poor actor
-
ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య
ముంబై: రాజేశ్ ఖన్నా మంచి నటుడు కాదంటూ నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగిసిందని రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని తన మద్దతుదారులకు సూచించింది. 'ఇక చాలు. ఈ వివాదం ఇక్కడితో ఆపేయండి. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ మనకు ఉంది. ఇక అందరం పోకెమాన్ ఆట ఆడుకుందాం' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. 'ఈ ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా పోకెమాన్ ఆడడానికి వెళతా'నని పేర్కొంది. రాజేశ్ ఖన్నా గొప్ప నటుడు కాదని, అతడి నటన సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండేదని ఓ ఇంటర్య్వూలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించడంతో ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ఈ లోకంలోని తన తండ్రిని విమర్శించడం తగదని ఆమె పేర్కొన్నారు. అయితే తాను కావాలని రాజేశ్ ఖన్నాను విమర్శించలేదని వివరణ ఇచ్చిన నసీరుద్దీ షా క్షమాపణ కూడాచెప్పారు. తనకు మద్దతు నిలిచిన వారికి ట్వింకిల్ ఖన్నా ధన్యవాదాలు తెలిపారు. -
సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!
అలనాటి నటుడు రాజేశ్ ఖన్నాపై బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా చేసిన విమర్శలు బాలీవుడ్లో చిన్నపాటి దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఘాటుగా స్పందించింది. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తిని గురించి విమర్శలు చేయడం' దారుణమంటూ ఆమె మండిపడింది. దీంతో ఈ వివాదంపై నసీరుద్దీన్ షా తాజాగా వివరణ ఇచ్చారు. ఎవరినీ వ్యక్తిగతంగా గాయపరిచే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినైనా తన వ్యాఖ్యల వల్ల బాధపడితే క్షమించాలని కోరారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, 70 దశకంలోని పరిస్థితి గురించి వ్యాఖ్యానించానని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో రాజేశ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. 'ఆయనో మామూలు నాసిరకం అథమ నటుడు. ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుంది. మేధోపరంగానూ ఆయన గొప్ప వ్యక్తేమీ కాదు. ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదు. అందువల్లే 70వ దశకంలో సగటు సినిమాలు వచ్చాయి' అని విమర్శించారు. -
మా నాన్నను చెత్త నటుడంటావా!
1970 దశకంలో బాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నటుల్లో రాజేశ్ ఖన్నా ఒకరు. ఆరాధన (1969), హాథీ మేరే సాథీ (1971), ఆనంద్ (1971) వంటి సినిమాలతో గొప్ప నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకున్న నటుడు ఆయన. ఖన్నా గురించి బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా తాజాగా విస్మయపరిచే విమర్శలు చేశారు. ఆయనో మామూలు నాసిరకం నటుడని, ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుందంటూ విమర్శించాడు. మేధోపరంగా ఆయన గొప్ప వ్యక్తేమీ కాదని, ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదని, ఆయన వల్ల 70వ దశకంలో సగటు సినిమాలే వచ్చాయంటూ షా చెప్పుకొచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో తన గళాన్ని గట్టిగా వినిపించే రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.. ఈ విషయంలో ఘాటుగా స్పందించింది. షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ట్వింకిల్.. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తి గురించి విమర్శలు చేయడం నిజమైన సంకుచితత్వం’ అని బదులిచ్చింది.