నాన్న చెప్పినట్టే మారాను: నటి | Rajesh Khanna Wanted Daughter Twinkle to Be a Writer | Sakshi
Sakshi News home page

నాన్న చెప్పినట్టే మారాను: నటి

Published Mon, Apr 17 2017 7:04 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

నాన్న చెప్పినట్టే మారాను: నటి

నాన్న చెప్పినట్టే మారాను: నటి

ముంబై: ఒకప్పటి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రాజేష్‌ ఖన్నా, నటి డింపుల్‌ కపాడియాల ముద్దుల కూతురు ట్వింకిల్‌ ఖన్నా. తల్లిదండ్రుల బాటలో ట్వింకిల్‌ కూడా నటనను కెరీర్‌గా ఎంచుకున్నా.. ఆమెను రచయిత్రిగా చూడాలన్నది రాజేష్‌ ఖన్నా కోరికట. ట్వింకిల్‌ ఈ విషయాన్ని చెప్పింది.

'నేను రచయిత్రి కావాలన్నది నాన్న కోరిక. నేను రచయిత్రిగా ఉండాలని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నాన్న కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉంది' అని ట్వింకిల్‌ వెల్లడించింది. 1995లో ఆమె బర్సాత్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాకు ఫిల్మ్‌ ఫేర్ అవార్డు అందుకుంది. 2001లో హీరో అక్షయ్‌ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఇంటీరియర్‌ డిజైనర్‌గా, కాలమిస్ట్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement