇస్తాడు టెలికాస్ట్ చేసుకొమ్మని. ఆఫీసర్ ఇచ్చినది వేసుకోవాలో.. ఇప్పుడు తాను ఇచ్చింది వేసుకోవాలో విచక్షణ నీదే అంటాడు. అది అమరవీరుల వితంతువుల కోసం ముంబైలో కట్టిన నివాస సముదాయంలో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తాకథనం. ఆ రిపోర్టర్ అభయ్‌సింగ్ ఇచ్చిన కథనాన్నే టెలికాస్ట్ చేయిస్తుంది. ఆ ఆఫీసర్ తుపాకితో పేల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ నిర్మాణం అవినీతిలో ప్రధాన హస్తం ఆ ఆఫీసర్‌దే. ఈ మొత్తం వ్యవహారం... రక్షణ శాఖ పట్ల అభయ్‌సింగ్, జయ్ల మ«ధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి ఆ ఇద్దరినీ ఒక్కటిచేసే దిశగా సాగి సినిమాను ఎండ్ చేస్తుంది. కశ్మీర్ ఓ ప్రదేశం కాదు.. రక్షణ శాఖ, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు, డీలర్లు, దేశీ మీడియా.. ఇవన్నీ కలిసి ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి? ఆ లాబీ ముసుగులో ఎవరి ప్రయోజనాలను వాళ్లు ఎంతెంత నెరవేర్చుకుంటున్నారు? ఈ నేపథ్యంలో దేశ రక్షణ, దానిపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా పణంగా పెడ్తున్నారు? అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతుందీ సినిమా. ‘‘ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల వైపు ఎందరో మేధావులు, విద్యావేత్తలు ఉన్నారు. అయినా కశ్మీర్ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపట్లేదు?’’ అని ప్రశ్నిస్తాడు జయ్.. కల్నల్ అభయ్సింగ్ను. ‘‘కశ్మీర్ ఓ ప్రదేశంకాదు.. ఓ ఇండస్ట్రీ. దానివల్ల వ్యాపారుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరికీ లాభాలున్నాయి. ఓ సమస్య లాభాలను పంచుతున్నంత కాలం దాన్ని కాలం చెల్లనివ్వకుండా చూసుకుంటారు ’’ అంటాడు కల్నల్. ఎంత నిజం? అదే నిజం దేశంలోని అన్ని సమస్యలకు వర్తిస్తుంది. అదే చెప్తుంది.. చూపిస్తుంది ‘అయారి’ సినిమా. పాలకులు, కార్పోరేట్ శక్తులు కలిసి సమస్యలతో ప్రయోజనాలను పిండుకుంటే ప్రజలకు అంతా బాగుందనే భ్రాంతి కలగజేస్తూ జోకొడ్తుంటారు. చైతన్యం కాకపోతే అయారి (భ్రాంతే) మిగుల్తుంది. మనోజ్‌భాజ్‌పాయ్ ఈ సినిమాకు ఊపిరి. ఆదిల్ హెస్సేన్, నసీరుద్దీన్ షా, అనుపమ్ఖేర్ల నటన గురించి ప్రతేక్యంగా చెప్పేదేముంటుంది? పాత్రలను పండిస్తారు. వీళ్లకు సమ ఉజ్జీగా సిద్ధార్థ్ మల్హోత్రా శక్తియుక్తులను కూడదీసుకున్నాడు. రకుల్‌ప్రీత్.. డాన్సింగ్ డాల్‌గా మిగల్లేదు. దర్శకుడు నీరజ్‌పాండే ఇంతకుముందు తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళితే నిరాశపడ్తారు. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అయారి’ అలరిస్తుంది. – శరాది -
34 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా
సాక్షి, ముంబై : నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ భార్యాభర్తలుగా నటించిన లిబాస్ బాలీవుడ్ సినిమాను 34 ఏళ్ల తర్వాత థియేటర్లలో తొలిసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథా రచయిత, దర్శకుడు గుల్జార్‌కు, సినిమా నిర్మాత వికాస్ మోహన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ సినిమా ఇన్నేళ్లు విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమా ముగింపు తనకు నచ్చలేదని, దాన్ని మార్చాల్సిందిగా వికాస్ మోహన్ గుల్జార్‌ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. అయితే తాను సినిమాను విడుదల చేసే ప్రసక్తే లేదంటూ మొండికేసిన వికాస్ మోహన్ సినిమాను మూలన పడేశారు. వికాస్ మోహన్ 2016 సంవత్సరంలో మరణించారు. ఆయన స్థానంలో సినిమా నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆయన కుమారుడు అముల్ మోహన్ ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. జీ క్లాసిక్ సినిమాలతోపాటు లిబాస్ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తానని చెప్పారు. ఈ సినిమా పూర్తయిన నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఆర్డీ బర్మన్ పాటలకు ప్రశంసలు లభించాయి. గుల్జార్ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కార్లా రాసిన ‘సీమ’ అనే చిన్న కథ ఆధారంగా లిబాస్ సినిమాలో సీమగా షబానా ఆజ్మీ నటించగా, ఆమె భర్తగా నసీరుద్దీన్ షా నటించారు. సీమ పాత్రధారి షబానా తన బాల్య మిత్రుడు టీకే పాత్రధారి రాజ్ బబ్బర్‌తో వెళ్లిపోవడంతో ఆమె వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మనసును కట్టిపడేసే కథాకథనంలో ముగ్గురి పాత్రలు మనసుకు హత్తుకుంటాయనడంలో సందేహం లేదు. -
ఆ వివాదం ముగిసిపోయిందండి: హీరో
అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో రాజేశ్ ఖన్నా ఓ అథమస్థాయి నటుడని, అతని వల్ల బాలీవుడ్లో చెత్త సినిమాలు వచ్చాయంటూ తీవ్ర వ్యాఖ్యలతో నసీరుద్దీన్ షా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజేశ్ ఖన్నా అల్లుడు, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ స్పందించారు. ‘నేను సినీ పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నాను. వేరే నటుడిగా గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా చెప్పండి. తెలివైన వారు తమ పని ఏదో తాము చూసుకుంటారని చెప్తారు. నేను కూడా నా పనేదో నేను చూసుకుంటాను. ఇతరుల మీద వ్యాఖ్యలు చేయడానికి నేనెవరిని?’ అని ఆయన పేర్కొన్నారు. తన మామపై వ్యాఖ్యల విషయంలో నసీరుద్దీన్ షా ఉదారంగా క్షమాపణలు చెప్పారని, కాబట్టి ఈ వివాదం ముగిసిపోయినట్టేనని అక్షయ్ అన్నారు. ‘ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు మాట్లాడారు. తమ గళాన్ని వినిపిస్తారు. అయినా ఇప్పుడు వివాదం ముగిసిపోయింది. నసీరుద్దీన్ షా క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని మనందరం మరిచిపోవడమే మంచిది’ అని చెప్పారు. -
ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య
ముంబై: రాజేశ్ ఖన్నా మంచి నటుడు కాదంటూ నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగిసిందని రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని తన మద్దతుదారులకు సూచించింది. 'ఇక చాలు. ఈ వివాదం ఇక్కడితో ఆపేయండి. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ మనకు ఉంది. ఇక అందరం పోకెమాన్ ఆట ఆడుకుందాం' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. 'ఈ ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా పోకెమాన్ ఆడడానికి వెళతా'నని పేర్కొంది. రాజేశ్ ఖన్నా గొప్ప నటుడు కాదని, అతడి నటన సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండేదని ఓ ఇంటర్య్వూలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించడంతో ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ఈ లోకంలోని తన తండ్రిని విమర్శించడం తగదని ఆమె పేర్కొన్నారు. అయితే తాను కావాలని రాజేశ్ ఖన్నాను విమర్శించలేదని వివరణ ఇచ్చిన నసీరుద్దీ షా క్షమాపణ కూడాచెప్పారు. తనకు మద్దతు నిలిచిన వారికి ట్వింకిల్ ఖన్నా ధన్యవాదాలు తెలిపారు. -
సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!
అలనాటి నటుడు రాజేశ్ ఖన్నాపై బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా చేసిన విమర్శలు బాలీవుడ్లో చిన్నపాటి దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఘాటుగా స్పందించింది. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తిని గురించి విమర్శలు చేయడం' దారుణమంటూ ఆమె మండిపడింది. దీంతో ఈ వివాదంపై నసీరుద్దీన్ షా తాజాగా వివరణ ఇచ్చారు. ఎవరినీ వ్యక్తిగతంగా గాయపరిచే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినైనా తన వ్యాఖ్యల వల్ల బాధపడితే క్షమించాలని కోరారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, 70 దశకంలోని పరిస్థితి గురించి వ్యాఖ్యానించానని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో రాజేశ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. 'ఆయనో మామూలు నాసిరకం అథమ నటుడు. ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుంది. మేధోపరంగానూ ఆయన గొప్ప వ్యక్తేమీ కాదు. ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదు. అందువల్లే 70వ దశకంలో సగటు సినిమాలు వచ్చాయి' అని విమర్శించారు. -
మా నాన్నను చెత్త నటుడంటావా!
1970 దశకంలో బాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నటుల్లో రాజేశ్ ఖన్నా ఒకరు. ఆరాధన (1969), హాథీ మేరే సాథీ (1971), ఆనంద్ (1971) వంటి సినిమాలతో గొప్ప నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకున్న నటుడు ఆయన. ఖన్నా గురించి బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా తాజాగా విస్మయపరిచే విమర్శలు చేశారు. ఆయనో మామూలు నాసిరకం నటుడని, ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుందంటూ విమర్శించాడు. మేధోపరంగా ఆయన గొప్ప వ్యక్తేమీ కాదని, ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదని, ఆయన వల్ల 70వ దశకంలో సగటు సినిమాలే వచ్చాయంటూ షా చెప్పుకొచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో తన గళాన్ని గట్టిగా వినిపించే రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.. ఈ విషయంలో ఘాటుగా స్పందించింది. షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ట్వింకిల్.. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తి గురించి విమర్శలు చేయడం నిజమైన సంకుచితత్వం’ అని బదులిచ్చింది.