బాలీవుడ్ స్టార్ నసీరుద్దీన్ షా సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇచ్చిన అవార్డులను బాత్రూమ్ డోర్లకు హ్యాండిల్స్‌గా వాడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఒక పాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్పనటుడు అవుతాడు. అంతేకానీ ఇండస్ట్రీలో ఉన్న బోలెడంతమంది నటుల్లో ఒకరిని సెలక్ట్ చేసుకుని ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడు ఇతడే అని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి అవార్డులను చూసి నేను పొంగిపోను.
ఆ అవార్డులతో అదే పని చేస్తా
అంతెందుకు ఇటీవల నాకు ప్రకటించిన రెండు పురస్కారాలను అందుకోవడానికి కూడా నేను వెళ్లలేదు. కాబట్టి నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను ఫామ్‌హౌస్ కడితే అక్కడ వాష్‌రూమ్ హ్యాండిల్స్‌గా అవార్డులను పెట్టాలనుకున్నాను. అప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్లే అందరూ హ్యాండిల్ పట్టుకుంటారు. అంటే వారికి అవార్డు వచ్చినట్లే కదా! అందుకే అదే పని చేశాను. ఫిలింఫేర్ అనీ, అదనీ, ఇదనీ.. ఇచ్చే అవార్డుల్లో నాకేమీ గొప్ప కనిపించడం లేదు. కెరీర్ ప్రారంభంలో అవార్డు వస్తే సంతోషంగా ఫీలయ్యాను. ఆ తర్వాత వరుసగా ట్రోఫీలు రావడం మొదలయ్యాయి.
వెధవలా మిగిలిపోతానేమోనని నాన్న కంగారు
రానురానూ ఇవన్నీ లాబీయింగ్ వల్ల వచ్చినవే అని అర్థమైంది. దీంతో వాటిని పట్టించుకోవడం మానేశా. కానీ పద్మశ్రీ, పద్మ భూషణ్ అందుకున్నప్పుడు మాత్రం మా నాన్న అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ పనికి మాలిన పని చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక వెధవలా మిగిలిపోతావు అనేవాడు. ఆరోజు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి పురస్కారం అందుకుంటున్న సమయంలో మా నాన్న ఇదంతా చూసి సంతోషిస్తాడని కృతజ్ఞతగా పైకి చూశాను. ఈ రెండు పురస్కారాలు అందుకున్నందుకు నేను గర్విస్తున్నాను. కానీ పోటీపడి ప్రకటించే అవార్డులకు మాత్రం నేను వ్యతిరేకిని' అని చెప్పుకొచ్చాడు నసీరుద్దీన్ షా.
చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్
Comments
Please login to add a commentAdd a comment