ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య | Naseer's Rajesh Khanna Remark: Keep Calm and Play Pokemon, Tweets Twinkle | Sakshi
Sakshi News home page

ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య

Published Tue, Jul 26 2016 10:15 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య

ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య

ముంబై: రాజేశ్ ఖన్నా మంచి నటుడు కాదంటూ నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగిసిందని రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్‌ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని తన మద్దతుదారులకు సూచించింది. 'ఇక చాలు. ఈ వివాదం ఇక్కడితో ఆపేయండి. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ మనకు ఉంది. ఇక అందరం పోకెమాన్ ఆట ఆడుకుందాం' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. 'ఈ ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా పోకెమాన్ ఆడడానికి వెళతా'నని పేర్కొంది.

రాజేశ్ ఖన్నా గొప్ప నటుడు కాదని, అతడి నటన సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండేదని ఓ ఇంటర్య్వూలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించడంతో ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ఈ లోకంలోని తన తండ్రిని విమర్శించడం తగదని ఆమె పేర్కొన్నారు. అయితే తాను కావాలని రాజేశ్ ఖన్నాను విమర్శించలేదని వివరణ ఇచ్చిన నసీరుద్దీ షా క్షమాపణ కూడాచెప్పారు. తనకు మద్దతు నిలిచిన వారికి ట్వింకిల్ ఖన్నా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement