ఆ వివాదం ముగిసిపోయిందండి: హీరో | Rajesh Khanna episode over with Naseeruddin graceful apology, says Akshay | Sakshi
Sakshi News home page

ఆ వివాదం ముగిసిపోయిందండి: హీరో

Published Tue, Aug 2 2016 3:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ఆ వివాదం ముగిసిపోయిందండి: హీరో

ఆ వివాదం ముగిసిపోయిందండి: హీరో

అలనాటి బాలీవుడ్‌ స్టార్‌ హీరో రాజేశ్‌ ఖన్నా ఓ అథమస్థాయి నటుడని, అతని వల్ల బాలీవుడ్‌లో చెత్త సినిమాలు వచ్చాయంటూ తీవ్ర వ్యాఖ్యలతో నసీరుద్దీన్‌ షా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజేశ్ ఖన్నా అల్లుడు, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ స్పందించారు.

‘నేను సినీ పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నాను. వేరే నటుడిగా గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా చెప్పండి. తెలివైన వారు తమ పని ఏదో తాము చూసుకుంటారని చెప్తారు. నేను కూడా నా పనేదో నేను చూసుకుంటాను. ఇతరుల మీద వ్యాఖ్యలు చేయడానికి నేనెవరిని?’  అని ఆయన పేర్కొన్నారు.

తన మామపై వ్యాఖ్యల విషయంలో నసీరుద్దీన్‌ షా ఉదారంగా క్షమాపణలు చెప్పారని, కాబట్టి ఈ వివాదం ముగిసిపోయినట్టేనని అక్షయ్‌ అన్నారు. ‘ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు మాట్లాడారు. తమ గళాన్ని వినిపిస్తారు. అయినా ఇప్పుడు వివాదం ముగిసిపోయింది. నసీరుద్దీన్‌ షా క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని మనందరం మరిచిపోవడమే మంచిది’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement