చాన్నాళ్ల తర్వాత మళ్లీ శ్వేతబసు..! | This Short Film About Ex Lovers is Shweta Basu Prasad Return to Screen | Sakshi
Sakshi News home page

చాన్నాళ్ల తర్వాత మళ్లీ శ్వేతబసు..!

Published Tue, Jul 19 2016 8:21 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

చాన్నాళ్ల తర్వాత మళ్లీ శ్వేతబసు..!

చాన్నాళ్ల తర్వాత మళ్లీ శ్వేతబసు..!

2014లో సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయి.. జీవితంలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న నటి శ్వేతబస్సు ప్రసాద్.. 'కొత్త బంగారు లోకం'  సినిమాలో ఎక్కడ అంటూ ముద్దుముద్దు మాటలతో అలరించిన ఈ హీరోయిన్ వ్యభిచారం కేసులో అరెస్టు కావడంతో ఆమె కెరీర్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో చాలారోజుల తర్వాత శ్వేతబస్సు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంది. ఓ చిట్టి సినిమాతో (షార్ట్ ఫిలిం) ప్రేక్షకులను పలుకరించింది.

అధీరాజ్ బోస్ తెరకెక్కించిన 'ఇంటీరియర్ కెఫె.. నైట్' అనే షార్ట్ ఫిలింలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఈ షార్ట్ ఫిలింలో బాలీవుడ్ నట దిగ్గజాలు నసీరుద్దీన్ షా, షెర్నాజ్ పటేల్ కూడా నటించడం గమనార్హం. షెర్నాజ్ పటేల్ యువతిగా ఉన్నప్పటి పాత్రను శ్వేత పోషించింది. చాలా ఏళ్ల ఎడబాటు తర్వాత ఓ రాత్రి కోల్‌కతాలోని నైట్‌ కెఫెలో మాజీ ప్రేమికులు మళ్లీ కలుసుకుంటే అనే ఫీల్ గుడ్ సబ్జెక్ట్‌ తో, మంచి థీమ్‌తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింకు శ్వేతబసు సహా నిర్మాతగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement