సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు! | Naseeruddin apologised for calling Rajesh Khanna a poor actor | Sakshi
Sakshi News home page

సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!

Published Mon, Jul 25 2016 10:47 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!

సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!

అలనాటి నటుడు రాజేశ్ ఖన్నాపై బాలీవుడ్‌ విలక్షణ నటుడు నసీరుద్దీన్‌ షా చేసిన విమర్శలు బాలీవుడ్లో చిన్నపాటి దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్‌ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఘాటుగా స్పందించింది. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తిని గురించి విమర్శలు చేయడం' దారుణమంటూ ఆమె మండిపడింది.

దీంతో ఈ వివాదంపై నసీరుద్దీన్ షా తాజాగా వివరణ ఇచ్చారు. ఎవరినీ వ్యక్తిగతంగా గాయపరిచే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినైనా తన వ్యాఖ్యల వల్ల బాధపడితే క్షమించాలని కోరారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, 70 దశకంలోని పరిస్థితి గురించి వ్యాఖ్యానించానని ఆయన చెప్పుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూలో రాజేశ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. 'ఆయనో మామూలు నాసిరకం అథమ నటుడు. ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుంది. మేధోపరంగానూ ఆయన గొప్ప వ్యక్తేమీ కాదు. ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదు. అందువల్లే 70వ దశకంలో సగటు సినిమాలు వచ్చాయి' అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement